జపాన్‌: అటామీలో కొండ చరియలు విరిగిపడి 20 మంది గల్లంతు, వైరల్ అవుతున్న వీడియో - Newsreel

అటామీ నగరంలో కొండ చరియ విరిగి పడిన ప్రాంతం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అటామీ నగరంలో కొండ చరియ విరిగి పడిన ప్రాంతం
ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

జపాన్‌లోని అటామీ నగరంలో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి 20 మందికి పైగా గల్లంతయ్యారు.

కొండ మీద నుంచి నల్లటి బురద నగరంలోని వీధుల్లోకి విరుచుకుపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో కనిపిస్తున్నాయి. ఆ బురద ప్రవాహంలో చాలా ఇళ్లు మునిగిపోయాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

కొండ చరియ విరిగిపడినప్పుడు భారీ శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

పసిఫిక్ తీర ప్రాంతంలో భారీ వర్షాలకు జరిగిన విధ్వంసం నుంచి ప్రజలను రక్షించేందుకు టాస్క్ ఫోర్స్‌ను రంగంలోకి దింపుతున్నట్లు జపాన్ ప్రధాని యోషిహిడే సుగా చెప్పారు.

కిరణ్ రావు, ఆమిర్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఆమిర్ ఖాన్ దంపతుల విడాకులు

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావు తమ 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు.

ఈ మేరకు విడాకులు తీసుకుంటున్నట్లు వారిద్దరూ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

''మేం మా జీవితాలలో కొత్త అధ్యాయం ప్రారంభించాలనుకుంటున్నాం. ఇకపై భార్యాభర్తలుగా కొనసాగబోం. మా పిల్లలకు తల్లిదండ్రులుగా, కుటుంబ సభ్యులుగా జీవిస్తాం'' అని ప్రకటించారు.

వీడియో క్యాప్షన్, ఆమిర్ ఖాన్, కిరణ్ రావు: 'విడాకులు తీసుకుంటున్నాం'

''కొద్దికాలం కిందటే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు పద్ధతి ప్రకారం విడిపోతున్నాం. మా అబ్బాయి ఆజాద్ పెంపకం బాధ్యతలు ఇద్దరం చూసుకుంటాం. సినిమాలు, పానీ ఫౌండేషన్, ఇతర ప్రాజెక్టుల విషయంలో కలిసి పనిచేస్తాం'' అని వారు చెప్పారు.

తీర్థ్ సింగ్ రావత్

ఫొటో సోర్స్, facebook/tirathsinghrawat

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థ్ సింగ్ రావత్ రాజీనామా

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీర్థ్ సింగ్‌ రావత్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాత్రి రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామా లేఖను గవర్నర్ బేబీ రాణి మౌర్యకు సమర్పించారు.

రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకుండా తాను రాజీనామా చేసినట్లు తీర్థ్ సింగ్ తెలిపారు.

తీర్థ్ సింగ్ రాజీనామా చేసిన విషయాన్ని గవర్నర్ బేబీ రాణీ మౌర్య తన ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

మరోవైపు తీర్థ్ సింగ్.. ''కేంద్ర నాయకత్వం, ప్రధాని మోదీ తనకు ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాన''న్నారు.

సీఎం పదవి చేపట్టిన తరువాత ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేకపోయినందున ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

మార్చి 10న ఆయన ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఎమ్మెల్యేగా లేని ఆయన ఆ తరువాత కూడా ఎన్నికలు రాకపోవడంతో ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

నిబంధనల ప్రకారం ఆరు నెలల కాలంలో ఆయన శాసన సభ సభ్యునిగా ఎన్నిక కావాల్సి ఉంది.

సెప్టెంబరు మొదటి వారంలో ఈ ఆరు నెలల గడువు ముగియనుంది.. ఈ లోగా ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి లేకపోవడంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)