దేశవ్యాప్తంగా తొలిదశ కరోనావైరస్ వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం - కేంద్ర ప్రభుత్వం - Newsreel

ఫొటో సోర్స్, JOHN CAIRNS/UNIVERSITY OF OXFORD
"రాబోయే కొన్ని వారాల్లో కరోనావైరస్ వ్యాక్సీన్‌కు లైసెన్స్ లభించబోతోంది" అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సెక్రటరీ రాజేష్ భూషన్ తెలిపారు.
మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలు వ్యాక్సీన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకున్నాయని తెలిపారు.
ఏఎన్ఐ వార్తా సంస్థ వివరాల ప్రకారం.. ఈ అశంపై వ్యాక్సీన్ తయారీదారులు అందరితోనూ, శాస్త్రవేత్తలతోనూ ప్రధాని మోదీ చర్చించారు. 6 వ్యాక్సీన్లు క్లినికల్ ట్రయిల్ దశల్లో ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది.
శాస్త్రవేత్తలు ఆమోదం తెలుపగానే వ్యాక్సీన్లను భారీ స్థాయిలో ఉత్పత్తి చెయ్యడానికి సన్నాహాలు చేస్తామని...స్వల్ప వ్యవధిలోనే ప్రతీ ఒక్కరికీ వ్యాక్సీన్ అందేలా ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు రంగం సిద్ధం చేసామని రాజేష్ భూషణ్ తెలిపారు.
ఈ ఏడాది ఆగస్ట్‌లో ‘నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆఫ్ వ్యాక్సీన్ అడ్మినిస్టేషన్ ఫర్ కోవిడ్19’ (ఎన్ఈజీవీఏసీ) ప్రారంభించారు. ఈ నిపుణుల బృందం సహకారంతో..ప్రాధాన్యత ఇవ్వవలసిన జనాభా జాబితా, వ్యాక్సీన్ ఎంపిక, పంపిణీ, ట్రాకింగ్ విధానం మొదలైన అంశాలను నిర్ణయించారు.
రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి వ్యాక్సినేషన్ ప్రారంభించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
అయితే, ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, దేశ పౌరులందరూ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని రాజేష్ భూషన్ కోరారు.
ఎన్ఈజీవీఏసీ సిఫారసు ప్రకారం...హెల్త్‌కేర్ వర్కర్లకూ, డాక్టర్లకూ, కేంద్ర, రాష్ట్ర పోలీస్ ఉద్యోగులకు, సాయుధ దళాలకు, హోమ్ గార్డ్స్, సివిల్ డిఫెన్స్ దళాలకు, విపత్తు నిర్వహణ వలంటీర్లకు, మున్సిపాలిటీ వర్కర్లకు, 50 ఏళ్లు పైబడిన వారికి ముందుగా వ్యాక్సీన్లు అందజేస్తామని ఆరోగ్య శాఖ ప్రకటించింది.
"అన్ని రాష్ట్రాలలోనూ హెల్త్‌కేర్ వర్కర్లకు సంబంధించిన డాటా సేకరణ ఇప్పటికే ప్రారంభమయ్యింది. ఈ డాటా అంతా ‘కో-విన్’ (CO-WIN) సాఫ్ట్‌వేర్‌లోకి అప్లోడ్ చేస్తున్నారు. ఈ డాటాను పరీక్షించి నిర్థారణ చేస్తామని" రాజేష్ భూషన్ తెలిపారు.
మొదట మూడు కోట్ల హెల్త్‌కేర్ వర్కర్లకూ, ఫ్రంట్ లైన్ వర్కర్లకూ సరిపడా వ్యాక్సీన్లను నిల్వ చెయ్యడానికి ప్రస్తుతం ఉన్న కోల్డ్ స్టోరేజ్ సరిపోతుందని ఆయన వివరించారు.
దేశవ్యాప్తంగా, టీకా ఇవ్వడంలో శిక్షణ పొందిన నర్సులు (ఆక్జిలరీ నర్స్ మిడ్‌వైఫ్ - ఏఎన్ఎం) 2.39 లక్షల మంది ఉన్నారని...అయితే, కోవిడ్19 వ్యాక్సినేషన్ కోసం 1.54 లక్షలమంది ఏఎన్ఎంలకు మాత్రమే వ్యాక్సినేషన్ విధుల్లోకి తీసుకుంటామని ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సాధారణ ఆరోగ్య సేవలకు అడ్డురాదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
ఇండియా రెగ్యులేటరీ ఫ్రేమవర్క్‌లో అత్యవసర వినియోగానికి సంబంధించి, అనుమతి ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన నిబంధన ఉందని రాజేష్ భూషన్ తెలిపారు.
