కందుకూరు, గుంటూరు ఘటనలకు కారణం ఎవరు? - వీక్లీ షో విత్ జీఎస్
ఆంద్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభలో వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండు ఘటనల్లో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. గుంటూరులో జనవరి 1న చంద్రన్న కానుక పేరుతో ఎన్టీఆర్ జనతా వస్త్రాలంటూ చేపట్టిన పంపిణీలో జరిగిన తొక్కిసలాట ముగ్గురి ప్రాణాలు తీసింది.
డిసెంబర్ 28న నెల్లూరు జిల్లాలోని కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు.ఈ వరుస ఘటనలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

కందుకూరు, గుంటూరు ఘటనలకు కారణం ఎవరు? ఇరుకు మార్గాల్లో రోడ్ షోల వెనకున్న మతలబు ఏంటి? ర్యాలీలపై ఆంక్షలు విధించడం దేనిని సూచిస్తోంది? అన్న అంశాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్.రామ్మోహన్ విశ్లేషణ.. ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్’లో..
ఇవి కూడా చదవండి
- భారతరత్న పురస్కారానికి అర్హులను ఎలా ఎంపిక చేస్తారు... విజేతలకు కలిగే ప్రయోజనాలు ఏంటి?
- ‘‘కారు కింద యువతి చిక్కుకుందని.. కారులో ఉన్న వాళ్లకి తెలుసు - కానీ కావాలనే ఈడ్చుకెళ్లారు’’: మృతురాలి స్నేహితురాలు
- మంచినీటి ట్యాంకులో మలం: ‘‘నా చేతితోనే పిల్లాడికి విషం ఇచ్చినట్లు అనిపించింది’’
- చంద్రబాబు కుప్పం పర్యటన: ‘నా నియోజకవర్గం నుంచి నేను పారిపోవాలా’... పోలీసుల మీద టీడీపీ అధినేత ఆగ్రహం
- కందుకూరు: ‘వద్దు మమ్మీ! అంటున్నా వెళ్లింది.. తిరిగి రాలేదు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









