You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జూహీ చావ్లా: 5జీపై పిటిషన్ ఉపసంహరించుకున్న జూహీచావ్లా - Newsreel
బాలీవుడ్ నటి జూహీ చావ్లా 5జీ వైర్‌లెస్ నెట్‌వర్క్‌పై దిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ వాపస్ తీసుకున్నారు.
గత నెల ఆమె వేసిన దావాను కోర్టు కొట్టివేసింది.
పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం పిటిషన్‌పై ఎటువంటి విచారణ జరగనందువల్ల తాను వేసిన దావాను కొట్టివేయకుండా, తిరస్కరించవలసిందిగా జూహీ చావ్లా అభ్యర్థించారు.
జూహీ చావ్లా తరపు న్యాయవాదుల వాదన విన్న తరువాత పిటీషన్‌ను ఉపసంహరించుకునేందుకు జడ్జి జయంత్ నాథ్ అనుమతిచ్చారు.
దేశంలో 5జీ నెట్‌వర్క్ ఏర్పాటును వ్యతిరేకంగా జూహీ చావ్లా దిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పబ్లిక్ లిటిగేషన్) దాఖలు చేశారు. దీన్ని జూన్ 4న కోర్టు కొట్టివేసింది.
పిటిషనర్లు చట్టాన్ని దుర్వినియోగం చేశారని, పబ్లిసిటీ కోసమే ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు కనిపిస్తోందని చెప్తూ చావ్లాకు కోర్టు రూ.20 లక్షల జరిమానా విధించింది.
ఈ డబ్బులు చెల్లించడానికి వారం రోజుల గడువు ఇచ్చింది కోర్టు.
ఈ తీర్పు ఆన్‌లైన్ లింకును జూహీ చావ్లా మూడుసార్లు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంపై కూడా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి:
- టోక్యో ఒలింపిక్స్: క్వార్టర్ ఫైనల్స్లో భారత హాకీ జట్టు, షట్లర్ పీవీ సింధు
- వారణాసి: విశ్వనాథ్ ఆలయానికి ముస్లింలు భూమి ఎందుకు ఇచ్చారు, ఇది చట్ట విరుద్ధమా?
- ప్రశాంత్ కిశోర్: జనాన్ని మెప్పించి ఎన్నికల్లో గెలవడం ఎలా?
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)