రష్యా సైనికులపై యుక్రెయిన్ ప్రయోగిస్తున్న ఈ డ్రోన్ల ప్రత్యేకత ఏంటి?
రష్యా సైనికులపై యుక్రెయిన్ ప్రయోగిస్తున్న ఈ డ్రోన్ల ప్రత్యేకత ఏంటి?
ప్రచురణ
యుక్రెయిన్ తూర్పు ప్రాంతంలో యుద్ధం కొనసాగుతోంది. రష్యాపై ప్రయోగించేందుకు యుక్రెయిన్ డ్రోన్ యూనిట్‌లను సిద్దం చేస్తోంది. ఇందుకోసం పనిచేసే యూనిట్ ఇంప్రొవైజ్డ్ బాంబులను చేత్తో అమరుస్తున్నారు. వీటిలో కొన్ని విడి భాగాలను 3డీ ప్రింటింగ్ ద్వారా తయారు చేశారు.
ఈ డ్రోన్లను వేంపైర్ అని పిలుస్తున్నారు. అంటే రాత్రిపూట చావుని తీసుకొస్తాయని అర్థం.అక్కడికి కొద్ది మైళ్ల దూరంలో ఉన్న రష్యన్ల కంటపడకుండా ఉండేందుకు వీళ్లు టార్చ్ లైట్ సాయంతో పనిచేస్తున్నారు.తర్వాత శత్రు స్థావరాల లక్ష్యంగా ఈ డ్రోన్‌ని ప్రయోగించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









