You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'నన్ను తిట్టారు, మా అమ్మను కూడా దూషించారు' - మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ, "ఈ రోజు మీతో మాట్లాడాలనుకుంటున్నా.
జంతర్ మంతర్ వద్ద జరిగిన విషయాన్ని దేశమంతా, ప్రపంచమంతా చూసింది.
కొంతమంది ఆకతాయిలు చాలా అసభ్యకరమైన భాషను, సభ్యసమాజానికి తగని పదజాలాన్ని ఉపయోగించారు.
నన్ను తిట్టారు. చనిపోయిన నా తల్లిని కూడా దూషించారు. ఎంత బాధ కలిగిందో చెప్పలేను. అయినప్పటికీ, నేను ఈ రోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చిన్నతనంలోనే తప్పులు జరుగుతాయి. కానీ, ఆ తప్పులను సరిదిద్దుకునే అవకాశం కూడా ఆ దశలోనే ఉంటుంది.
అందుకే సమాజంలో ఉన్న ఆగ్రహాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. మన కుమార్తెలు ఇలాంటి భాష ఎలా మాట్లాడగలిగారు అనే బాధ ప్రతి సంస్కారవంతమైన వ్యక్తికీ ఉంటుంది.
కానీ, ఇప్పుడు వారిని ప్రేమగా దగ్గరకు తీసుకుని, వారికి సరైన దారి చూపించాల్సిన సమయం వచ్చింది.
వాళ్లు దారితప్పిన పిల్లలు. వారికి సరైన మార్గం చూపడం మన బాధ్యత. వారిని శిక్షించడం, కోర్టుల చుట్టూ తిప్పించడం, సమాజంలో అవమానించడం వల్ల పరిస్థితులు మారవు. నేను వారిని క్షమించాలనుకుంటున్నాను" అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)