2022లో ప్రపంచంలో ఏం జరిగింది?
ప్రపంచం కొత్త ఆశలతో కొత్త ఏడాదిలో అడుగు పెడుతోంది. మరి 2022లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన కీలక పరిణామాలేంటో ఇప్పుడు చూద్దాం.
2022 ఫిబ్రవరి నెలలో యుక్రెయిన్‌పై యుద్ధానికి దిగింది రష్యా. తన చిరకాల ప్రత్యర్థి అయిన నేటో కూటమిలో చేరేందుకు యుక్రెయిన్ సిద్ధపడటాన్ని రష్యా సహించలేకపోయింది. తూర్పు యుక్రెయిన్‌లోని ఖేర్సాన్, దోనియెస్క్, లుహాన్‌స్క్, జపోరిఝ్ఝియా వంటి కీలక నగరాలను ఆక్రమించుకుంది. కానీ కొద్ది రోజుల్లోనే యుక్రెయిన్‌ను వశపర్చుకుంటానని ఆశించిన రష్యా యుక్రెయిన్ సైన్యాల నుంచి దీటైన ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి. చాలా ప్రాంతాలను యుక్రెయిన్ సైన్యాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.
ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదలకు, ఆహార కొరతకు దారితీయగా, ముందే కష్టాల్లో ఉన్న ప్రపంచ ఆర్థికవ్యవస్థ మరింత దిగజారింది. యుక్రెయిన్ విద్యుత్ కేంద్రాలను దెబ్బతీయడం ద్వారా యుద్ధంలో పైచేయి సాధించాలని రష్యా చూస్తోండగా... అమెరికా సహా నేటో దేశాలు అందించే ఆయుధ సంపత్తితో రష్యాను ఓడించాలని యుక్రెయిన్ ప్రయత్నిస్తోంది.
ఇంకా ఈ ఏడాది జరిగిన అనేక పరిణామాలను ఈ వీడియోలో చూడండి..

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)







