అక్రమ వలసదారులంటూ సైనిక విమానాల్లో వెనక్కి పంపుతున్న ట్రంప్ ప్రభుత్వం

వీడియో క్యాప్షన్, సైనిక విమానాల్లో సంకెళ్లు వేసి..
అక్రమ వలసదారులంటూ సైనిక విమానాల్లో వెనక్కి పంపుతున్న ట్రంప్ ప్రభుత్వం
ప్రచురణ

అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని చెబుతున్న వలసదారులతో బయలుదేరిన అమెరికన్ సైనిక విమానం భారత్‌కు చేరుకుంది.

డోనల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అమెరికాలో ఉంటున్న భారతీయులను వెనక్కి పంపడం ఇదే తొలిసారి.

భారత్‌తో పాటు బ్రెజిల్, గ్వాటెమలా, పెరూ, హోండురాస్‌ పౌరులను కూడా సైనిక విమానాల్లో అమెరికా నుంచి వెనక్కి పంపించారు.

అక్రమ వలసదారులంటూ సైనిక విమానాల్లో వారి దేశాలకు పంపించేయాలన్న డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శలొచ్చాయి.

సైనిక విమానాలను ఉపయోగించడం ద్వారా ట్రంప్ గట్టి సంకేతాలు పంపాలనుకుంటున్నారని భావిస్తున్నారు.

అక్రమ వలసదారులను కస్టడీలో ఉంచడం, చట్టపరంగా అప్పీల్ చేసుకునేందుకు సమయం ఇచ్చేకంటే, వారిని వెంటనే వెనక్కి పంపించేయడానికే మొగ్గు చూపుతానని గత డిసెంబర్‌లో ట్రంప్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)