పారిస్‌లో నలుగురు సహచరులను పొడిచి చంపిన పోలీస్

ఫొటో సోర్స్, Reuters
ఫ్రాన్స్ రాజధాని పారిస్ నడిబొడ్డున పోలీస్ కేంద్ర కార్యాలయం ప్రాంగణంలో నలుగురు సహచర పోలీసులను మరో పోలీసు కత్తితో పొడిచి చంపేశాడని ఫ్రాన్స్ మీడియా తెలిపింది. అతడిని తర్వాత ఓ పోలీసు అధికారి కాల్చి చంపారు.
అతడి పేరు వెల్లడి కాలేదు. దాడికి కారణాలపై అధికారిక ప్రకటనేదీ ఇంకా రాలేదు. పారిస్ మధ్య ప్రాంతంలోని ఇల్ డే లా సైట్లో గురువారం ఈ ఘటన జరిగింది.
పోలీసులపై హింస పెరుగుతుండటం, పనిగంటలు, వనరుల కొరత, వివాదాస్పద పెన్షన్ సంస్కరణలకు సంబంధించి వేల మంది పోలీసులు బుధవారం దేశవ్యాప్తంగా సమ్మె చేశారు. మరుసటి రోజే ఈ ఘటన జరిగింది.

ఫొటో సోర్స్, EPA
స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సదరు ఉద్యోగి భవనంలోని తన కార్యాలయానికి వెళ్లి సహచరులపై కత్తితో దాడి చేశాడని ఫ్రాన్స్ మీడియా తెలిపింది. అతడు రెండు ఆఫీసుల్లో ముగ్గురిని, మెట్లపై మరో ఇద్దరు మహిళలను పొడిచాడని చెప్పింది.
మృతుల్లో ముగ్గురు మగవారు, ఒక మహిళ ఉన్నారు. వీరు అధికారులు, పరిపాలనా సిబ్బంది. దాడిలో ఇంకో మహిళ గాయపడ్డారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్, ప్రధానమంత్రి ఎడ్వర్డ్ పిలిప్ ఘటనా స్థలాన్ని సందర్శించారు.

ఫొటో సోర్స్, Reuters
ప్రఖ్యాత నాట్రడామ్ కేథడ్రల్ చర్చి, ఇతర పర్యటక ప్రదేశాలకు సమీపంలోనే ఫ్రాన్స్ పోలీసు కేంద్ర కార్యాలయం ఉంది.
దాడికి పాల్పడిన ఉద్యోగి వయసు 45 సంవత్సరాలని, అతడు ఐటీ నిపుణుడని, 16 ఏళ్లుగా పారిస్ పోలీసులకు సేవలందిస్తున్నాడని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి క్రిస్టోఫ్ కాస్టనర్ చెప్పారు.
అతడు ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశాడని అధికారులు తెలిపారు.
అతడికీ, అతడి సూపర్‌వైజర్‌కూ మధ్య విభేదాలు ఉన్నాయని పోలీసు సంఘానికి చెందిన క్రిస్టోఫ్ క్రెపిన్ చెప్పారు. ఇది ఉగ్రవాద చర్యగా కనిపించడం లేదన్నారు.
ఇవి కూడా చదవండి:
- మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ.. 502 పరుగులకు డిక్లేర్ చేసిన భారత్
- పీవీ సింధు: ఆదాయంలో క్రికెట్ స్టార్లను వెనక్కు నెట్టిన బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి
- పాక్‌పై నిజాం వారసుల గెలుపు.. హైదరాబాద్ నుంచి పంపిన సొమ్ము నిజాం మనవళ్లదేనన్న బ్రిటన్ కోర్టు
- తమిళనాడులోని కీళడి తవ్వకాల్లో బయల్పడిన 2,600 ఏళ్ల నాటి పట్టణ నాగరికత
- గోదావరిలోంచి బోటు వెలికితీత: ముందుకు సాగని ఆపరేషన్
- అమెజాన్ అడవుల్లో కార్చిచ్చుకు కారణం కరవా, చెట్ల నరికివేతా?
- 'మీ డబ్బు మాకొద్దు, ఆ డబ్బుతో యూరప్‌లో అడవులు పెంచండి' - జీ7 సహాయంపై బ్రెజిల్
- డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోతే జరిమానా కట్టాల్సిన పని లేదు... ఇలా చేస్తే చాలు
- ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్: పర్యావరణానికి ముప్పు తెస్తున్న ఆ ఉత్పత్తుల జాబితా ఇదే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























