అంటార్కిటికాకూ పాకిన కరోనా వైరస్... చిలీ బృందంలో పాజిటివ్ కేసులు - BBC Newsreel

ప్రచురణ

కరోనావైరస్ అంటార్కిటికా ఖండానికి కూడా పాకింది.అక్కడి బర్నార్డో ఓహిగిన్స్ పరిశోధక కేంద్రంలో 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు చిలీ సైన్యం తెలిపింది.

కరోనా సోకినవారిలో 26 మంది సైనికులు, 10 మంది ఇతర సిబ్బంది ఉన్నట్లు చిలీ సైన్యం పేర్కొంది. వీళ్లందరినీ చిలీకి వెనక్కిపిలిపించినట్లు తెలిపింది.

అంటార్కిటికాలో మొత్తంగా నాలుగు శాశ్వత పరిశోధక కేంద్రాలు ఉన్నాయి. వీటిలో బర్నార్డో ఓహిగిన్స్ పరిశోధక కేంద్రం ఒకటి. ఈ కేంద్రం చిలీ సైన్యం నిర్వహణలో ఉంది.

ఈ కేంద్రానికి అవసరమైన వస్తువులను, మనుషులను తరలించేందుకు ఉపయోగించే సర్హెంతో ఆల్దియా అనే ఓడలో ముగ్గురికి కరోనా సోకినట్లు కొన్ని రోజుల క్రితమే చిలీ నావికాదళం ధ్రువీకరించింది.

నవంబర్ 27న ఈ ఓడ అంటార్కిటికాకు వెళ్లి, డిసెంబర్ 10న చిలీకి తిరిగివచ్చింది.

అంటార్కిటికా పర్యటనకు వెళ్లిన తమ వాళ్లందరికీ పీసీఆర్ పరీక్షలు చేయించామని, అందరికీ ఫలితం నెగటివ్ వచ్చిందని చిలీ నావికా దళం తెలిపింది.

అంటార్కిటికాలోనూ కరోనా కేసులు నమోదు కావడంతో ఇప్పుడు భూమి మీద ప్రతి ఖండానికీ కరోనావైరస్ పాకినట్లైంది. ఇదివరకు ఆ ఖండంలో కేసులు నమోదు కాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)