You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్‌లో 68.12 శాతం పోలింగ్ నమోదు - ఎన్నికల సంఘం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 68.12 శాతం పోలింగ్ నమోదైంది. పూర్తి సమాచారం అందిన తర్వాత పోలింగ్ శాతాల్లో మార్పులు ఉండొచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. దేశవ్యాప్తంగా నాలుగో దశలో 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో సోమవారం పోలింగ్ జరిగింది.
లైవ్ కవరేజీ
11 గంటల సరికి ఏపీలో 23 శాతం పోలింగ్
ఉదయం 11 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 23 శాతం పోలింగ్ నమోదైంది.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు 24.31 శాతం పోలింగ్ నమోదైంది.
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలలో మధ్యాహ్నం 11 గంటల వరకు 16.34 శాతం ఓటింగ్ నమోదైంది.
వైసీపీ అధ్యక్షుడు జగన్ పోటీ చేస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో 31.06 శాతం పోలింగ్ నమోదైంది.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 22.56 శాతం పోలింగ్ నమోదైంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో 26.47 శాతం ఓటింగ్ నమోదైంది.
సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దేశాలతో బైడెన్‌కు వచ్చిన సమస్య ఏంటి?
ఓటు వేయాలంటే నది దాటాల్సిందే
పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలోని రెబ్బ గ్రామస్థులు ఓటు వేయడానికి నది దాటాల్సి వచ్చింది.
మోకాలు లోతు నీటిలో నాగావళి నదిని దాటి కూనేరు పోలింగ్ కేంద్రానికి వెళ్లి వీరంతా ఓట్లు వేశారు.
మంగళగిరిలో ఓటేసిన పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు, పిఠాపురం అభ్యర్థి పవన్ కల్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి కాలనీలోని పోలింగ్ కేంద్రానికి భార్యతో కలిసి వచ్చిన ఆయన ఓటు వేశారు.
ఓటేసిన జగన్, చంద్రబాబు, లోకేశ్, చిరంజీవి, జూ.ఎన్టీఆర్
పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భాకరాపురంలో ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఓటు వేశారు. అక్కడి జయమహల్ అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్‌కు భార్య భారతితో వచ్చి ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం కడప పార్లమెంటు స్థానం పరిధిలో ఉంది.
మంగళగిరి నియోజకవర్గంలో టీటీడీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి ఓటు హక్కు వినియోగించున్నారు.
ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్డులో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో చంద్రబాబు కుటుంబ సభ్యులు ఓటేశారు.
సినీ నటుడు చిరంజీవి, ఆయన కుటుంబం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలింగ్ స్టేషన్‌లో ఓటేసింది.
భార్య ప్రణతి, తల్లితో కలసి పోలింగ్ బూత్‌కి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ క్యూలో నిలబడి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని బర్కత్‌పురలో ఓటేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: మీ ఓటు వేరేవాళ్లు వేస్తే ఏం చేయాలి?
తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు: ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు
తెలంగాణలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ఓటింగ్‌లో ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆయన భార్య ఉషా నాయుడు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ వద్ద ఓటేశారు.
నటుడు అల్లు అర్జున్ సైతం జూబ్లీహిల్స్ పోలింగ్ స్టేషన్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024: ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
175 అసెంబ్లీ స్థానాలకు గాను ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరుగుతుంది.
ఓటింగ్ సందర్భంగా ఎలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ భద్రతా పరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంది.
పోలింగ్ ప్రారంభం కావడంతో, పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు బార్లు తీరారు.
ఏపీతో పాటు, ఒడిశా అసెంబ్లీకి కూడా ఇవాళే పోలింగ్.
అంతేకాక, దేశవ్యాప్తంగా 96 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇవాళ నాలుగో విడత పోలింగ్ జరుగుతుంది.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని చూడండి.