శివగంగలో ఓటువేసిన చిదంబరం
తమిళనాడు కాంగ్రెస్ నేత పి. చిదంబరం శివగంగలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడులో ఇండియా కూటమి మొత్తం 39 పార్లమెంటు స్థానాలలోనూ గెలుస్తుందని ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థకు చెప్పారు.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి జరిపినట్టు ఇద్దరు అమెరికా అధికారులు బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్ న్యూస్‌కు తెలిపారు.
తమిళనాడు కాంగ్రెస్ నేత పి. చిదంబరం శివగంగలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడులో ఇండియా కూటమి మొత్తం 39 పార్లమెంటు స్థానాలలోనూ గెలుస్తుందని ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థకు చెప్పారు.
చెన్నై దక్షిణ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై చెన్నై సాలిగ్రామం పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది.
తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో పోలింగ్ మొదలైంది.
తొలిదశలో మొత్తం 102 పార్లమెంటు స్థానాలలో 1625 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
16.63 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఎన్నికల సంఘం తెలిపిన సమాచారం మేరకు మొత్తం 1.87 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
102 స్థానాలలోనూ 18 లక్షల ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు.
తొలిదశలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్న మొత్తం ఓటర్లలో 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 కోట్ల మంది మహిళలు, 11,371 మంది థర్డ్ జెండర్ ఉన్నట్టు ఎన్నికల సంఘం డేటా చెబుతున్నట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
సెంటర్ ఫర్ స్టడీ ఆప్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్) ఇటీవల చేసిన ప్రీపోల్ సర్వేలో ధరలపెరుగుదల, నిరుద్యోగం ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నట్టు వెల్లడైంది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి