You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కర్ణాటక బీజేపీ పోస్ట్ చేసిన వీడియోను తొలగించాలంటూ ‘ఎక్స్‌’కు ఈసీ ఆదేశాలు

ముస్లిం రిజర్వేషన్లపై కర్ణాటక బీజేపీ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసిన యానిమేషన్ వీడియోను వెంటనే తొలగించాలని ఎక్స్‌ (ట్విటర్)ను ఎన్నికల సంఘం ఆదేశించింది.

లైవ్ కవరేజీ

  1. రఫాలో హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ దాడులు

    తూర్పు రఫాలో హమాస్‌ లక్ష్యంగా దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది.

    ఈ దాడులకు ముందు ఈ ప్రాంతంలో నివసించే లక్ష మంది ప్రజలను ఖాన్ యూనిస్‌కు సమీపంలోని మానవతా క్యాంపుకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ అల్టిమేటం జారీ చేసింది.

    రఫా వైపుగా ఇజ్రాయెల్ ట్యాంకులు వెళ్తున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అయితే, దీన్ని బీబీసీ ధ్రువీకరించలేదు.

    తూర్పు రఫాలోని కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం పిలుపునిచ్చిన తరువాత, గాజా ప్రజలు నగరాన్ని విడిచి వెళ్లిపోతున్నారు.

    కీలకాంశాల్లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య అంగీకారం కుదరకపోవడంతో గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం పునరుద్ధరణ, బందీలను విడుదల లక్ష్యంగా జరిగిన చర్చలు నిలిచిపోయాయి.

    హమాస్ డిమాండ్లకు లొంగిపోవడమంటే ఓడిపోవడంతో సమానమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. చర్చలను నెతన్యాహు నాశనం చేశారని హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే ఆరోపించారు.

    రఫాలో ఇజ్రాయెల్ దాడి కొత్త మారణకాండకు దారితీస్తుందని జోర్డాన్ రాజు అమెరికా అధ్యక్షుడితో అన్నారు.

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జోర్డన్ రాజు అబ్దుల్లాII తో వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు కాల్పుల విరమణ చర్చల విషయంపై చర్చించారు.

  2. అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించిన మన్యం వీరుడి కథ

  3. కర్ణాటక బీజేపీ పోస్ట్ చేసిన వీడియోను తొలగించాలంటూ ‘ఎక్స్‌’కు ఈసీ ఆదేశాలు