చైనా: హఠాత్తుగా ఎగిరి, పేలిపోయిన రాకెట్

వీడియో క్యాప్షన్, చైనా: హఠాత్తుగా ఎగిరి, పేలిపోయిన రాకెట్
చైనా: హఠాత్తుగా ఎగిరి, పేలిపోయిన రాకెట్
ప్రచురణ

ప్రయోగానికి సిద్ధం చేస్తున్న ఓ స్పేస్ రాకెట్ హఠాత్తుగా నింగిలోకి ఎగిరి పేలిపోయిన ఘటన చైనాలో జరిగింది.

ఆదివారం జూన్ (30) ఈ రాకెట్‌ను ప్రయోగించడానికి సిద్ధం చేస్తుండగా, దానంతట అదే హఠాత్తుగా ఎగిరింది. కాసేపట్లోనే అది పర్వత ప్రాంతంలో కుప్పకూలింది.

ఓ ప్రైవేటు సంస్థకు చెందిన ఈ రాకెట్ పేరు తియాన్‌లాంగ్-3.

సెంట్రల్ చైనాలోని హీనన్ ప్రావిన్స్‌లో కొండ ప్రాంతంలో ఈ రాకెట్ కూలి పేలిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో కనిపిస్తున్నాయి.

‘‘రాకెట్‌కు, ప్రయోగ వేదికకు మధ్యన అనుసంధానంలో నిర్మాణాత్మక పొరపాటు వల్ల రాకెట్ ఎగిరింది’’ అని ఈ రాకెట్‌ను తయారు చేసిన తియాన్‌బింగ్ టెక్నాలజీస్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

చైనా రాకెట్

ఫొటో సోర్స్, CHINESE SOCIAL MEDIA

ఆన్‌బోర్డు కంప్యూటర్ ఆటోమెటిక్‌గా షట్‌డౌన్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆ సంస్థ వెల్లడించింది.

‘‘ప్రయోగ వేదికకు నైరుతి దిక్కున 1.5 కిలోమీటర్ల దూరంలో పర్వత ప్రాంతాలలో రాకెట్ కూలిపోయింది’’ అని తెలిపింది.

ఈ ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగగలేదని కంపెనీ తెలిపింది.

తియాన్‌లాంగ్ -3 ను పునర్వినియోగ రాకెట్‌గా రూపొందించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)