INDvsWI: విరాట్ కోహ్లీ 94 నాటౌట్.. మొదటి టీ20లో భారత్ విజయం

ఫొటో సోర్స్, Reuters
హైదరాబాద్‌లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు గెలుపొందింది. వెస్టిండీస్ జట్టును 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓడించింది.
విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. కోహ్లీ 50 బంతుల్లో ఆరు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
208 పరుగుల విజయలక్ష్యాన్ని భారత జట్టు 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది.
భారత జట్టులో కేఎల్ రాహుల్ కూడా అర్థ సెంచరీ (నాలుగు సిక్స్‌లు, ఐదు ఫోర్ల సాయంతో 40 బంతుల్లో 62 పరుగులు) చేశాడు.
వెస్టిండీస్ బౌలర్లలో పీర్రె 2 వికెట్లు తీయగా పొలార్డ్, కొట్రెల్ చెరొక వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది.
ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లో హెట్‌మైర్ 41 బంతుల్లో 56 పరుగులు (నాలుగు సిక్స్‌లు, రెండు ఫోర్లు) చేయగా, లెవిస్ 17 బంతుల్లో 40 పరుగులు (నాలుగు సిక్స్‌లు, మూడు ఫోర్లు), పొలార్డ్ 19 బంతుల్లో 37 పరుగులు (నాలుగు సిక్స్‌లు, ఒక ఫోర్), కింగ్ 23 బంతుల్లో 31 పరుగులు (ఒక సిక్స్, మూడు ఫోర్లు), జేసన్ హోల్డర్ 9 బంతుల్లో 24 పరుగులు (రెండు సిక్స్‌లు, ఒక ఫోర్) చేశారు.
భారత బౌలర్లలో చాహల్ నాలుగు ఓవర్లకు 36 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్ తలో ఒక వికెట్ తీశారు.
రెండో టీ20 డిసెంబర్ 8వ తేదీన తిరువనంతపురంలో జరుగుతుంది.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ ఎన్కౌంటర్: సీన్ రీ-కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు?
- సజ్జనార్ ప్రెస్ మీట్: 'చట్టం తన పని తాను చేసింది'
- 'దిశ' నిందితుల ఎన్కౌంటర్... కాల్చి చంపాలనుకుంటే చట్టాలు, కోర్టులతో పనేముంది?
- LIVE: హైదరాబాద్ ‘ఎన్కౌంటర్’పై హైకోర్టులో కేసు: ‘సోమవారం దాకా నిందితులకు అంత్యక్రియలు చేయొద్దు.. మృతదేహాలను భద్రపరచండి’
- సజ్జనార్: అప్పుడు, ఇప్పుడు ఈయనే...
- మహిళలపై హింస నిర్మూలన దినం: స్వతంత్ర భారతంలో మహిళా హక్కుల పోరాటాల చరిత్ర
- హైదరాబాద్: బడి దగ్గర అన్నం గిన్నెతో చిన్నారి ఫొటో వెనుక నిజాలేమిటి?
- అత్యాచార కేసు విచారణకు వెళ్తున్న బాధితురాలికి నిప్పు పెట్టిన దుండగులు... మృత్యువుతో పోరాడుతున్న యూపీ మహిళ
- టైఫాయిడ్ వాక్సిన్: 'అద్భుతంగా పనిచేస్తోంది'
- మనుషులెవరూ లేని ప్రాంతాల్లో తప్పిపోతే ప్రాణాలతో బయటపడటం ఎలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలను నిలుపుకోవచ్చు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























