డోనల్డ్ ట్రంప్: ‘ఇది అమెరికా స్వర్ణ యుగానికి ఆరంభం మాత్రమే’
ఒకవైపు యుక్రెయిన్‌కు సైనిక సాయం నిలిపివేత, మరోవైపు కెనడా, మెక్సికో దేశాల దిగుమతులపై భారీ సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.. మంగళవారం రాత్రి అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంట్) జాయింట్ సెషన్‌లో కీలక ప్రసంగం చేశారు.
‘‘ గత ప్రభుత్వాలు నాలుగు లేదా ఎనిమిదేళ్లలో సాధించలేనిది మేం కేవలం 43 రోజుల్లో సాధించాం. ఇదింకా ఆరంభం మాత్రమే’’ అంటూ... వలసలపై ఇప్పటి వరకు దేశం లోపల చేపట్టిన చర్యలను డోనల్డ్ ట్రంప్ ప్రశంసించారు.
ట్రంప్ తన మొదటి పాలనా కాలంలో ఎలా మాట్లాడేవారో, ఎలా కనిపించేవారో ఇప్పడూ అలానే ఉన్నారు.
అయితే ఈసారి మరింత అనుభవంతో, రెట్టించిన ధైర్యంతో కనిపిస్తున్నారు. వైట్‌హౌస్‌లో అడుగు పెట్టినప్పటి నుంచీ తాను చేపట్టిన చర్యలను గట్టిగా సమర్థించుకుంటూ ఆయన ప్రసంగం కొనసాగింది. ట్రంప్ ప్రసంగానికి చెందిన పూర్తి వివరాలను పై వీడియోలో చూద్దాం..

ఫొటో సోర్స్, Reuters
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









