ఒక వ్యక్తి ఒకేసారి ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకోవడం చట్టబద్ధమేనా?
మహారాష్ట్ర సోలాపుర్‌లో ఇద్దరు కవల యువతులు ఒకే యువకుడిని పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు పత్రికల్లోనూ ఈ పెళ్లిపై వార్తలు వస్తున్నాయి.
ఇలా ఒకేసారి ఇద్దరిని పెళ్లి చేసుకోవడం నేరమని కొందరు చెబుతున్నారు. మరోవైపు ఈ పెళ్లికి చట్టపరమైన చిక్కులు కూడా ఎదురవుతున్నాయి.

ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరినట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రూపాలీ చాకణాకర్ వెల్లడించారు.
‘‘సోలాపుర్‌కు చెందిన ఒక యువకుడు ముంబయిలో ఇద్దరు కవల అమ్మాయిలను ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు. ఇది ఐపీసీలోని సెక్షన్ 494 ప్రకారం నేరం. సోలాపుర్ ఎస్పీ దీనిపై విచారణ చేపట్టాలి. వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్‌కు నివేదిక సమర్పించాలి’’అని రూపాలీ ఒక ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- భారత్, పాకిస్తాన్ యుద్ధం 1971 - ఘాజీ: విశాఖలో అప్పుడు రాత్రి పూట ఒక్క దీపం కూడా వెలగలేదు
- పారిశ్రామికవేత్త బిర్లా రూ.10 లక్షలు ఇస్తానంటే అంబేడ్కర్ ఎందుకు తిరస్కరించారు
- బాబ్రీ మసీదు విధ్వంసానికి ఒక రోజు ముందు 'రిహార్సల్స్' ఎలా జరిగాయంటే..
- మీరు తాగే నీటిలో రకాలు ఎన్ని.. ఆర్వో, వాటర్ ఫిల్టర్ల నీళ్లను తాగితే ఏమవుతుంది
- మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేయడం మంచిదా? లేక హోం లోన్, కార్ లోన్ తీసుకోవడం ఉత్తమమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









