You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
UPSC కొత్త క్యాలెండర్: సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ 4న, మెయిన్స్ 2021 జనవరిలో
ప్రభుత్వ ఉద్యోగాల కోసం కలలు కంటున్నవారికి, వాటి కోసం సన్నద్ధం అవుతున్నవారికి కేంద్రం శుభవార్త వినిపించింది.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్సీ ద్వారా నిర్వహించే పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించారు.
యూపీఎస్సీ ప్రతి ఏటా ఈ పరీక్షల క్యాలెండర్ జారీ చేస్తుంది. కానీ ఈసారీ కరోనా లాక్‌డౌన్ వల్ల నిర్ధారిత సమయానికి ఈ పరీక్షలు నిర్వహించలేకపోయారు.
దాంతో, ఈ పరీక్షల తేదీలు ప్రకటిస్తూ యూపీఎస్సీ కొత్త క్యాలెండర్ జారీ చేసింది. దీంతో సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది అభ్యర్థుల ఎదురుచూపులకు తెరపడింది.
యూపీఎస్సీ గతంలో సివిల్ సర్వీసుల పరీక్షల తేదీలను జూన్ 5న ప్రకటిస్తామని చెప్పింది. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ఈ ఏడాది మే 31న జరగాల్సి ఉంది. కానీ కరోనా వల్ల దీనిని వాయిదా వేశారు.
కొత్త పరీక్షల షెడ్యూల్ ప్రకారం సివిల్ సర్వీసెస్ ప్రిమిలినరీ పరీక్ష ఈ ఏడాది అక్టోబర్ 4న జరుగుతుంది. ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన వారు 2021 జనవరి 8న సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష రాస్తారు.
సివిల్ సర్వీసెస్‌తో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిమిలినరీ టెస్ట్ కూడా అక్టోబర్ 4న జరుగుతుంది.
యూపీఎస్సీ ఎన్డీఏ, ఐఈఎస్, ఐఏఎస్, సీఎంఎస్ సహా చాలా పరీక్షల తేదీలను ప్రకటించింది.
యూపీఎస్సీ నిర్వహించబోయే ముఖ్యమైన పరీక్షల తేదీలు
అలాగే.. గత ఏడాది సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్‌ను వచ్చే నెల - అంటే జూలై 20వ తేదీ నుంచి పున:ప్రారంభిస్తామని కూడా యూపీఎస్‌సీ చెప్పింది.
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీసెస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) తదితర కీలక పోస్టుల భర్తీ కోసం నిర్వహించే యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ పరీక్షలకు ప్రతి ఏటా 10 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకుంటారు.
ఇదిలావుంటే.. మరో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) కూడా 2020 సంవత్సరానికి సంబంధించి రివైజ్డ్ రిక్రూట్‌మెంట్ క్యాలెండర్ ప్రకటించింది.
2019, 2018 సంవత్సరాల నోటిఫికేషన్లకు సంబంధించి నిర్వహించాల్సిన పరీక్షలను ఆగస్టు - అక్టోబర్ నెలల్లో పూర్తి చేస్తామని ఎస్‌ఎస్‌సీ చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- పులి, మేకల మధ్య స్నేహ బంధం ఎలా సాధ్యం? వైరి జంతువుల మధ్య మితృత్వం వెనుక రహస్యం ఏమిటి?
- జార్జ్ ఫ్లాయిడ్ ఎవరు? అనేక సార్లు అరెస్టయిన ఫ్లాయిడ్ కోసం అమెరికా ఎందుకు రగులుతోంది?
- ‘కరోనావైరస్ టీకా పరీక్షల్లో ఉంది.. ఇప్పుడే ఉత్పత్తి ప్రారంభిస్తున్నాం’ - బ్రిటన్ సంస్థ వెల్లడి, భారత్‌లోనూ తయారీ
- కరోనావైరస్ లక్షణాలు: ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- మీరా చోప్రాపై ట్రోలింగ్‌కు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు? ఈ కేసులో ఇప్పుడు ఏం జరుగనుంది?
- కూతురి కోసం దాచిన రూ. 5 లక్షలు లాక్‌డౌన్ బాధితులకు ఖర్చు చేసిన సెలూన్ యజమాని
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
- జాక్ మా: కరోనావైరస్ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)