రేవంత్ రెడ్డి: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియామకం - Newsreel

ప్రచురణ

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.

కార్యనిర్వాహక అధ్యక్షులుగా గీతా రెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, టి జగ్గారెడ్డి, బి మహేశ్ కుమార్ గౌడ్‌లను నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీచేసింది.

విద్యార్థిగా ఉన్నపుడే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విద్యార్థి విభాగంలో పనిచేసిన రేవంత్.. అనంతరం టీడీపీలో చేరారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత ఎంఎల్‌సీ ఎన్నికల్లోనూ పార్టీని ధిక్కరించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు.

కొడంగల్ నియోజవర్గం నుంచి వరుసగా రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్ ఎన్నికయ్యారు. 2015 ఎంఎల్‌సీ ఎన్నికల్లో లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలపై అరెస్టై బెయిల్ మీద విడుదలయ్యారు.

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గాను, టీటీడీపీ శాసనసభా పక్ష నేతగాను ఉన్న ఆయన.. 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరి టీపీసీసీ ముగ్గురు అధ్యక్షుల్లో ఒకరుగా నియమితులయ్యారు.

కత్తి మహేశ్‌కు రోడ్డు ప్రమాదం... తల, ఎడమ కంటికి తీవ్రగాయాలు

సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం, చంద్రశేఖరపురం సమీపంలో హైవే మీద ఈ ప్రమాదం జరిగింది.

మహేశ్ ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వెళ్తున్న లారీని వేగంగా డీకొట్టింది. దాంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయిపోయింది. తలకు, కంటికి తీవ్రగాయాలైన మహేశ్‌ను వెంటనే నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్పించారు.

ఆయన ఎడమ కంటికి బాగా దెబ్బ తగిలిందని, తలకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయని వైద్యులు చెప్పారని ఆయన సన్నిహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ముఖానికి శస్త్ర చికిత్సలు పూర్తయిన తరువాత కత్తి మహేశ్‌ను చెన్నై ఆస్పత్రికి తరలిస్తారని వారు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)