"ప్రస్తుతం మూడు వ్యాక్సీన్లు లైసెన్స్ పొందేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిని నిశితంగా పరిశీలిస్తున్నాం. మూడింటికీ లేదా కనీసం ఒకదానికైనా త్వరగా లైసెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి" అని నీతి ఆయోగ్ సభ్యులు డా. వీకే పాల్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒలంపిక్ క్రీడల్లో 'బ్రేక్ డాన్స్'.. 2024 పారిస్ పోటీలకు అర్హత
పారిస్‌లో 2024లో జరగనున్న ఒలింపిక్ క్రీడల్లో 'బ్రేకింగ్' (బ్రేక్ డాన్స్ లో ఒక తరహా నాట్యం) అనే డాన్స్ క్రీడకు చోటు దక్కింది.
2020లో టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు కోవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో 2021లో టోక్యోలో జరగనున్న క్రీడల్లో సర్ఫింగ్, స్కేట్ బోర్డింగ్, క్లైమ్బింగ్‌లను కూడా కొత్తగా చేర్చారు. ఇవి 2024లో కూడా కొనసాగుతాయి.
అయితే, 2024లో జరగనున్న ఒలింపిక్స్ లో పార్కర్ గేమ్ కి చోటు దక్కలేదు. ఈ గల్లీ క్రీడలో సాధారణంగా పరుగు పెట్టడం, గెంతడం, అవాంతరాలను దాటుకుంటూ క్లైమ్బింగ్ చేయడం లాంటివి ఉంటాయి.
"ఈ పోటీలో చోటు దక్కడం వలన బ్రేకింగ్ కి ఒక క్రీడగా గుర్తింపు వస్తుంది" అని బ్రిటిష్ బ్రేక్ డాన్సర్ కరం సింగ్ బీబీసీ స్పోర్ట్ కి చెప్పారు. "ఒలింపిక్స్ లో సంప్రదాయ క్రీడలను అనుసరించని యువత ఇక ముందు క్రీడలు చూసేలా బ్రేకింగ్ ఆకర్షిస్తుంది" అని ఆయన అన్నారు.
స్క్వాష్, బిలియర్డ్స్, చెస్ గేమ్స్ కి ఒలింపిక్స్ లో చోటు లభించలేదు.
బ్రేకింగ్ లో కళాత్మకత, క్రీడా తత్పరత సమ్మిళితం అవ్వడంతో పాటు పోటీదారుని నాట్య కదలికలు, పద విన్యాసం, నాట్యంలో శక్తివంతమైన కదలికలు, స్తంభనలు ఉంటాయి.
క్రీడాకారుడు శక్తివంతమైన కదలికలు చేసేటప్పుడు శరీరం వేగంగా ఊగగా, ఏదైనా ఒక ప్రత్యేక భంగిమలో కొన్ని క్షణాల పాటు ఉన్నప్పుడు ఆ క్షణం స్తంభిస్తుంది.
ఈ పోటీలో పాల్గొనే వారిని బి-బాయ్స్ - బి- గర్ల్స్ గా పిలుస్తారు.
వీరి గెలుపును కేవలం సాంకేతిక నైపుణ్యం ఆధారంగా కాకుండా, వారి హావభావాలు, కళాత్మకత, నాట్యాన్ని ఎంత శక్తివంతంగా, వేగంగా , తాళానికి అనుగుణంగా, సునాయాసంగా ప్రదర్శిస్తున్నారో అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని విజేతను నిర్ణయిస్తారు.
బ్రేకింగ్, సర్ఫింగ్, స్కేట్ బోర్డింగ్, క్లైమ్బింగ్ లను ఒలింపిక్స్ లో చేర్చాలని 2024 పారిస్ ఆర్గనైజింగ్ కమిటీ గత సంవత్సరం ప్రతిపాదించింది.
ఇవి కూడా చదవండి:
- అనసూయ సారాభాయ్: కార్మిక ఉద్యమానికి బాటలు వేసిన మహిళ
- ఫౌజీ గేమ్ పబ్జీని మరిపించగలదా? అక్షయ్ కుమార్ మద్దతిస్తున్న ఈ ఆటలో స్పెషాలిటీ ఏంటి?
- 3 వేల మంది చైనా సంతతి ప్రజలు భారత్‌లో బందీలుగా మారినప్పుడు ఏం జరిగిందంటే..
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- మోదీ చెప్పినట్లు దేశంలో రోజుకు 10 లక్షల టెస్టులు చేయడం సాధ్యమేనా...
- కరోనావైరస్ ఆదివాసీ తెగలను అంతం చేస్తుందా...
- కరోనావైరస్తో అల్లాడిన వూహాన్ నగరంలో ఇప్పుడు అంబరాన్నంటే సంబరాలు
- ఎక్స్ పొనెన్షియల్ గ్రోత్ బయాస్: కోవిడ్-19 కేసులు లెక్కించడంలో జరుగుతున్న కామన్ తప్పిదం ఇదే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























