You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జూమ్ వీడియో కాన్ఫరెన్స్: అమెరికాలో ఓ చైనా గ్రూప్ అకౌంటును రద్దు చేసిన జూమ్
వీడియో కాన్ఫరెన్స్ సాఫ్ట్‌వేర్ భారీ సంస్థ 'జూమ్' అమెరికాలోని ఒక చైనా సామాజిక ఉద్యమకారుల గ్రూప్ అకౌంట్‌ను సస్పెండ్ చేసింది. తియానన్మెన్ స్క్వేర్ నిరసన ప్రదర్శనను స్మరించుకుంటూ వారొక కార్యక్రమం చేసిన తరువాత జూమ్ ఈ నిర్ణయం తీసుకుంది.
'హ్యూమానిటేరియన్ చైనా' అనే పేరు పెట్టుకున్న ఆ బృందం నిర్వహించిన జూమ్ సమావేశంలో చైనా కార్యకర్తల సంస్థకు చెందిన జూమ్ అకౌట్ ని జూమ్ సస్పెండ్ చేసింది.
అమెరికాలో కొంత మంది 'హ్యూమానిటేరియన్ చైనా’ కి చెందిన కార్యకర్తలు తియానాన్మెన్ స్క్వేర్ దాదాపు 250 మంది పాల్గొన్నారు. వారిలో చైనా నుంచి పాల్గొన్నవారు కూడా ఉన్నారు.
స్థానిక చట్టాలను అనుసరించే ఈ అకౌంట్ ని రద్దు చేసినట్లు జూమ్ తెలిపింది. అయితే, ఆ అకౌంట్‌ను తర్వాత పునరుద్ధరించారు.
"ఏదైనా సమావేశంలో వివిధ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నప్పుడు సభ్యులు ఆయా దేశాల చట్టాలకు లోబడి ప్రవర్తించాల్సి ఉంటుందని" జూమ్ పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
"స్థానిక చట్టాలను పాటించేలా చూస్తూ, తమ విధానాలను నిరంతరం సమీక్షించుకుంటూ ఉంటామని" కంపెనీ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
కరోనా వైరస్ లాక్ డౌన్‌తో జూమ్ వెబ్‌సైట్ వాడే వినియోగదారులు విపరీతంగా పెరిగిపోవడంతో దాని భద్రత, గోప్యతా విధానాలపై నిఘా ఎక్కువైంది. ఒక్కొక్కసారి జూమ్ సమావేశాల్లో ఆహ్వానంలో లేని వ్యక్తులు వచ్చి అసభ్యకర, జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం కూడా జరగడంతో జూమ్ విమర్శలు ఎదుర్కొంది.
రహస్య సమావేశం
చైనా లో తియానాన్మెన్ స్క్వేర్ నిరసనల సంస్మరణార్ధం మే 31 వ తేదీన 'హ్యూమానిటేరియన్ చైనా' కార్యకర్తలు సమావేశం పెట్టుకున్నారు. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ 04వ తేదీన జరుగుతుంది.
ఈ సమావేశానికి నిరసనల్లో మృతి చెందిన ఒక నిరసనకారుని తల్లిని, నిరసనల్లో పాల్గొని 17 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించిన బీజింగ్ పౌరుడిని, కొంతమంది ప్రవాసంలో ఉన్న విద్యార్థి నాయకులను కూడా ఆహ్వానించారు.
చైనాలో ప్రజాస్వామ్యం కావాలని కోరుతూ 1989లో తియానాన్మెన్ స్క్వేర్‌లో జరిగిన నిరసనలతో సంబంధం ఉన్న చాలా మంది వ్యక్తులు మొదటిసారి ఈ సమావేశం ద్వారా కలిసినట్లు హ్యూమానిటేరియన్ చైనా సంస్థ అధ్యక్షుడు ఫెంగ్సువో జో సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రికకి తెలిపారు. ఆయన నిరసనల సమయంలో విద్యార్థి నాయకునిగా ఉన్నారు.
"మేము ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాల్సిందని” అన్నారు.
హ్యూమానిటేరియన్ చైనాకు చెందిన జూమ్ అకౌంట్ ని జూన్ 07వ తేదీన సస్పెండ్ చేశారు.
"అమెరికాలో కూడా ఇలా జరగటం నాకు చాలా కోపం గా ఉందని” ఫెంగ్సువో అన్నారు.
మే 22 నుంచి జూమ్ యాప్ వాడడానికి వీలు కావడం లేదని మరొక తియానన్మెన్ కార్యకర్త చెప్పారు. ఆయన ప్రపంచం పై చైనా ప్రభావం అనే ఆన్లైన్ సమావేశం నిర్వహించాలని అనుకున్నప్పటి నుంచి ఇలా జరిగిందని వివరించారు. ఆయన ప్రసంగం మొదలవ్వక ముందే అకౌంట్ పని చేయడం ఆగిపోయిందని తెలిపారు.
జూమ్ రాజకీయ సెన్సార్షిప్ ని పాటిస్తుందా అని ప్రశ్నించినప్పుడు జూమ్ సంస్థ సమాధానం ఇవ్వలేదని హాంగ్ కాంగ్ అలియన్స్ చైర్మన్ లీ చెప్పారు.
గతంలో రెండు సార్లు వారి బృందం జూమ్ లో సమావేశాలు నిర్వహించుకున్నప్పుడు ఏ సమస్యా రాలేదని చెప్పారు.
చైనాలో ప్రజాస్వామ్యం కావాలని కోరుతూ 1989లో తియానాన్మెన్ స్క్వేర్‌లో జరిగిన నిరసనల్లో సైన్యం దాడి జరిపి నిరసనలను అణిచివేసింది.
ఈ దాడిలో కనీసం 10,000 మంది చనిపోయి ఉంటారని అంచనాలు ఉన్నాయి.
ఈ నిరసనల వార్షికోత్సవాలు జరుపుకోవడం చైనా చాలా సున్నితమైన అంశంగా పరిగణిస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని చైనా తీవ్రంగా అడ్డుకుంటోంది.
ఇవి కూడా చదవండి
- కరోనావైరస్ కేసులు: టాప్ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది?
- భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి? ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది?
- గృహ హింస: ‘లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్‌లో రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులతో ‘పీప్లీ లైవ్’ను తలపిస్తున్న ఇల్లు
- ఎవరెస్ట్ ఎత్తు ఎంత? చైనా ఎందుకు మళ్లీ లెక్కిస్తోంది? 4 మీటర్ల తేడా ఎందుకు వచ్చింది?
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
- ఆరాంకో: ప్రపంచంలో అత్యధిక లాభాలు సంపాదించే కంపెనీ షేర్ మార్కెట్లోకి ఎందుకొస్తోంది?కరోనావైరస్: సౌదీ అరేబియా ఎప్పుడూ లేనంత కష్టాల్లో కూరుకుపోయిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)