You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డోనల్డ్ ట్రంప్ మాస్క్ పెట్టుకున్నారు... మాస్క్ మంచిదేననీ అన్నారు
కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఎన్నడూ మాస్కుతో కనిపించని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలిసారి ఫేస్ మాస్కుతో కనిపించారు.
వాషింగ్టన్ సమీపంలోని వాల్టర్ రీడ్ మిలిటరీ ఆసుపత్రిలో సైనికులు, హెల్త్ కేర్ వర్కర్లను పరామర్శించడానికి వెళ్లిన ట్రంప్ అక్కడ మాస్క్ ధరించి కనిపించారు. ''నేనెప్పుడూ మాస్క్ ధరించడానికి వ్యతిరేకం కాను. కానీ దానికి ఒక సమయం, సందర్భం ఉంటుంది'' అన్నారు ట్రంప్
గతంలో తాను ఎప్పుడూ మాస్కును ధరించనని ప్రకటించిన ఆయన, ఎన్నికల్లో తన ప్రత్యర్ధి జోబిడెన్ మాస్క్ ధరించడాన్ని ఒక సందర్భంలో ఎగతాళి కూడా చేశారు. కానీ నిన్న ఆసుపత్రిని సందర్శించిన ఆయన '' కొన్ని సందర్భాలలో మాస్క్ ధరించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆసుపత్రిలో, ఎక్కువమంది రోగులను సందర్శించాల్సి వచ్చినప్పుడు ఇది తప్పదు'' అని అన్నారు
గతవారం ఫాక్స్ బిజినెస్ నెట్ వర్క్ సమావేశంలో పాల్గొన్న ట్రంప్ ''నేను మాస్క్ లకు వ్యతిరేకం కాదు'' అని ప్రకటించారు. ''నేను వాటిని ఇష్టపడతాను కూడా'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. లోన్ రేంజర్స్ కథలో ముసుగు వీరుడిలా ఉండటం తనకు ఇష్టమేనని ఆయన అన్నారు.
వ్యాధివ్యాప్తి నిరోధానికి గుడ్డతో తయారు చేసిన మాస్కులు ధరించడం మంచిదని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోస్ (సీడీసీ) ఏప్రిల్ లో ప్రకటించింది. అయితే తాను ఎప్పుడూ మాస్క్ ధరించనని ట్రంప్ ప్రకటించారు. ''నేను అలా మాస్క్ వేసుకుని తిరగాలనుకోవడం లేదు'' అన్నారు ట్రంప్. ''మాస్క్ చుట్టుకుని ప్రధానులను, ప్రెసిడెంట్లను, రాజులను, రాణులను పలకరించడం నా వల్ల కాదు '' అన్నారాయన. ఆయన సహచరులు చాలాసార్లు ఆయన్ను మాస్క్ ధరించాల్సిందిగా కోరినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
అమెరికాలో పరిస్థితి ఎలా ఉంది?
అమెరికాలో గత 24 గంటల్లోనే 66,528 కేసులు నమోదయ్యాయి. ఇది ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసుల రికార్డు.ఇప్పటి అమెరికా వ్యాప్తంగా 135,000 మరణాలు సంభవించాయని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు చెబుతున్నాయి.
తాజాగా ప్రజలంతా మాస్కులు ధరించాలని లూసియాన రాష్ట్రం ఆదేశాలు జారీ చేసింది.
లూసియానా రాష్ట్రంలో బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని డెమొక్రాటిక్ గవర్నర్ జాన్ బెల్ ఎడ్వర్డ్ ఆదేశించారు. ఈ ఆదేశాలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయి.
అయితే రిపబ్లికన్ పార్టీ సభ్యులు దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది.
''మీకు మాస్క్ ను తప్పనిసరి చేయడం ఇష్టం లేకపోతే అది ధరించాల్సి వచ్చే వరకు మీరు ఇష్టపడకండి'' అని అన్న ఆయన ''ఈ విషయంలో మీరు నన్ను పిచ్చివాడు అనుకున్నా నాకు బాధలేదు'' అని వ్యాఖ్యానించారు.
శనివారంనాడు 10,500 కొత్త కరోనా కేసులతో టెక్సాస్ రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించింది..
కరోనా వైరస్ ను అరికట్టేందుకు రాత్రి 11 తర్వాత బార్లు తెరిచి ఉంచవద్దని సౌత్ కరోలినా రాష్ట్ర గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.
కరోనా కారణంగా ఓ మరణశిక్షను కూడా నిలిపేయాల్సి వచ్చిన ఘటన ఇండియానా రాష్ట్రంలో జరిగింది. సోమవారంనాడు డేనియల్ లీ అనే వ్యక్తికి మరణశిక్షను అమలు జరపాల్సి ఉండగా, కరోనా కారణంగా ఆ శిక్షను చూసేందుకు తాము రాలేమని బంధువులు ప్రభుత్వానికి విజ్జప్తి చేశారు. దీంతో కోర్టు మరణశిక్షను వాయిదా వేసింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం అమలు జరపబోతున్న శిక్ష ఇది.
ఇవి కూడా చదవండి:
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్లను ఎదుర్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)