తెలంగాణ: నాలుగు నెలల తరువాత గల్ఫ్ నుంచి సొంతూరికి చేరిన వలస కార్మికుడి మృతదేహం

ఫొటో సోర్స్, FACEBOOK
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
గల్ఫ్‌లో మరణించిన తెలంగాణ వ్యక్తి మృతదేహం దాదాపు నాలుగు నెలల తరువాత స్వస్థలానికి చేరింది.
జగిత్యాల జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన సుంకె రాజయ్య సౌదీ అరేబియాలో కార్మికుడిగా పనిచేస్తూ మరణించారు. 55 ఏళ్ల రాజయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఈ ఏప్రిల్ ప్రారంభంలో బాత్‌రూంలో జారి పడడంతో రాజయ్య తలకు గాయం అయింది. చికిత్స సమయంలో కోమాలోకి వెళ్లారు. సౌదీ రాజధాని రియాద్‌లోనే చికిత్స పొందుతూ ఏప్రిల్ 14న ఆయన మరణించారు. ఆయన తలకు గాయమైన విషయం రాజయ్యతో కలసి పనిచేసే వారి ద్వారా ఇక్కడి కుటుంబ సభ్యులకు తెలిసింది.
''ఏప్రిల్ 14న కంపెనీ వాళ్లు ఫోన్ చేశారు. మా నాన్న చనిపోయారని చెప్పారు.'' అన్నారు రాజయ్య కుమారుడు సంకె తిరుపతి. శరీరాన్ని భారతదేశం పంపడానికి కొన్ని పత్రాలు పంపించాలని వారు కోరడంతో ఇక్కడ లాయర్లను కలసి పత్రాలు పంపించారు ఆయన కుమారుడు తిరుపతి.
అయితే అప్పటికే లాక్ డౌన్ విధించడం, అంతర్జాతీయ విమానాలు ఆగిపోవడంతో రాజయ్య మృతదేహం అప్పటి నుంచీ సౌదీలోనే ఉండిపోయింది.
''మృతదేహం తీసుకురావడం ఆలస్యం అవుతోందని గ్రామ పెద్దలం విషయాన్ని నాయకుల దృష్టికి తీసుకుని వెళ్లాం.'' అని వివరించారు కొండాపూర్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు శేఖర్.
జగిత్యాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, సౌదీలోని భారత రాయబార కార్యాలయానికి లేఖలు రాసి ఈ అంశంపై స్పందించాలని కోరారు.
కానీ దాదాపు నాలుగు నెలలుగా రాజయ్య మృతదేహం తరలింపులో ఎటువంటి పురోగతీ లేదు. అటు ఎన్నారైల కోసం పనిచేస్తోన్న స్వచ్చంద సంస్థలు కూడా ఈ విషయంలో చొరవ తీసుకున్నాయి.
సౌదీలోనూ, తెలంగాణలోనూ పనినచేస్తోన్న ఎన్జీవోలు ఈ విషయంలో చట్టపరంగానూ, ఆర్థికంగానూ సహకరించాయి.
ఎట్టకేలకు శనివారం రాజయ్య మృతదేహం హైదరాబాద్ విమానాశ్రయానికి కార్గో విమానంలో వచ్చింది. అక్కడి నుంచి దాతల సహకారంతో స్వగ్రామం తరలించగా, ఆదివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి.

ఫొటో సోర్స్, Tirupati
రాజయ్య కుటుంబం పోషణ నిమిత్తం కూలి పనులపైనే ఆధారపడింది. ఒక కుమార్తెకు పెళ్లికాగా, మరో కుమార్తె అనారోగ్యంతో బాధపడుతోంది. కుమారుడు ఐటీఐ చదువుతున్నారు.
''నాన్న అక్కడ (సౌదీలో) పనిచేసిన జీతమే ఇంకా రాలేదు. అప్పుడు జీతం గురించి అడిగితే, బాడీతో పాటూ పంపిస్తాం అన్నారు. మొదట్లో లాక్ డౌన్ కదా అనే వారు. తరువాత ఫోన్లు ఎత్తడం మానేశారు. ఫోన్ కట్ చేశారు. మధ్యలోనేమో, బాడీతో పాటూ పంపుతాం అనేవారు. మరణించిన దానికి పరిహారం కాదు కదా, అసలు ఆయన పనిచేసిన సమయంలో రావాల్సిన జీతమే ఇంకా రాలేదు'' అని బీబీసీతో చెప్పారు రాజయ్య కుమారుడు తిరుపతి.

ఫొటో సోర్స్, Getty Images
అవగాహన లోపం, ఆర్థిక సమస్యలు, చట్ట పరమైన ప్రక్రియలో చిక్కులు, యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా విదేశాలలో పనిచేస్తూ మరణించిన వారి మృతదేహాలు భారతదేశానికి రావడంలో ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక ఇటువంటి కేసుల్లో పరిహారం పరిస్థితి అందడం కూడా గగనంగానే ఉంది.
ఇవి కూడా చదవండి:
- లాక్డౌన్ ఎఫెక్ట్: ఏపీలో ప్రజలకు కరెంటు బిల్లుల షాక్... అదనపు భారం వేయలేదంటున్న ప్రభుత్వం
- కరెంట్ లేనప్పుడు సెల్‌ఫోన్ చార్జ్ చేయడమెలా?
- చైనా యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసింది... తరువాత ఏంటి?
- చైనా యాప్స్ బ్యాన్‌తో అయోమయంలో పడిన టిక్‌టాక్ స్టార్ భవితవ్యం
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం - ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- ‘కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. బలవంతంగా గుండు గీయించారు’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























