స్పెయిన్: కరోనావైరస్ భయంతో లక్ష జంతువుల్ని చంపేయాలని అధికారుల ఆదేశం

ఫొటో సోర్స్, GETTY IMAGES
స్పెయిన్‌లోని అరగాన్ ప్రావిన్సులో మింక్ అనే జంతువులను పెంచే ఓ ఫామ్‌లో కరోనావైరస్ వ్యాపించింది.
దీంతో అందులో ఉన్న దాదాపు లక్ష మింక్ జంతువులను చంపేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఆ ఫామ్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి భార్య మే నెలలో కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు.
ఆ తర్వాత ఆమె భర్త, ఆయనతోపాటు ఫామ్‌లో పనిచేస్తున్న మరో ఆరుగురికి కూడా వైరస్ సోకింది.
దీంతో ఆ ఫామ్‌లో ఉన్న జంతువులను అధికారులు విడిగా ఉంచి, జాగ్రత్తగా పరిశీలించారు.
జులై 13న వాటికి పరీక్షలు నిర్వహించగా, దాదాపు 87 శాతం జంతువులు ఇన్ఫెక్షన్‌తో ఉన్నట్లు తేలింది.
ఆరోగ్యశాఖ అధికారులు ఆ ఫామ్‌లో ఉంటున్న మొత్తం 92,700 మింక్‌లను చంపేయాలని ఆదేశించారు.
ఫామ్ నడుపుతున్న సంస్థకు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మింక్‌లను ఉన్నితో ఉండే వాటి చర్మం కోసం ఫామ్‌ల్లో పెంచుతుంటారు.
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌కు 200 కి.మీ.ల దూరంలోని ఓ గ్రామంలో ఈ ఫామ్ ఉంది.
స్పెయిన్‌లో కరోనావైరస్ హాట్‌స్పాట్లుగా ఉన్న ప్రాంతాల్లో అరగాన్ ప్రావిన్సు కూడా ఒకటి. ఇక్కడ దాదాపు 2.5 లక్షల కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 28 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
జంతువుల నుంచి మనుషులకు కరోనావైరస్ వ్యాపించే ప్రమాదాన్ని నివారించేందుకు మింక్‌లను చంపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అరగాన్ వ్యవసాయశాఖ మంత్రి జొవాక్విన్ ఒలోనా చెప్పారు.
‘‘జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు ఈ వైరస్ వ్యాపిస్తుందా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ, ఫామ్ ఉద్యోగి నుంచి ఈ వైరస్ జంతువులకు సోకి ఉండొచ్చు. లేదా జంతువుల నుంచే ఫామ్ ఉద్యోగులకు వచ్చి ఉండొచ్చు’’ అని ఆయన అన్నారు.
పిల్లులు, కుక్కలు సహా కొన్ని రకాల జంతువుల్లోనూ కరోనావైరస్ ప్రబలే అవకాశముందని ఇటీవల కొన్ని అధ్యయనాలు సూచించాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
జంతువుల నుంచి మనుషులకు కరోనావైరస్ వ్యాపించే విషయం గురించి అంతగా స్పష్టత లేదు. దీనిపై పరిశోధనలు సాగుతున్నాయి.
డెన్మార్క్, నెదర్లాండ్స్‌ల్లోని మింక్ ఫామ్‌ల్లో కరోనావైరస్ వ్యాపించిన ఉదంతాలు ఇటీవల వచ్చాయి.
గత కొన్ని నెలల్లో నెదర్లాండ్స్‌లో కరోనావైరస్ వ్యాపించినట్లుగా గుర్తించిన ఫామ్‌ల్లో వేల సంఖ్యలో మింక్‌లను చంపేశారు.
జంతువుల నుంచి కరోనావైరస్ సోకినట్లుగా అనుమానిస్తున్న కేసులు మే నెలలో రెండు వచ్చాయని నెదర్లాండ్స్ ప్రభుత్వం తెలిపింది.
జంతువుల నుంచి మనుషులకు కరోనావైరస్ వ్యాపించినట్లుగా గుర్తించిన కేసులు ఇవే ప్రథమం కావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అభిప్రాయపడింది.
‘‘మనుషుల నుంచి కరోనావైరస్ మింక్‌లకు సోకిన ఘటనలు ఉన్నాయి. అలాగే మింక్‌ల నుంచి మనుషులకు వైరస్ సోకిన ఉదంతాలూ ఉన్నాయి. వైరస్ వ్యాప్తిలో మింక్‌లు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయన్నదానిపై అధ్యయనం చేస్తున్నాం’’ అని డబ్ల్యూహెచ్ఓ ఎపిడమాలజిస్ట్ డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ అన్నారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చైనా కంపెనీలు
- కారంచేడు దాడికి 35 ఏళ్లు: 'చుట్టూ చేరి కర్రలతో కొట్టారు... మమ్మల్ని తగలబెట్టాలని చెత్త అంతా పోగేశారు'
- హువావే: ఈ చైనా కంపెనీపై ప్రపంచమంతా ఎందుకు కోపంగా ఉంది?
- ఆల్ఫ్స్ పర్వతాలపై భారతీయ పత్రికలు, 1966 విమాన ప్రమాదం నాటివేనా
- ఈ ఫొటోతో చైనాను అమెరికా మంత్రి ఆటాడుకున్నారా? జిన్‌పింగ్‌ను ఇబ్బంది పెట్టారా?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- ‘పెట్టుబడుల వేటగాడు ముఖేశ్ అంబానీ’ 5జీ నిర్ణయం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు
- ‘టీకా వేయించుకోవాలి.. కరోనావైరస్ సోకించుకోవాలి - వలంటీర్లు కావలెను’
- ‘ఉద్యోగం పోయింది.. అందుకే నా సెక్సీ ఫోటోలు అమ్ముకుంటున్నా’
- కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు
- 996 విధానం అంటే ఏంటి? ‘ఆలీబాబా’ జాక్ మా దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























