లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
సెలవుల తరువాత పాఠశాల తెరిచిన మొదటిరోజే ఓ విద్యార్థి ఆరుగురిపై కాల్పులు జరిపాడు. విచారణలో పేలుడుపదార్థాలను కూడా పోలీసులు కనుగొన్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. జూన్ 1 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుందని ఐసీసీ వెల్లడించింది.
ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా జట్టు పొరుగుదేశం కెనడాతో తలపడుతుంది.
భారత్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడుతుంది.
భారత్, పాకిస్తాన్‌ల మధ్య జూన్ 9న న్యూయార్క్‌లో మ్యాచ్ జరగనుంది.
అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ సిరీస్‌లో 20 జట్లు ఆడనున్నాయి. మొత్తం 55 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.
ఫైనల్ మ్యాచ్ జూన్ 29న ఉంటుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, icc

ఫొటో సోర్స్, icc

ఫొటో సోర్స్, icc

ఫొటో సోర్స్, icc

ఫొటో సోర్స్, Getty Images
అరేబియా సముద్రంలో హైజాక్ అయిన మర్చెంట్ నౌక వద్దకు భారత్ యుద్ధనౌకను పంపింది. హైజాక్ అయిన నౌకపై లైబీరియా జెండా ఉంది.
హైజాక్ అయిన ఈ మర్చెంట్ నౌకలో కొందరు భారతీయ సిబ్బంది ఉన్నారు.
ఈ నౌక గత సాయంత్రం సోమాలియా తీర ప్రాంతానికి దగ్గర్లో హైజాక్ అయింది.
లైబీరియా జెండా ఉన్న కార్గో షిప్ ఎంవీ లీలా నార్‌ఫోల్క్ హైజాక్ అయినట్లు గురువారం యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ నివేదించింది.
వ్యూహాత్మక సముద్ర మార్గాలలో నౌకల రాకపోకలను బ్రిటన్‌కు చెందిన ఈ సంస్థ ట్రాక్ చేస్తూ ఉంటోంది.
ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకోగానే, ఆర్మీకి చెందిన విభాగాలు వెంటనే స్పందించాయని భారతీయ నౌకాదళ అధికార ప్రతినిధి చెప్పారు.
హైజాక్ అయిన నౌక నుంచి యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ పోర్టల్‌కు మెసేజ్ వచ్చిందని తెలిపారు.
గురువారం సాయంత్రం సైన్యానికి చెందిన ఐదు నుంచి ఆరుగురు గుర్తు తెలియని సిబ్బంది నౌకలోకి ప్రవేశించారని చెప్పారు.
ఆ తర్వాత, దీని గురించి భారతీయ నౌకాదళానికి సమాచారం అందిందని, వెంటనే పెట్రోలింగ్ టీమ్‌ను పంపించామని తెలిపారు. మర్చెంట్ నౌకకు సాయం చేసేందుకు మారిటైమ్ సెక్యూరిటీ కోసం యుద్ధనౌకను భారతీయ నౌకాదళం పంపింది.
చాలా మంది భారతీయులు ఈ నౌకలో ఉన్నట్లు సమాచారం అందింది.
పరిస్థితిని సునిశితంగా పరిశీలిస్తున్నామని, మర్చెంట్ నౌకల రాకపోకలను గమనిస్తున్నామని భారతీయ నౌకాదళం తెలిపింది.

ఫొటో సోర్స్, ani
పశ్చిమ బెంగాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల వాహనంపై ఒక గుంపు దాడి చేసింది. ఈడీ అధికారులకు భద్రత కల్పిస్తున్న కేంద్ర బలగాలపై కూడా దాడి జరిగింది.
రేషన్ కుంభకోణం ఆరోపణల కేసుకు సంబంధించి జైలులో ఉన్న పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ సన్నిహితుడు శంకర్ అధ్యా నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ గుంపు దాడి చేసింది.
నార్త్ 24 పరగణాస్ జిల్లా సందేశ్‌ఖాలీలో ఈ ఘటన జరిగింది.
ఈడీ దాడులను వ్యతిరేకిస్తూ తొలుత పలువురు నిరసన తెలిపారు. తర్వాత ఒక గుంపు తమ వాహనంపై దాడి చేసిందని ఈడీ అధికారులు చెప్పారు.
ఈ దాడిలో వారి వాహనం ధ్వంసమైంది. ఇద్దరు అధికారులకు గాయాలయ్యాయని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలోని అయోవా రాష్ట్రంలోని హైస్కూల్లో ఓ విద్యార్థి జరిపిన కాల్పుల్లో ఒక విద్యార్థి మరణించగా, అయిదుగురు గాయపడ్డారు. కాల్పుల తర్వాత 17 ఏళ్ల ఆ విద్యార్ధి తనను తాను కాల్చుకుని మరణించాడు.
సెలవుల తరువాత పాఠశాల తెరిచిన మొదటిరోజే ఓ విద్యార్థి ఆరుగురిపై కాల్పులు జరిపాడు.
గాయపడిన వారిలో అయిదుగురిలో నలుగురు విద్యార్థులు, ఒక పాఠశాల అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు.
చనిపోయిన విద్యార్థి 12 ఏళ్ల వయసుంటుందని, అతను 6వ తరగతి చదువుతున్నాడని అధికారులు చెప్పారు.
విచారణలో పేలుడుపదార్థాలను కూడా పోలీసులు గుర్తించారు.
కాల్పులకు ముందు ఆ విద్యార్థి సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టాడని అయోవా డివిజన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మిచ్ మోర్ట్‌వైట్ వెల్లడించారు.
కాల్పులలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని మోర్ట్‌వైట్ చెప్పారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.