గాజా విషయంలో నెతన్యాహు తప్పు చేస్తున్నారు - జో బైడెన్

గాజాలో వచ్చే ఆరు నుంచి ఏడు వారాల పాటు పూర్తి స్థాయిలో ఆహారం, వైద్య సరఫరాలకు యాక్సస్ కల్పించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: టీడీపీకి చిక్కవు, వైసీపీకి దొరకవు

  2. గాజా విషయంలో నెతన్యాహు తప్పు చేస్తున్నారు - జో బైడెన్

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

    ఫొటో సోర్స్, Reuters

    గాజా విషయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తప్పు చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

    ‘‘ఆయన తప్పు చేస్తున్నారని నేను అనుకుంటున్నా. ఆయన వైఖరిని నేను అంగీకరించను’’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

    గాజాలో వచ్చే ఆరు నుంచి ఏడు వారాల పాటు పూర్తి స్థాయిలో ఆహారం, వైద్య సరఫరాలకు యాక్సస్ కల్పించాలని అన్నారు.

    గాజాలోకి ప్రస్తుతం ఎంత మొత్తంలో ఆహారం, వైద్య సరఫరాలు పంపేందుకు అనుమతిస్తారో దాన్ని బట్టి యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా అందించే మద్దతు ఆధారపడి ఉంటుందని గత వారం ఆయన హెచ్చరించారు.

    గాజాలోకి మానవతా సాయం ప్రవేశించకుండా లేదా పంపిణీలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలను ఇజ్రాయెల్ కొట్టివేసింది. కాల్పుల విరమణ ఒప్పందం కోసం వారాల తరబడి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కానీ, కాల్పుల విరమణపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది.

    వరల్డ్ సెంట్రల్ కిచెన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఏడుగురు మానవతా సిబ్బంది చనిపోయిన కొన్ని రోజుల్లో నెతన్యాహు ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. అమెరికా స్పానిష్ లాంగ్వేజ్ నెట్‌వర్క్ యునివిజన్‌లో మంగళవారం రాత్రి ప్రసారమైంది.

    మానవతా సాయానికి చెందిన వాహనంపై డ్రోన్లపై జరిపిన దాడి చూస్తే చాలా షాకింగ్‌గా అనిపించిందని జో బైడెన్ అన్నారు.

  3. మిచిగాన్: కుమారుడు చేసిన నేరానికి జైలు పాలైన తల్లిదండ్రులు

    జేమ్స్, జెనీఫర్ క్రంబ్లీ

    ఫొటో సోర్స్, reuters

    అమెరికాలోని మిచిగాన్‌ హైస్కూల్‌లో ఒక టీనేజర్ జరిపిన కాల్పులకు తల్లిదండ్రులు జైలు పాలయ్యారు.కుమారుడిని నేరం చేయకుండా ఆపడంలో విఫలమైనందుకు అతడి తల్లిదండ్రులకు 10 నంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.

    ఎథాన్ క్రంబ్లీ అనే కుర్రాడు ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‌లో సెమీ ఆటోమేటిక్ గన్‌తో జరిపిన కాల్పుల్లో నలుగురు విద్యార్థులు మరణించగా, ఏడుగురు గాయాలు పాలయ్యారు.

    తొలుత ఈ తల్లిదండ్రులకు ఏడేళ్ల జైలు శిక్ష విధించాలని ప్రతిపాదించారు. కానీ, ప్రాసిక్యూషన్ ఈ శిక్షను పెంచాలని వాదించింది.

    ఈ శిక్షను ప్రకటించే సమయంలో జేమ్స్, జెనీఫర్ క్రంబ్లీ కోర్టు ముందు హాజరయ్యారు.

    తమ కుమారుడు చేసిన కాల్పులపై తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేశారు.

    తల్లిదండ్రులకు 10, 15 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో, భవిష్యత్‌లో ఇలాంటి కేసులు జరగకుండా అరికట్టవచ్చని జడ్జీ షెరిల్ మ్యాథ్యూస్ అన్నారు.

    తమ కుమారుడి మానసిక ఆరోగ్యం దిగజారుతున్నా ఈ తల్లిదండ్రులు పట్టించుకోలేదని ప్రాసిక్యూషన్ వాదించింది. 2021లో జరిగిన ఆ దాడిలో ఉపయోగించిన గన్ కూడా తల్లిదండ్రులు కొన్నదేనని వెల్లడించింది.

    ప్రస్తుతం ఈ కుర్రాడు పెరోల్ లేని జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

  4. స్వతంత్ర వార్తాసంస్థగా ‘కలెక్టివ్ న్యూస్‌రూమ్’ ప్రారంభం

  5. బెంగళూరులో నీటికి కటకట... మరి హైదరాబాద్‌ పరిస్థితి ఏంటి?

  6. ఛత్తీస్‌గఢ్ బస్సు ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు మృతి, 14 మందికి గాయాలు

    ఛత్తీస్‌గఢ్ బస్సు ప్రమాదం

    ఫొటో సోర్స్, ALOK PUTUL

    ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం రాత్రి జరిగిన బస్సు ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 14 మందికి గాయాలయ్యాయి.

    దుర్గ్ జిల్లాలోని కుంహారి ప్రాంతంలో లోతైన గుంతలో బస్సు పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

    బస్సులో ఉన్నవారందరూ ఓ డిస్టిలరీ కంపెనీకి చెందిన ఉద్యోగులు. గాయాలు పాలైన వారికి రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు దుర్గ్ కలెక్టర్ రిచా ప్రకాశ్ చౌధరి చెప్పారు.

    దుర్గ్ బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    గాయాలు పాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో, స్థానిక పాలనా యంత్రాంగం బాధితులకు అన్ని విధాలా సాయపడుతున్నట్లు చెప్పారు.

    ‘‘ఛత్తీస్‌గఢ్‌ దుర్గ్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో చాలామంది మరణించడం తీవ్ర బాధాకరం. బాధితుల కుటుంబాలకు నా సానుభూతి తెలుపుతున్నా. గాయాలు పాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’’ అని ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు.

    గాయాలు పాలైన వారిని ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ పరామర్శించారు.

    బస్సు హెడ్‌లైట్లు వెలుగకపోవడంతో, ఈ ప్రమాదం జరిగిందని ఒక బాధితుడు తెలిపినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  7. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో.. గుడ్‌మార్నింగ్!

    తాజా అప్‌డేట్లను మీకు ఎప్పటికప్పుడు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    (బీబీసీ తెలుగు కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)