You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పశ్చిమ బెంగాల్: ఎన్నికల తరువాత హింసాత్మక ఘటనల్లో 17 మంది మృతి
పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆదివారం నుంచి మంగళవారం వరకు చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో సుమారు 17 మంది మరణించారు.
ఈ గొడవల్లో మరణించిన వారిలో తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు.
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
అయితే, ఈ హింస చెలరేగడానికి కారణం, ఎంత మంది మరణించారనే విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.
టీఎంసీ కార్యకర్తలు తమ పార్టీ సభ్యులపై దాడి చేసి, వారి ఆఫీసులను కొల్లగొట్టి, వారు నడుపుతున్న దుకాణాలలో దోపిడీ చేశారని బీజేపీ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను టీఎంసీ ఖండించింది. ఈ గొడవల్లో తమ పార్టీకి చెందిన ఏడుగురు కార్యకర్తలు మరణించినట్లు టీఎంసీ చెప్పగా బీజేపీ సభ్యులు తమ పార్టీకి చెందిన వారు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో కూడా కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు భారీ ఎన్నికల ప్రచార ర్యాలీలు జరిగాయి.
బెంగాల్‌లో టీఎంసీ సహా, బీజేపీ, లెఫ్ట్ పార్టీల కూటమి కూడా హింసను ప్రేరేపించాయనే ఆరోపణలు ఎదుర్కొన్నాయి.
సోషల్ మీడియాలో కనిపించిన కొన్ని దృశ్యాలు చూస్తే దోపిడీకి గురయిన ఆఫీసులు, కాలిన భవనాలు, ప్రజలపై దాడులు కనిపిస్తున్నాయి.
అయితే, ఈ గొడవలు ఎలా మొదలయ్యాయనే విషయంపై స్పష్టత లేదు.
టీఎంసీ నేత మమతా బెనర్జీ ప్రజలను సంయమనం పాటించమని పిలుపునిచ్చారు. ఆమె బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
పశ్చిమ బెంగాల్‌లో నెలకొన్న పరిస్థితిపై ప్రధాని మోదీ రాష్ట్ర గవర్నర్‌కి ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రాష్ట్రంలో నెలకొన్న హింస గురించి నివేదిక ఇమ్మని రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖను కోరింది.
మంగళవారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పశ్చిమబెంగాల్ వచ్చి ఈ గొడవల్లో మరణించిన రెండు పార్టీల వారి కుటుంబాలను కలిశారు.
"టీఎంసీ కార్యకర్తలకు భయపడి చాలా మంది బీజేపీ కార్యకర్తలు వారి ప్రాణాలను కాపాడుకోవడానికి ఇళ్ళు వదిలి పారిపోయారని ఒక మాజీ బీజేపీ నాయకుడు బీబీసీతో అన్నారు.
రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి గత 24 గంటల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నట్లు వార్తలు వస్తుండటంతో పరిస్థితి ప్రస్తుతానికి ఉద్రిక్తంగానే ఉంది.
కానీ, ఇది బీజేపీ ప్రచారం చేస్తున్న తప్పుడు సమాచారమని టీఎంసీ నాయకులు ఆరోపిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలకు సంబంధించిన హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడమనేది ఈనాటిది కాదు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ విస్తృతంగా బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించారు. కానీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించింది.
టీఎంసీ ఓట్లను బీజేపీ తగ్గిస్తుందేమోనని భావించిన రాజకీయ విశ్లేషకులను ఈ రాష్ట్రంలో వెలువడిన ఫలితాలు ఆశ్చర్యపరిచాయి.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- కరోనావైరస్: భారతదేశంలో 3 లక్షలు దాటిన రోజువారీ కోవిడ్ కేసులు...
- నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
- బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)