You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతి
ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ లో మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
కృష్ణంరాజు వయస్సు 83 సంవత్సరాలు. ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు.
ఆయన గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆయన గత కొంత కాలంగా మధుమేహం, గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు ఆయనకు చికిత్స అందించిన ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఇటీవల ఆయన కాలికి కూడా శస్త్ర చికిత్స జరిగింది. ఆయన తీవ్రమైన కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.
కృష్ణంరాజు కోవిడ్ తర్వాత తలెత్తిన సమస్యలతో ఆగస్టు 05న ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆయన వెంటిలేటర్ పైనే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
చికిత్స తీసుకుంటూ సెప్టెంబరు 11 తెల్లవారుజామున మరణించారు.
ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈయన సినీ నటుడు ప్రభాస్‌కు పెదనాన్న.
కృష్ణంరాజు మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ప్రధాన మంత్రి మోదీ ట్వీట్ చేశారు. "కృష్ణంరాజుగారి మరణం దిగ్బ్రాంతికరం. ఆయన నటనా కౌశలం, సృజనాత్మకతను భావి తరాలు గుర్తు పెట్టుకుంటాయి. ఆయన సమాజ సేవలో ముందుంటూ రాజకీయ నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు సానుభూతిని తెలియచేస్తున్నాను" అని మోదీ ట్వీట్ చేశారు.
కృష్ణంరాజు మృతి పట్ల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
"ఆయన నటనతో కొన్ని లక్షల మంది హృదయాలను గెలుచుకోవడం మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి కూడా కృషి చేశారు. ఆయన మరణం తెలుగు సినిమాకు తీరని లోటు. నా ప్రగాఢ సానుభూతి" అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కృష్ణంరాజు మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు.
"తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, 'రెబల్ స్టార్' గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటు" అని సీఎం కేసిఆర్ పేర్కొన్నారు.
"లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా, దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సీఎం అన్నారు".
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసారు. తెలుగు రాష్ట్రాల్లో రెబెల్ స్టార్‌గా పేరున్న కృష్ణంరాజు సినీ ప్రపంచానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.
బీజేపీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణం రాజు మరణం విచారకరం. ఆయన కుటుంబానికి, స్నేహితులకు నా సానుభూతి" అంటూ రాజ్యసభ సభ్యుడు డాకర్ కె. లక్ష్మణ్ ట్వీట్ చేశారు.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా కృష్ణం రాజు మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఆయన సినీ నటుడు ప్రభాస్‌కు, ఇతర కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
మా వూరి హీరో లేడన్న వార్త విషాదకరమని, మనవూరి పాండవులు సినిమా నుంచి పరిశ్రమలో తనకు ఎంతో సహకరించారని హీరో చిరంజీవి అన్నారు. రెబెల్ స్టార్ అనే మాటకు ఆయన అసలైన నిదర్శనమని చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
‘‘నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన శ్రీ కృష్ణంరాజు గారు తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది. ఇటీవలి కాలంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలిసినప్పుడు కోలుకొంటారనే భావించాను. శ్రీ కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అని హీరో పవన్ కల్యాణ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
"నాకు మాటలు రావడం లేదు సోదరా" అంటూ సినీ నటుడు మోహన్ బాబు ట్వీట్ చేశారు.
‘‘నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన శ్రీ కృష్ణంరాజు గారు తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది. ఇటీవలి కాలంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలిసినప్పుడు కోలుకొంటారనే భావించాను. శ్రీ కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అని హీరో పవన్ కల్యాణ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
"కృష్ణంరాజు గారు ఇక లేరని వినడం దిగ్భ్రాంతిని కలిగించింది. నాతో పాటు సినీ ప్రపంచం మొత్తానికి ఇది తీరని లోటు. ఆయన జీవితం, సినీ రంగానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన కుటుంబానికి, ప్రభాస్ కు నా సానుభూతి తెలియచేస్తున్నాను" అంటూ సినీ నటుడు మహేష్ బాబు ట్వీట్ చేశారు.
"కృష్ణంరాజు గారి మరణం చాలా విచారకరం. ఆయనను కలిసిన ప్రతి సారి చాలా ప్రేమ, దయతో ఉండేవారు. ప్రభాస్, ఇతర కుటుంబ సభ్యులకు నా సంతాపాన్ని ప్రకటిస్తున్నాను" అంటూ నటి అనసూయ భరద్వాజ్ ట్వీట్ చేశారు.
(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది)
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ 3 అధికారిక ప్రకటన.. తొలిసారి టీవీల్లో ప్రసారమైన చారిత్రక కార్యక్రమం
- బ్రిటన్ రాజరికం: కింగ్ చార్లెస్ 3 భార్య కామిలా ఎవరు, క్వీన్ కన్సొర్ట్ అని ఎందుకు పిలుస్తున్నారు?
- కొత్త రాజు చార్లెస్ 3 వ్యక్తిత్వం ఎలా ఉండబోతోంది?
- క్వీన్ ఎలిజబెత్ 2: బ్రిటన్ రాణికి అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారు?
- రాజ కుటుంబంలోని సభ్యులు ఎవరు, రాజు నిర్వర్తించే విధులు ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)