పాలస్తీనా అనుకూల విద్యార్థులపై ఉక్కు పాదం మోపాలన్న ట్రంప్ నిర్ణయానికి తొలి బాధితుడు
గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్దానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు నాయకత్వం వహించారు 30 ఏళ్ల మహ్‌మూద్.
ప్రభుత్వం ఆయనను టార్గెట్ చేసిందని ఆయన తరఫు న్యాయవాదులన్నారు.
ఆయనను అరెస్ట్ చేసి, గర్భవతిగా ఉన్న భార్యకు దూరంగా వెయ్యి మైళ్ల దూరానికి తరలించారని, ఇప్పుడు దేశం నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వారన్నారు.
ఇప్పటి వరకూ మహ్‌మూద్‌తో విడిగా మాట్లాడే అవకాశం కూడా తమకు దొరకలేదని వారు కోర్టులో చెప్పారు.
షాలోమ్ అనే క్యాప్షన్‌తో మహ్‌మూద్ ఖలీల్ ఫోటోను వైట్‌హౌస్ ట్వీట్ చేసింది. అలా అధికారులు తాము దేన్నీ లెక్క చేయమనే సంకేతాలిచ్చారు.
మహ్‌మూద్‌పై మోపిన ఆరోపణల్లో వాస్తవం లేదని కాదని ఆయన భార్య అన్నారు. ఆయనతో పరిచయం ఉన్న చాలామంది కూడా అదే మాట చెప్పారు.
మహ్‌మూద్ ఖలీల్‌ను అరెస్ట్ చేసినప్పటి నుంచీ ఆయనకు మద్దతుగా న్యూయార్క్‌లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.
యాక్టివిజాన్ని దెబ్బతీసే చర్యలకు ఇదొక ఉదాహరణ అవుతుందని చాలా మంది భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









