మాల్దీవ్స్ భారత్ నుంచి దూరంగా, చైనాకు దగ్గరగా వెళ్తోందా?
భారత్‌తో సంబంధాలు ఒడిదొడుకులకు లోనవుతున్న నేపథ్యంలో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు చైనాలో పర్యటిస్తున్నారు.
ఇది ఆయన తొలి విదేశీ పర్యటన. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను ఆయన కలిశారు. ముయిజ్జును తమ చిరకాల మిత్రుడిగా జిన్‌పింగ్ అభివర్ణించారు.
రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి దీన్ని సంకేతంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
మొత్తంగా తాజా పర్యటనలో రెండు దేశాల మధ్య 20 వరకూ ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
తమ ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక సహకార భాగస్వామ్యం అంటే కాంప్రెహెన్సివ్ స్ట్రాటజిక్ కోఆపరేటివ్ పార్ట్‌నర్‌షిప్‌కు తీసుకెళ్తున్నట్లు ఇద్దరు నాయకులూ ప్రకటించారు.
గత నవంబరులో మాల్దీవుల్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ‘ఇండియా అవుట్’ అనే ప్రచారంతో ముయిజ్జు ముందుకెళ్లారు.
ఎన్నికల్లో గెలిచిన అనంతరం మాల్దీవుల్లో మోహరించిన భారత సైనికులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని ముయిజ్జు చెప్పారు.
మరోవైపు దేశంలో చైనా పెట్టుబడులు పెంచాలని ఆయన కోరుతున్నారు.
2022లో చైనా, మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 451.29 మిలియన్ల డాలర్లు. అంటే ఇది రూ.3739 కోట్లు.
మాల్దీవుల ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు సోషల్ మీడియా వేదికగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తాజా వివాదం రాజుకుంది.
ఆ ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత భారత్‌లో మల్దీవులను బాయ్‌కాట్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంది.
మరోవైపు ట్రావెల్ ప్లాట్‌ఫామ్ ఈజ్ మైట్రిప్ అయితే, మాల్దీవులకు బుకింగ్స్‌ను కూడా రద్దుచేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- బెంగళూరు: ఇండియన్ సిలికాన్ సిటీలో ఇంగ్లిష్‌కు వ్యతిరేకంగా ఎందుకీ ఘర్షణలు?
- హ్యూమన్ రైట్స్ వాచ్: మైనారిటీలు, మహిళల పట్ల భారత్ వివక్ష చూపిస్తోందన్న 'వరల్డ్ రిపోర్ట్-2024'
- పశ్చిమ బెంగాల్: వామపక్ష ర్యాలీకి భారీగా తరలివచ్చిన జనం... వీరంతా ఓట్లేస్తారా?
- INDvsAFG: ఇషాన్ కిషన్‌కు ఏమైంది? క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా
- రాజీవ్ గాంధీ నుంచి మోదీ వరకు: మాల్దీవులను భారత్ నాలుగుసార్లు ఎలా ఆదుకుందో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









