You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
ఈ వారం భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కీలక ఘటనలు జరిగాయి. వాటిలో ముఖ్యమైన 5 కథనాలివి. మీరు ఇవి చదవకపోతే వెంటనే చదవండి.
1. శ్రీకాకుళంలోని గ్రామంపై ఎర్ర చీమలు ఎందుకు దాడి చేస్తున్నాయి, ఇవి మనుషులకు ఎంత ప్రమాదకరం?
"మా పేట మీద చీమలు దాడి చేస్తున్నాయి. కాపాడండి. ఇప్పటికే చీమలు కుట్టడంతో పది మంది వరకు ఆసుపత్రి పాలయ్యారు. ఇలాగైతే మా పేట ఖాళీ చేసి పోవాల్సి వస్తుందనే భయంగా ఉంది"అని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు తమ గోడు చెప్పుకున్నారు శ్రీకాకుళం జిల్లా ఇసకలపేట గ్రామ వాసులు.
స్పీకర్ భార్య వాణియే ఈ గ్రామ సర్పంచ్. చీమల నుంచి కాపాడండి అంటూ అంతకు ముందు జిల్లా కలెక్టరుకు కూడా స్థానికులు విజ్ఞప్తులు చేశారు. ఇంత భయపడే విధంగా చీమలు దాడి చేస్తాయా? వీటి దాడి ఎంత ప్రమాదకరం? ఇసకలపేటలోనే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ అంశాలపై ఆ గ్రామస్థులతో, ప్రభుత్వ అధికారులు, వైద్యులు, జూవాలజీ ప్రొఫెసర్లతో బీబీసీ మాట్లాడింది.
ఇవి కూడా చదవండి
2.మార్కెటింగ్ సంస్థల చేతికి మీ వివరాలు చిక్కకుండా ఈ సెట్టింగ్స్‌తో తప్పించుకోవచ్చు - డిజిహబ్
ఓ శుక్రవారం సాయంకాలం, కరెక్టుగా మీరు పని ముగించుకుని లాగవుట్ అవుదామనుకునే సమయంలో, "భారీ తగ్గింపులతో కొత్త మోడల్ స్పోర్ట్ షూస్" అని ఒక ఈమెయిల్ వస్తుంది.
ఆసక్తి పెరిగి మీరు దాన్ని తెరిచి చూస్తారు. ఆ షూ కంపెనీ వెబ్‍సైట్‍కు వెళ్లి అక్కడ మోడల్స్, ఆఫర్స్ గురించి వివరాలు తెలుసుకుంటారు. అతి మామూలుగా అనిపించే ఈ వ్యవహారం వెనుక పెద్ద ప్రైవసీ సమస్యే దాగుంది.
ఇలాంటి మార్కెటింగ్ మెయిల్స్ కేవలం కొత్త కొనుగోలు అవకాశాల గురించి చెప్పి ఊరుకోవు. మనకు తెలీకుండా మన వివరాలను సేకరిస్తాయి. వాటిని తమ విపరీత మార్కెటింగ్ ధోరణులకు అనుగుణంగా మలచుకుంటాయి.
ఇవి కూడా చదవండి
3. కుక్కలు మనుషుల్ని ఎందుకు కరుస్తాయి, వాటితో జాగ్రత్తగా ఎలా మెలగాలి?
కుక్క కాటు వల్ల వచ్చే రేబిస్ వ్యాధితో ప్రతీ సంవత్సరం సుమారు 55,000 మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
ఆసియా, ఆఫ్రికాల్లో కుక్క కాటుకు సంబంధించిన కేసులు ఎక్కువగా కనిపిస్తాయి.
భారతదేశంలో దాదాపు 30 నుంచి 60 శాతం రేబిస్ కేసులు, మరణాలు 15 ఏళ్లలోపు పిల్లల్లోనే కనిపిస్తున్నాయి.
కుక్క కాటుకు సంబంధించిన ఓ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లిందంటేనే ఈ వ్యవహారం ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
4. ఏడాదికి 12 వేల కోట్ల వ్యాపారం చేసే కంపెనీని విరాళంగా ఇచ్చేసిన 'శ్రీమంతుడు'
ప్రముఖ అవుట్‌డోర్ ఫ్యాషన్ బ్రాండ్ పటగోనియా వ్యవస్థాపకుడు, బిలియనీర్ ఇవాన్ చౌనార్డ్ తన కంపెనీని ఒక చారిటబుల్ ట్రస్ట్‌కు దానం చేశారు.
వచ్చే ఏ లాభాన్నైనా బిజినెస్‌లో పెట్టకుండా వాతావరణ మార్పులపై పోరాటం కోసం కేటాయిస్తానని ఆయన చెప్పారు.
దుస్తులకు ఎక్కువ కాలం గ్యారంటీ ఇవ్వడంతో పాటు తక్కువ ధరకే వాటిని రీపెయిర్ చేయడం వంటి చర్యల కారణంగా ఈ బ్రాండ్ చాలామంది ప్రజల ఆదరణను పొందింది.
ఇవి కూడా చదవండి
5. ఛెల్లో షో : భారత్ నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయిన ఈ సినిమా కథ ఏంటి, దీని ముందు 'RRR' ఎందుకు వెనుకబడింది?
దర్శకుడు పాన్ నలిన్ సినిమా 'ఛెల్లో షో' భారత్ నుంచి ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. ఇది గుజరాతీ చిత్రం. 95వ ఎడిషన్ ఆస్కార్ అవార్డుల కోసం అధికారికంగా భారత్ నుంచి ఈ సినిమాను నామినేట్ చేశారు. 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' కేటగిరీలో ఈ సినిమా నామినేట్ అయింది.
భారత సినిమా సమాఖ్య కార్యదర్శి సుపర్ణా సేన్ ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ కన్నడ దర్శకుడు టీఎస్ నాగాభరణ నేతృత్వంలోని జ్యూరీ, ఆస్కార్ నామినేషన్ కోసం 'ఛెల్లో షో' చిత్రాన్ని ఎంపిక చేసింది.
ఇవి కూడా చదవండి
- సౌత్ ఇండియాతో నార్త్ ఇండియా అభివృద్ధిలో పోటీ పడలేకపోతుందా
- ‘సిజేరియన్ చేయాలంటే హరీశ్ రావు నుంచి లెటర్ తెమ్మన్నారు, నార్మల్ డెలివరీ సమయంలో నా భార్య చనిపోయింది’
- కాకినాడ: ‘గర్బిణి అని నమ్మించారు, తొమ్మిది నెలల తర్వాత డెలివరీకి వెళితే గర్భంలో శిశువు లేదన్నారు’.. ప్రైవేటు ఆసుపత్రిపై పోలీసులకు ఫిర్యాదు
- లాల్ సింగ్ చడ్డా రివ్యూ: సుదీర్ఘంగా సాగిన ఎమోషనల్ జర్నీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)