పల్లా రాజేశ్వరరెడ్డి, సురభి వాణిదేవి: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులు

ఫొటో సోర్స్, facebook/trsparty
నాలుగు రోజుల సుదీర్ఘ లెక్కింపు ప్రక్రియకు తెరపడింది. తెలంగాణలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
'మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్' స్థానం నుంచి సురభి వాణిదేవి విజయం సాధించగా 'నల్లగొండ-వరంగల్-ఖమ్మం' స్థానం నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచారు.

ఫొటో సోర్స్, facebook/trsparty
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎస్.వాణీదేవి విజయం సాధించారు.
వాణీ దేవి గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు. మొత్తం 189339 ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎన్. రాంచందర్‌రావుపై ఆమె గెలుపొందారు.

ఫొటో సోర్స్, facebook/palla rajeswarrerddy
నల్లగొండ-వరంగల్-ఖమ్మం
నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు.
రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు, ఎలిమినేషన్ ప్రక్రియ అనంతరం అధికారులు ఆయన్ను విజేతగా ప్రకటించారు.
ఆధిక్యాని సంబంధించి తుది లెక్కలు ఆదివారం వెల్లడించనున్నారు.శనివారం రాత్రి సమయానికి.. 55వ రౌండ్ తర్వాత ప్రధాన అభ్యర్థుల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,11,190, తీన్మార్ మల్లన్నకు- 83,629, ప్రొఫెసర్ కోదండరాంకు -70,472, ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ) - 39,268 ఓట్లతో ఉన్నారు.
రాములు నాయక్ (కాంగ్రెస్) - 27,713, జయసారధి (లెఫ్ట్) - 9,657, చెరుకు సుధాకర్ - 8,732, రాణి రుద్రమ - 7,903 ఓట్లు సాధించారు.

ఫొటో సోర్స్, UGC
సంబరాల్లో అపశ్రుతి
టీఆర్ఎస్ భవన్ దగ్గర కార్యకర్తలు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకుంటున్న సమయంలో చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది.
టపాకాయలు భవన్ ముందు ఉన్న ఒక పందిరికి అల్లుకున్న తీగలపై పడ్డాయి. దాంతో కొంత భాగం కాలింది.
అయితే మొక్కలు కావడంతో మంటలు పెద్దగా వ్యాపించలేదు.
కార్యకర్తలు బకెట్లతో నీళ్లు తెచ్చి మంటలు ఆర్పేయడంతో పైర్ ఇంజన్ పిలిపించాల్సిన అవసరం రాలేదు.
ఇవి కూడా చదవండి:
- మోదీ ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను ఎందుకు చేరుకోలేకపోతోంది?
- మోదీ జాబ్ దో, మోదీ రోజ్గార్ దో... ట్విటర్‌లో మార్మోగిపోతున్న హ్యాష్ట్యాగులు
- పెట్రోల్, గ్యాస్ ధరల వల్ల మీ జేబుపై ఎంత భారం పడుతుంది
- మోదీ చెబుతున్నట్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి నిజంగా గత ప్రభుత్వాలే కారణమా?
- శాంతియుత నిరసనలు హింసాత్మకంగా ఎందుకు మారతాయి? పోలీసులతో జనం ఎందుకు ఘర్షణకు దిగుతారు?
- చింతల వెంకటరెడ్డి: మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?
- ఆంధ్రప్రదేశ్: గాడిద మాంసం తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా.. ఏపీలో ఎందుకంత గిరాకీ పెరుగుతోంది
- మీ 'టేక్ హోమ్ సాలరీ' రాబోయే రోజుల్లో తగ్గిపోనుందా... ఎందుకని?
- తెలంగాణలో కుల అహంకార హత్య: ప్రేమించి గర్భం దాల్చిన కూతురిని చంపేసిన తల్లిదండ్రులు
- పులి, మేకల మధ్య స్నేహ బంధం ఎలా సాధ్యం? వైరి జంతువుల మధ్య మితృత్వం వెనుక రహస్యం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)























