ట్రంప్ వ్యాఖ్యలపై జోర్డాన్ ప్రజల నిరసన దేనికి?
ట్రంప్ వ్యాఖ్యలపై జోర్డాన్ ప్రజల నిరసన దేనికి?
ప్రచురణ
జోర్డాన్.. శరణార్థులతో నిండిపోయిన ఈ చిన్న దేశంలో చుట్టూ ఎటు చూసినా సంఘర్షణలు, యుద్ధాలే..అస్థిరత్వం నిండిన ప్రాంతంలో స్థిరత్వానికి సూపర్ పవర్‌గా నిలిచింది జోర్డాన్. కానీ ఇప్పుడు అది తన మిత్రదేశం అమెరికాతోనే సమస్యలు ఎదుర్కొంటోంది. గాజావాసులంతా జోర్డాన్‌కు వెళ్లిపోవాలంటూ డోనల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ జోర్డాన్‌లో గతవారం వేలాది మంది ప్రజలు నిరసనలు తెలిపారు.
దీన్ని పాలస్తీనా నేలను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న ఇజ్రాయెల్ రైట్ వింగ్ నాయకులకు ఉపయోగపడే పథకంగా చూస్తున్నారు జోర్డాన్ ప్రజలు. జోర్డాన్‌లో ఇప్పటికే 20లక్షల మందికి పైగా పాలస్తీనీయులు ఆశ్రయం పొందుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









