మార్కాపురం పలకలు: దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఈ పరిశ్రమ ఎందుకు డీలా పడింది?

వీడియో క్యాప్షన్, మార్కాపురం పలకల పరిశ్రమ ఎందుకు డీలా పడిపోయింది?
మార్కాపురం పలకలు: దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఈ పరిశ్రమ ఎందుకు డీలా పడింది?
ప్రచురణ

మార్కాపురం అంటే అందరికీ గుర్తుకొచ్చేది పలకల పరిశ్రమ. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ పరిశ్రమ ఇప్పుడు మనుగడ కోసం ప్రయాసలు పడుతోంది.

రెండు దశాబ్దాల క్రితం అక్షరాలు దిద్దేందుకు అందరికీ రాతి పలకలే అవసరం ఉండేది. వాటికి మార్కాపురమే ముఖ్య స్థానంగా ఉండేది.

మార్కాపురం పలకలు కేవలం తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశమంతటా విస్తరించాయి. బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయికి చేరాయి.

మార్కాపురం పలకల పరిశ్రమ

వేల మందికి ఉపాధి కల్పించిన పరిశ్రమలో ఇపుడు అనేక యూనిట్లు మూతపడ్డాయి. దాని ప్రభావం ఉపాధి అవకాశాలతో పాటుగా అనుబంధ రంగాల మీద కూడా పడుతోంది. ఈ పరిశ్రమపై బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)