వైసీపీని వీడాలని అంబటి రాయుడు నిర్ణయం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు క్రికెటర్ అంబటి రాయుడు ఎక్స్(ట్విట్టర్)లో ప్రకటించారు.

లైవ్ కవరేజీ

  1. జుట్టు రాలకూడదంటే మీరు తినే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి

  2. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

    ధన్యవాదాలు.

  3. 26 మంది బాలికలు మిస్సింగ్.. తక్షణం చర్యలు తీసుకోవాలని కోరిన శివరాజ్ సింగ్

    శివరాజ్ సింగ్ చౌహాన్

    ఫొటో సోర్స్, ANI

    భోపాల్‌లోని పిల్లల వసతి గృహం నుంచి 26 మంది బాలికలు కనిపించకుండా పోయిన కేసు వెలుగులోకి వచ్చింది.

    భోపాల్‌ పర్వలియా రోడ్డు పోలీసు స్టేషన్‌లో జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 కింద దీనిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు వార్తాసంస్థ ఏఎన్ఐ రిపోర్టుచేసింది.

    ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్య తీసుకోవాలని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు.

    ‘‘పర్వలియా రోడ్డు పోలీసు స్టేషన్‌లో అనుమతులు లేకుండా నడుపుతున్న పిల్లల వసతి గృహం నుంచి 26 మంది బాలికలు కనిపించకుండా పోయిన కేసు నా దృష్టికి వచ్చింది. ఈ కేసు తీవ్రతను, సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’’ అని ఆయన సోషల్ మీడియాలో రాశారు.

    వసతి గృహానికి చెందిన మేనేజర్ అనిల్ మ్యాథ్యూ పేరును ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. ఇక్కడ 6 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న 68 మంది బాలికలున్నారు. వారిలో 26 మంది బాలికలు కనిపించకుండా పోయారు.

    జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 నిబంధనల కింద ఈ పిల్లల వసతి గృహం నడపడం లేదని, దీని రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. దళిత రైతులకు కులం పేరుతో ఈడీ సమన్లు

  5. సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య ఆకలైతే ఏం తినాలి? బిస్కెట్లు, మరమరాలు మంచివికావా

  6. ఆదిత్య L1: తుది కక్ష్యలోకి చేరిన ఇస్రో మిషన్.. సూర్యుడికి, భూమికి మధ్య ఇప్పుడేం చేయనుంది?

  7. జెఫ్రీ ఎప్‌స్టీన్: ‘బాలికలను సెక్స్ ఊబిలో దించడానికి చైన్ రిక్రూట్‌మెంట్ పద్ధతిని వాడారు’

  8. ఆకాశంలో ప్రయాణిస్తుండగా ఊడిన విమానం డోర్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

    అలస్కా ఎయిర్‌లైన్స్ విమానం

    ఫొటో సోర్స్, ELIZABETH/CBS NEWS

    ఫొటో క్యాప్షన్, ఆకాశంలో ఉండగా విమానం డోర్ ఊడింది

    ఆకాశంలో ఉండగా ఒక ప్రయాణికుల విమానం కిటికీ తలుపు ఊడటంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

    అమెరికాలోని ఒరెగాన్‌లో ఈ ఘటన జరిగింది.

    ఈ ఘటన తర్వాత అలస్కా విమానయాన సంస్థ బోయింగ్ 737 మ్యాక్స్ 9 ఎయిర్‌క్రాఫ్ట్‌కు చెందిన 65 విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది.

    తమ విమానాలు అన్నిటినీ నిశితంగా భద్రత తనిఖీలు చేసిన తరువాతే గాల్లో ఎగిరేందుకు అనుమతిస్తామని అలస్కా ఎయిర్‌లైన్స్ చెప్పింది.

    అమెరికాలోని పోర్టుల్యాండ్(ఒరెగాన్) నుంచి ఒంటారియో(కాలిఫోర్నియా)కు బయలు దేరిన అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానం అది టేకాఫ్ అయిన కొద్దిసేపటికే గాలి ఒత్తిడిని తట్టుకోలేక విండో డోర్ ఊడిపోయింది.

    విమానం 16 వేల అడుగుల ఎత్తులో ఉండగా స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.

    ఈ విమానంలో 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వీరందరినీ పోర్టుల్యాండ్ అంతర్జాతీయ విమానశ్రయంలో సురక్షితంగా దించినట్లు అలస్కా ఎయిర్‌లైన్స్ చెప్పింది.

    దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు యూకే సివిల్ ఏవియేషన్ అథారిటీ బీబీసీకి చెప్పింది.

    ఊడిపోయిన విండో డోరుకు పక్కనే ప్రయాణికుల సీట్లు ఉన్నాయి.

  9. అంగన్వాడీల సమ్మెపై ‘ఎస్మా’ ప్రయోగించిన ఏపీ ప్రభుత్వం, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    అంగన్వాడీల ఆందోళన

    ఫొటో సోర్స్, CITU

    ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ‘ఎస్మా’ ప్రయోగించింది.ఈ మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ జీవో నంబర్ 2 విడుదల చేసింది.

    నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోని సెక్షన్ 39 ప్రకారం అంగన్వాడీ సేవలను అత్యవసర సర్వీసుల కింద పరిగణిస్తున్నట్లు ప్రభుత్వం జీవోలో చెప్పింది. దాంతో అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు సమ్మె సహా ఎలాంటి నిరసనలకు ఆస్కారం లేకుండా ఆంక్షలు విధించింది.

    ఆరు నెలలపాటు సమ్మె చేసే అవకాశం లేకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అంగన్వాడీ యూనియన్లు సమ్మె విరమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    ఇప్పటికే 25 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా 55వేల అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి.

    లక్ష మందికి పైగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ సెంటర్ టీచర్లు అందరూ సమ్మెలో పాల్గొంటున్నారు. వివిధ రూపాల్లో నిరసనలు సాగిస్తున్నారు.

    సీఐటీయూ సహా వివిధ యూనియన్లు ఈ సమ్మెకు నాయకత్వం వహిస్తున్నాయి.

    సమ్మె చేస్తున్న యూనియన్ నేతలతో ప్రభుత్వం పలు దఫాలు చర్చలు జరిపింది.అయితే వేతనాలు పెంచాలంటూ అంగన్వాడీ యూనియన్లు కోరుతున్నాయి.అది మినహా మిగతా డిమాండ్లు పరిష్కరించే ప్రయత్నం చేస్తామంటూ ప్రభుత్వం చెబుతోంది.దాంతో యూనియన్లు, ప్రభుత్వం మధ్య ఒప్పందానికి ఆస్కారం కనిపించడం లేదు.

    ప్రభుత్వం దిగి వచ్చేవరకు సమ్మె కొనసాగిస్తామంటూ అంగన్వాడీ వర్కర్లు చెబుతున్నారు. జనవరి 5లోగా విధుల్లో చేరాలన్న ప్రభుత్వ ఆదేశాలను వారు తోసిపుచ్చారు. దీంతో తాజాగా జీవో నంబర్ ద్వారా ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది.

  10. వీడియో: అయోధ్య రామాలయం తలుపుల తయారీ హైదరాబాద్‌లో

    వీడియో క్యాప్షన్, అయోధ్య రామాలయం తలుపుల తయారీ హైదరాబాద్‌లో

    అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం తలుపులను హైదరాబాద్‌లోనే తయారు చేయిస్తున్నారు.

    సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని అనురాధ టింబర్స్ అనే సంస్థ వీటిని తయారు చేస్తోంది.

    పూర్తి వివరాలకు వీడియో చూడండి.

    తలుపులు

    ఫొటో సోర్స్, Anuradha Timbers

  11. వైసీపీకి రాజీనామా చేయాలని అంబటి రాయుడు నిర్ణయం

    డిసెంబరు 28న అంబటి రాయుడికి కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, డిసెంబరు 28న అంబటి రాయుడికి కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు ఎక్స్(ట్విట్టర్)లో ప్రకటించారు.

    కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నానని ఆయన అందులో పోస్ట్ చేశారు.

    భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.

    అంబటి రాయుడు డిసెంబర్ 28న వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జగన్ స్వయంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. చనిపోతే త్వరగా మరో జన్మ ఎత్తొచ్చన్న బోధనలతో పాస్టర్ సహా ఏడుగురి ఆత్మహత్య.. ఇదెలా బయటపడింది?

  13. టీడీపీకి రాజీనామా చేస్తున్నా: విజయవాడ ఎంపీ కేశినేని నాని, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    కేశినేని నాని

    ఫొటో సోర్స్, FB / Kesineni Nani

    ఫొటో క్యాప్షన్, నాని (పాత ఫోటో)

    తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి రాజీనామా చేస్తున్నట్టు విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు.

    తన సేవలు పార్టీకి అవసరం లేదని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారని, దీంతో ఈ నిర్ణయం తీసుకున్నానని సోషల్ మీడియా వేదికగా ఆయన చెప్పారు. త్వరలోనే పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి, ఆ మరుక్షణం టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నట్టు తెలిపారు.

    2014, 19 ఎన్నికల్లో వరుసగా నాని టీడీపీ తరపున విజయవాడ ఎంపీగా గెలిచారు. రాబోయే ఎన్నికల్లో ఈ స్థానంలో నాని సోదరుడు చిన్ని టికెట్ ఆశించడంతో వారి మధ్య పోటీ ఏర్పడింది. తన స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వబోతున్నట్టు టీడీపీ నాయకత్వం తనకు సమాచారం అందించిందని నాని ఇప్పటికే వెల్లడించారు. ఆ మర్నాడే పార్లమెంట్ సభ్యత్వానికి, టీడీపీకి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు.

    ‘రా, కదలిరా’ పేరిట చంద్రబాబు జరుపుతున్న బహిరంగ సభల నిర్వహణలో నాని, చిన్ని మధ్య వివాదం ఏర్పడింది.తిరువూరులో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. దాంతో కేశినేని సోదరుల వైరానికి చెక్ పెట్టే దిశలో టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు నిర్ణయం పట్ల అసంతృప్తితో పార్టీని వీడేందుకు నాని నిర్ణయం తీసుకున్నారు.

  14. గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.