తైవాన్ భూకంపం: పసిమొగ్గల ప్రాణాల కోసం నర్సుల ఆరాటం, వీడియో వైరల్
తైవాన్‌లో భూకంపానికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఓ ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంలో నర్సులు నవజాత శిశువుల ప్రాణాల కోసం పడిన ఆరాటం ఈ వీడియోలో కనిపిస్తోంది.
ఈ వీడియోను ఆస్పత్రికి చెందిన ఒక నర్సు షేర్ చేశారు. ఆమె, సహచర నర్సులు శిశువుల ఊయలన్నింటినీ ఒక చోటకు చేర్చి, వాటిని కదలకుండా పట్టుకునే ప్రయత్నం చేశారు.
భూకంపం కారణంగా బిల్డింగ్ మొత్తం ఊగిపోతున్నా ఈ నర్సులు పిల్లల ఊయలలను గట్టిగా పట్టుకోవడం ఆ వీడియోలో కనిపిస్తోంది.
గదిలోని కిటికీ పగిలి పిల్లలకు గాయాలవుతాయోమోనని వారు ఆందోళన చెందారు.

ఫొటో సోర్స్, Google,Taiwan Train communication Networks Traffic Centre
9 మంది మృతి, 900 మందికి గాయాలు
తైవాన్ తూర్పు తీర ప్రాంతాన్ని మంగళవారం భారీ భూకంపం కుదిపేసింది. 9 మంది చనిపోయారు. 900 మందికిపైగా గాయపడ్డారు.
కూలిపోయిన సొరంగాలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలలో దాదాపు 127 మంది చిక్కుకుపోయారు.
హువాలిన్ నగరానికి 18 కిలోమీటర్ల (11 మైళ్ళ) దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. దాని బలమైన ప్రకంపనలు 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న తైపీ రాజధానిని కూడా తాకాయి.
‘‘బలమైన ప్రకపంనలు వచ్చాయి. దీంతో నేను మంచం మీద నుంచి దిగాను. బట్టల బీరువా, మరో చిన్న చిక్కపెట్టె కిందపడిపోయాయి. దీంతో ఇంకెన్ని సామాన్లు నష్టపోవాల్సి వస్తుందోననే బెంగపడ్డాను. అదృష్టవశాత్తూ నా నామోటారు సైకిల్ కిందపడిపోవడం తప్ప పెద్దగా నష్టం వాటిల్లలేదు’’ అని హువాలిన్ నగరంలో నివసించే ఓసియన్ తాయ్ బీబీసీ చైనీస్‌కు వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
తీరంలోని ఇరుకైన, మలుపుల రహదారులు, సొరంగాలలో చాలామంది చిక్కుకుపోయారు.
ఇక్కడి పర్వతాల నుంచి పసిఫిక్ సముద్రాన్ని చూడటానికి అనేకమంది పర్యాటకులు వస్తుంటారు. దీంతో ఈ మార్గం ఎంతో ప్రసిద్ధి చెందింది.
హువాలిన్ నగరంలోని జిన్ వెన్, క్వింగ్ షుయ్ సొరంగ మార్గాలలో చిక్కుకుపోయిన 77 మందిని బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
క్వింగ్‌షుయ్ సొరంగ మార్గం బయట రోడ్డు పూర్తిగా ధ్వంసమై లోయలాగా ఏర్పడింది.
ఇవి కూడా చదవండి :
- అర ఎకరంలో 60 బోర్లు, సాగునీటి కష్టాలకు ఐకమత్యంతో చెక్ పెట్టిన అనంతపురం రైతులు
- తెల్ల గుడ్లు, ఎర్ర గుడ్లు: వేటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి?
- పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ఆంధ్రప్రదేశ్: పింఛన్లు ఇంకా అందకపోవడానికి అసలు కారణమేంటి? ఈసీ ఏం చెప్పింది?
- కుప్పం నియోజకవర్గానికి నీళ్లొచ్చాయా? రాలేదా? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









