కేరళ తీరంలో మునిగిన నౌకలోని కంటెయినర్లు పేలిపోతాయా?
కొచ్చి తీరానికి సమీపంలో లైబీరియాకు చెందిన కార్గో షిప్ మునిగిపోయి చమురు లీకవ్వడంతో, తమ రాష్ట్రంలోని తీర ప్రాంతాలకు కేరళ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
ఓడ మునక వల్ల ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడం నైరుతి రుతుపవనాల తీవ్రత కారణంగా కష్టంగా మారినట్లు తెలిపింది.
ఓడలో ఉన్న 643 కంటెనర్లలో 73 ఖాళీగా ఉన్నాయి. 13 కంటెనర్లలో కాల్షియం కార్బైడ్ రసాయనం ఉంది. ఇది ఎసిటలీన్ వాయువును విడుదల చేస్తుంది.
ఇదే కాకుండా 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నెస్ ఆయిల్ లోడ్ కూడా ఓడలో ఉంది.
ఈ కారణంగానే తీర ప్రాంత జిల్లాల్లో ముఖ్యంగా అలప్పుజా, కొల్లం, ఎర్నాకుళం, తిరువనంతపురాలలో రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెంచింది.

ఫొటో సోర్స్, ANI
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









