బంగ్లాదేశ్ ఎన్నికలు: ఓటింగ్‌కు ముందురోజు 14 పోలింగ్ స్టేషన్లకు నిప్పు

ప్రధాన ప్రతిపక్ష నేత, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నాయకుడు నబీవుల్లా నబీతో పాటు మరో ఆరుగురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.

    మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో రేపు మళ్లీ కలుద్దాం..

    గుడ్ నైట్

  2. గాజా కాల్పుల్లో అల్ జజీరా బ్యూర్ చీఫ్ పెద్ద కొడుకు హమ్జా అల్-దహదౌహ్ మృతి

    హమ్జా అల్-దహదౌహ్(కుడి వైపున), ఆయన తండ్రి వేల్ అల్-దహదౌహ్

    ఫొటో సోర్స్, X / HAMZADAH1996

    ఫొటో క్యాప్షన్, హమ్జా అల్-దహదౌహ్(కుడి వైపున), ఆయన తండ్రి వేల్ అల్-దహదౌహ్

    షైమా ఖాలిల్

    బీబీసీ న్యూస్, జెరూసలెం

    అల్ జజీరా బ్యూరో చీఫ్ పెద్ద కొడుకు హమ్జా అల్-దహదౌహ్‌ దక్షిణ గాజాలో జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు.

    ఇజ్రాయెల్ డ్రోన్ దాడి జరిగినప్పుడు అల్ జజీరా నెట్‌వర్క్ జర్నలిస్ట్, కెమెరామ్యాన్ అయిన బ్యూరో చీఫ్ పెద్ద కొడుకు హమ్జా అల్-దహదౌహ్‌, ఆయనతో పాటు మరికొందరు జర్నలిస్ట్‌లు ఖాన్ యూనిస్, రఫా మధ్యలో రోడ్డును దాటుతున్నారు.

    ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ముస్తాఫా తురాయా కూడా ఈ దాడిలో మరణించారు.

    బ్యూరో చీఫ్ వేల్ అల్-దహదౌహ్ కుటుంబ సభ్యులు మరో నలుగురు అక్టోబర్‌లో జరిగిన దాడిలో మృతి చెందారు.

    ఆయన భార్య అమ్నా, మనవడు ఆడమ్, ఆయన 15 ఏళ్ల కొడుకు మహమూద్, ఏడేళ్ల కూతురు షామ్ అక్టోబర్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో చనిపోయారు.

    గాజాలో నిరాశ్రయులైన చాలా మంది ప్రజలు తమ భూభాగంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు రఫాలో ఈశాన్య ప్రాంతమైన మొరాజ్ ప్రాంతానికి వస్తున్నారు. ఈ ప్రాంతానికి ప్రయాణించే సమయంలోనే జర్నలిస్ట్‌లపై దాడి జరిగింది. ఇజ్రాయెల్ సైన్యం ఈ ప్రాంతాన్ని ‘హ్యుమానిటేరియన్ జోన్‌’గా పిలుస్తోంది. కానీ, ఈ ప్రాంతంలో కూడా ఇజ్రాయెల్ బాంబు దాడులు జరుగుతున్నాయి.

    ఈ ప్రాంతంలో జరుగుతున్న దాడులు, అక్కడి పరిస్థితులను రిపోర్టు చేసేందుకు హమ్జా, ఇతర జర్నలిస్ట్‌లు అక్కడికి వెళ్లినట్లు అల్ జజీరా తెలిపింది.

    ఇప్పటికే కుటుంబ సభ్యులందర్ని పోగొట్టుకున్న హమ్జా తండ్రి వేల్ అల్-దహదౌహ్ ఖాన్ యూనిస్‌లో తన కొడుకు మృతదేహం పక్కన నిల్చుని తీవ్ర కన్నీటిపర్యంతమయ్యారు. రఫాలోని దక్షిణాది నగరంలో హమ్జా అంత్యక్రియలు నిర్వహించారు.

  3. ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. మోదీకి, భారత పర్యటకానికి మద్దతుగా స్పందిస్తున్న సినీ, క్రీడా ప్రముఖులు

  4. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ: టీ20 జట్టులోకి మళ్లీ వచ్చిన సీనియర్లు

    Rohit Sharma, Virat Kohli

    ఫొటో సోర్స్, Getty Images

    టీమ్ ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సుదీర్ఘ కాలం తరువాత ఇంటర్నేషనల్ టీ20లలొ మళ్లీ ఆడనున్నారు.

    అఫ్గానిస్తాన్‌తో త్వరలో జరగబోయే టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను బీసీసీఐ ఎంపిక చేసింది.

    దీంతో ఈ ఏడాది జూన్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లోనూ వారు ఆడొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.

    అఫ్గానిస్తాన్‌తో భారత్ టీ20 సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది.

    ఇంతకుముందు చివరిసారిగారోహిత్, విరాట్‌లు 2022లో ఇంగ్లండ్‌లో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడారు.

    అఫ్గాన్ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టు ఇదే..

    రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, శివమ్ దుబె, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్

  5. హిందూ టీమ్, ముస్లింల జట్టు.. ఇలా మతాల ఆధారంగా టీమ్‌లు ఏర్పడి క్రికెట్ ఆడిన రోజులున్నాయి.. చివరకు ఆ పోటీలు ఎలా ముగిశాయో తెలుసా

  6. జపాన్ భూకంపం: శిథిలాల కింద 5 రోజుల తర్వాత సజీవంగా దొరికిన 90 ఏళ్ల బామ్మ

  7. వీగన్‌గా మారాలంటే ఇండియాను మించిన దేశం లేనే లేదా? భారతీయుల ఆహార విధానాలు ఎందుకంత ప్రత్యేకం

  8. సంగారెడ్డి జిల్లాలో నిర్మాణంలో ఉన్న చర్చి స్లాబ్ కూలి మియన్మార్ కార్మికుడు మృతి

    కూలిన చర్చి స్లాబ్

    ఫొటో సోర్స్, UGC

    సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో నిర్మాణంలో ఉన్న చర్చి స్లాబ్ కూలింది.

    ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

    మృతిచెందిన కార్మికుడు అజీముల్లా (19) మియన్మార్ దేశస్తుడిగా గుర్తించారు.

    ప్రమాదంలో గాయపడిన రాజు, హకీమ్, సాహెల్‌ల పరిస్థితి విషమంగా ఉంది.

    జమీల్, సలీం, జగ్బహదూర్ అనే మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

    చర్చి నిర్మాణంలో పనిచేస్తున్న కార్మికులలో అత్యధికులు మియన్మార్, నేపాల్ దేశాలకు చెందినవారిగా గుర్తించారు.

  9. కిమ్ జాంగ్ ఉన్: ఉత్తర కొరియా పాలకుడి 5 మిస్టరీలు

  10. ఛత్తీస్‌గఢ్: 'గిరిజన జంటకు విడాకులు ఎలా ఇవ్వమంటారో మీరే చెప్పండి’ అని న్యాయవాదినే అడిగిన హైకోర్టు.. అసలేం జరిగింది?

  11. టీబీ: భారత్‌లో వ్యాక్సీన్లతో క్షయ వ్యాధి నిర్మూలన సాధ్యమేనా?

  12. బంగ్లాదేశ్ ఎన్నికలు: ఓటింగ్‌కు ముందురోజు 14 పోలింగ్ స్టేషన్లకు నిప్పు, నడియా రాగోజినా, బీబీసీ న్యూస్

    బంగ్లాదేశ్

    ఫొటో సోర్స్, NURPHOTO/GETTY IMAGES

    బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందు రోజున14కు పైగా పోలింగ్ స్టేషన్లకు నిప్పు అంటించారు.

    నేడు (ఆదివారం) అక్కడ పోలింగ్ జరుగుతోంది.

    శుక్రవారం రోజు రద్దీగా ఉన్న ఒక రైలుకు కూడా నిప్పు పెట్టడంతో నలుగురు ప్రయాణికులు చనిపోయారు.

    ఈ ఎన్నికలను చాలా ప్రతిపక్ష పార్టీలు బాయ్‌కాట్ చేస్తున్నాయి.

    ప్రధాన విపక్షం ఎన్నికలకు దూరంగా ఉండటంతో ఈ ఎన్నికల్లోనూ బంగ్లా ప్రధానిగా ఉన్న షేక్ హసీనా నాలుగోసారి గెలవనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

    ప్రధాన ప్రతిపక్ష నేత, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నాయకుడు నబీవుల్లా నబీతో పాటు మరో ఆరుగురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

    రైలుకు నిప్పంటించిన ఘటనలో వీరి ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తూ వారిని అదుపులోకి తీసుకున్నారు.

    చిట్టాగాంగ్‌లోని బౌద్ధాలయానికి కూడా నిప్పు పెట్టినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

    అధికార అవామీ లీగ్ పార్టీకి చెందిన కార్యాలయంపై దాడి జరిగినట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది.

  13. యుక్రెయిన్-రష్యా యుద్ధం: క్షిపణి దాడిలో చిన్నారులు సహా 11 మంది మృతి, జార్జ్ రైట్, బీబీసీ న్యూస్

    రష్యా యుక్రెయిన్ యుద్ధం

    ఫొటో సోర్స్, Reuters

    తూర్పు యుక్రెయిన్‌లో రష్యా చేసిన క్షిపణి దాడిలో అయిదుగురు చిన్నారులు సహా 11 మంది చనిపోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

    దోన్బస్ రీజియన్‌లోని పోక్రోవ్‌స్క్ పట్టణంపై ఎస్-300 క్షిపణులు దాడి చేసినట్లు రీజినల్ గవర్నర్ చెప్పారు.

    ‘‘వీలైనంత ఎక్కువ నష్టం కలిగించే ప్రయత్నంలో భాగంగా పౌరులపై శత్రువు విరుచుకుపడుతోంది’’ అని టెలిగ్రామ్‌లో గవర్నర్ వాదిమ్ ఫిలాష్కిన్ పోస్ట్ చేశారు.

    నివాస ప్రాంతాలను రష్యా బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమీర్ జెలియన్‌స్కీ పేర్కొన్నారు.

    రష్యా ఈ దాడిపై ఇంకా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.

    ఈ వారం మొదట్లో రష్యా సరిహద్దుల వ్యాప్తంగా యుక్రెయిన్ 70కి పైగా డ్రోన్లను ప్రయోగించింది.

    రష్యా చేసిన అతిపెద్ద వైమానిక బాంబు దాడుల తర్వాత యుక్రెయిన్ బలగాలు ఈ డ్రోన్లను ప్రయోగించాయి.

  14. గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  15. చిత్రకూట్, తీర్థగఢ్ జలపాతాలకు ఎలా వెళ్లాలి?