ఫిలిప్పీన్స్‌: 32 మంది మృతికి కారణమైన భూకంప తీవ్రత... 9 ఫోటోలలో

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

ఫిలిప్పీన్స్‌లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 07:37 గంటలకు (23:37 జీఎంటీ) బలమైన భూకంపం సంభవించింది.

ఇందులో 32 మంది మృతి చెందగా, 134 మంది గాయపడ్డారు.

అమెరికా జియోలాజికల్ సర్వే దీని తీవ్రతను 7.8గా, లోతును 35 కిలోమీటర్లుగా నమోదు చేసింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ దీని తీవ్రతను 7.8గా, లోతును 50 కిలోమీటర్లుగా పేర్కొంది.

ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, జపాన్‌తో సహా ఈ ప్రాంతంలోని పలు దేశాలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి.

తీర ప్రాంతాలను ఖాళీ చేయాలని ఫిలిప్పీన్ అధికారులు ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో మోహరించి సహాయక చర్యలు అందిస్తున్నట్టు ఫిలిప్పీన్స్ రెడ్ క్రాస్ చెబుతోంది.

తమ సభ్యులు నష్టాన్ని అంచనా వేస్తున్నారని, బాధితుల తరలింపును సమన్వయం చేస్తున్నారని రెడ్ క్రాస్ బృందం సోషల్ మీడియాలో పోస్ట్‌లో తెలిపింది.

భూకంప కేంద్రంనుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న దవావో నగరంలో కూడా ఆ తీవ్రత కనిపించింది.

దవావోలో 1.5 అడుగులు (0.5 మీటర్లు) ఎత్తు గల సునామీ నమోదు అయిందని అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ తెలిపింది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)