తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి కన్నుమూత - Newsreel

డాలర్ శేషాద్రి

ఫొటో సోర్స్, twitter/akkupaxi

ప్రచురణ
చదివే సమయం: 1 నిమిషాలు

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి చనిపోయారు.

కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వైజాగ్‌ వెళ్లిన డాలర్ శేషాద్రికి వేకువజామున గుండెపోటు వచ్చింది.

ఆసుపత్రికి తరలించేలోపే శేషాద్రి మృతి చెందారు.

1978వ సంవత్సరం నుంచి డాలర్ శేషాద్రి తిరుమలలో పని చేస్తున్నారు.

2007లో రిటైర్ అయినప్పటికీ టీటీడీ ఆయన్ను ఓఎన్డీగా నియమించింది.

నిన్న సింహాద్రి అప్పన్నను శేషాద్రి దర్శించుకున్నారు.

డాలర్ శేషాద్రి

ఫొటో సోర్స్, ugc

డాలర్ శేషాద్రి ఎవరు?

డాలర్ శేషాద్రి టీటీడీలో ఉత్తర పారుపత్తేదారుగా విధుల్లో చేరారు. ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్‌గా, అనంతరం పత్తేదారుగా సుదీర్ఘ కాలం పనిచేశారు.

రిటైర్ అయిన తర్వాత ఔట్ సోర్సింగ్ కింద ఆలయ ఓఎస్‌డీగా కొనసాగుతూ వచ్చారు.

టీటీడీలో తన 29ఏళ్ల ఉద్యోగకాలంలో అనేక పదవులు చేపట్టారు డాలర్ శేషాద్రి.

శ్రీవారి ఆలయంలో నగలు నిర్వహణ చూసే బొక్కసం సెల్‌లోని 13 రికార్డులు నిర్వహించేవారు.

వాస్తవానికి నగలు, నిర్వహణ బాధ్యత ఆలయ డిప్యూటీ ఈవో, పేస్కార్‌లదే అయినా అన్నీ తానై వ్యవహరించే వారు డాలర్ శేషాద్రి.

డాలర్ శేషాద్రి పేరెలా వచ్చింది?

తన జాతక చక్రంలోని మేక బొమ్మను డాలర్‌గా ధరించిన శేషాద్రికి డాలర్ శేషాద్రిగా పేరు స్థిరపడి పోయింది.

ఇదివరకు తిరుమల ఆలయంలో ఆయన శ్రీవారి బంగారు డాలర్లు అమ్మేవారు. ఆ విక్రయ విభాగం ఆయన ఆధ్వర్యంలో నడిచేది. కాబట్టే ఆయనకు డాలర్ శేషాద్రి అనే పేరొచ్చిందని మరికొందరు చెబుతుంటారు.

గతంలో బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ఓసారి గుండెపోటు వచ్చింది.

ఆ తర్వాత కూడా ఆయన తన ఆరోగ్యంపై దృష్టి పెట్టలేదని ఆయన గురించి తెలిసినవారు చెబుతుంటారు.

డాలర్ శేషాద్రి మరణానికి పలువురు సంతాపం తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)