దిలీప్ కుమార్: ఆరోగ్యం క్షీణించడంతో హిందూజా ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు - Newsreel

ప్రచురణ
చదివే సమయం: 1 నిమిషాలు

ప్రముఖ నటుడు దిలీప్ కుమార్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ముంబయిలోని హిందూజా హాస్పిటల్లో చేర్చారు.

ఉదయం 8.30 గంటల సమయంలో ఆయనను ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆయన సన్నిహితుడు బషీర్ కొలంబోవాలా బీబీసీకి తెలిపారు.

"ఆయనకు ఊపిరి సరిగా అందకపోవడంతో ఆస్పత్రిలో చేర్పించాం. ప్రస్తుతానికి భయపడాల్సిందేమీ లేదు. ఆయన వయసు రీత్యా రిస్క్ తీసుకోకూడదని వెంటనే ఆస్పత్రిలో చేర్చాం" అని బషీర్ తెలిపారు.

గత కొన్ని రోజులుగా దిలీప్ కుమార్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని ఆయన భార్య సైరాబాను తెలిపారని ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.

హిందూజా హాస్పిటల్ ఖార్‌లో డాక్టర్ నితిన్ గోఖలే బృందం దిలీప్‌కు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)