నాయిని నరసింహారెడ్డి: తెలంగాణ ఉద్యమ నేత, తొలి హోం మంత్రి నాయిని మృతి

నాయిని

ఫొటో సోర్స్, FB/NAYININARSIMHAREDDY

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

తెలంగాణ రాష్ట్ర మాజీ హోం మంత్రి, కార్మిక నేత నాయిని నర్సింహారెడ్డి అనారోగ్యంతో అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం అర్థరాత్రి 12.25 గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 86 ఏళ్లు.

సెప్టెంబర్ 28న కోవిడ్ బారిన పడిన నర్సింహారెడ్డి సిటి న్యూరో సెంటర్లో 16 రోజుల పాటు చికిత్స పొందారు. వారం రోజుల కిందట పరీక్షించినప్పుడు ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చింది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనపై వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. కానీ, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తీవ్రం కావడంతో ఆయన మృతి చెందారని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

అంతకుముందు, బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అపోలో ఆస్పత్రికి వెళ్లి నాయినిని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నాయిని మరణవార్త తెలిసిన వెంటనే కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సహచరుడు, చిరకాల మిత్రుడిని కోల్పోయానని, ఆయన మృతి టీఆరెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి, కార్మిక లోకానికి తీరని లోటు అని అన్నారు.

నాయిని

ఫొటో సోర్స్, TRS/FB

తెలంగాణ తొలి హోం మంత్రి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత తొలి హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాయిని నరసింహారెడ్డి 1934 మే 12న నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని నేరడుగొమ్ము గ్రామంలో జన్మించారు. అయన తండ్రి పేరు దేవయ్య రెడ్డి, తల్లి సుభద్రమ్మ.

నాయిని 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అదే ఏడాది జయప్రకాశ్ నారాయణ్ శిష్యుడిగా జనతా పార్టీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1970లో హైదరాబాద్‌లో స్థిరపడిన నరసింహారెడ్డి క్రమక్రమంగా కార్మిక నేతగా ఎదిగారు. హైదరాబాద్ కేంద్రంగా కార్మిక ఉద్యమాలు నడిపారు. ఒక సందర్భంలో ఆయన ముంబయి రిక్షా కార్మికుల సంఘానికి కూడా నాయకత్వం వహించారు.

జనతా పార్టీ అభ్యర్థిగా 1978, 1985లో ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో టీఆరెఎస్ పార్టీ నుంచి శాసనసభకు ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంతో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన హోం మంత్రిగా పని చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన నాయిని పదవీ కాలం 2020తో ముగిసింది.

హైదరాబాద్ టైగర్, ట్రేడ్ యూనియన్ నాయకుడు నాయిని మృతి తనను తీవ్ర విచారానికి గురి చేసిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

తెలంగాణ సమస్యల కోసం పోరాడడానికి ఎన్నడూ వెనుకాడని నాయిని మృతి తీరని లోటు అని శ్రవణ్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)