తమిళనాడు: తండ్రిని చంపి, ముక్కలుగా నరికి ప్లాస్టిక్ డ్రమ్‌లో పెట్టి పాతిపెట్టిన కొడుకు

తండ్రిని చంపిన కొడుకు
    • రచయిత, ప్రసన్న వెంకటేశ్
    • హోదా, బీబీసీ కోసం..
  • ప్రచురణ

తండ్రిని చంపేసి, ఆయన మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ డ్రమ్‌లో పెట్టి పాతిపెట్టిన కొడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

78 ఏళ్ల కుమారేశన్ కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి. చెన్నైలోని వలసరవక్కంలోని ఆర్కాట్ రోడ్‌లో కుమార్తె కంసనతో కలిసి జీవిస్తున్నారు. ఆయన కుమారుడు గుణశేఖర కూడా అదే అపార్ట్‌మెంట్‌లో మొదటి అంతస్తులో కుటుంబంతోపాటు ఉంటున్నాడు.

ఇటీవల కంసన తమ బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి ఆమె ఇంటికి తాళం వేసి ఉంది. ఇంటి దగ్గర తండ్రి కూడా ఆమెకు కనిపించలేదు. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది.

దీంతో తండ్రి కుమారేశన్ కోసం కంసన, గుణశేఖర్ చాలా ప్రాంతాల్లో వెతికారు. ఆ తర్వాత కంసన ఇంటి తలుపును కూడా బద్దలుకొట్టి లోపలకు వెళ్లిచూశారు. అయితే, లోపల వారికి నేలపై రక్తం కనిపించింది.

వెంటనే వలసరవక్కం పోలీస్ స్టేషన్‌లో కంసన ఫిర్యాదు చేశారు. దీంతో జాగిలాల సాయంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

తండ్రిని చంపిన కొడుకు

అదే సమయంలో కంసన సోదరుడు గుణశేఖర కనిపించకుండాపోయారు. దీంతో ఆయనపై పోలీసులకు అనుమానం పెరిగింది. ఈ విషయంపై గుణశేఖర భార్య శాంతిని పోలీసులు ప్రశ్నించారు.

‘‘గుణశేఖర చిన్నచిన్న ఎలక్ట్రికల్ పనులు చేసేవారు. అయితే, తండ్రిని ఆయన కొన్ని రోజుల క్రితం డబ్బులు అడిగారు. ఆయన ఎప్పుడూ డబ్బులు కావాలనే అనేవారు. ఆ తర్వాత చోలింగార్ ప్రాంతంలో ఒక స్నేహితుడిని కలవడానికి వెళ్తున్నానని చెప్పారు’’అని పోలీసులకు శాంతి వెల్లడించారు.

వీడియో క్యాప్షన్, భీమడోలులో పోలీసు కస్టడీలో అనుమానితుడి ఆత్మహత్య

పోలీసుల అనుమానం

చోలింగార్ ప్రాంతంలో గుణశేఖర్ స్నేహితుడిని కూడా పోలీసులు ప్రశ్నించారు. ‘‘కావేరిపక్కం ప్రాంతంలో ఒక షాపును నిర్మించేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు అయితే, ఒక రోజు ఉదయం ఆయన ఇక్కడ ప్రాంతాన్ని శుభ్రంచేస్తూ ఒక గొయ్యి కూడా తవ్వారు’’అని ఆ స్నేహితుడు పోలీసులకు చెప్పారు.

కుమారేశన్
ఫొటో క్యాప్షన్, కుమారేశన్

దీంతో పోలీసులు రెవెన్యూ కమిషనర్ అనుమతితో అనుమానిత ప్రాంతంలో తవ్వకాలు చేపట్టారు. ముఖ్యంగా గుణశేఖర తవ్వినట్లుగా భావిస్తున్న ప్రాంతంలో మళ్లీ తవ్వారు.

వీడియో క్యాప్షన్, పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా: ప్రొఫెసర్ హరగోపాల్

పోలీస్ అధికారి నెమిలి రవి నేతృత్వంలోని ఏడు బృందాలు అనుమానిత ప్రాంతానికి చేరుకుని తవ్వకాలు జరిపాయి. దీంతో గోతిలో ఒక ప్లాస్టిక్ ట్యాంక్ కనిపించింది. దాన్ని బయటకు తీయడంతో అందులో కుమారేశన్ మృతదేహం ముక్కలుముక్కలుగా కనిపించింది. దీన్ని శవపరీక్ష కోసం పంపించారు.

గుణశేఖర్‌ను పట్టుకునేందుకు ఐదుగురు పోలీసులు గాలింపు చేపడుతున్నారు.

‘‘అసలు కుమారేశన్ ఎలా చనిపోయారు? ఆస్తి తగాదాలే దీనికి కారణమా? అనే అంశాలపై విచారణ జరుగుతోంది. గుణశేఖర్ దొరికిన తర్వాతే ఈ కేసులో స్పష్టత వస్తుంది’’అని వలసరవక్కం పోలీస్ ఇన్‌స్పెక్టర్ అబ్రహాం బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)