You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఖతార్ - దహ్రా గ్లోబల్ కేసు: మరణ శిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారులకు శిక్ష తగ్గింపుపై కేంద్రం ఏం చెప్పింది?
ఈ ఎనిమిది మందిలో విశాఖపట్నానికి చెందిన పాకాల సుగుణాకర్ ఒకరు. కేసు అప్పీలుపై విచారణకు ఖతార్‌లో భారత రాయబారి, ఇతర అధికారులు హాజరయ్యారు.
లైవ్ కవరేజీ
తమిళనాడు: హంగ్ అసెంబ్లీ అయితే.. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఎవరు ఎవరికి మద్దతుగా నిలుస్తారు?
తప్పిపోయిన గున్న ఏనుగును తరిమేస్తున్న ఏనుగు మందలు, ఆందోళన వ్యక్తం చేసిన మద్రాస్ హైకోర్టు, అసలేం జరిగింది?
పశ్చిమ బెంగాల్: మమత ఓటమికి 5 కారణాలు
స్టార్‌డమ్ టు చీఫ్ మినిస్టర్.. ఎవరెవరు?
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఘన విజయానికి 4 ప్రధాన కారణాలు ఇవే..
విజయ్-టీవీకే: డీఎంకే, అన్నా డీఎంకేలను దాటి మొదటి ఎన్నికల్లోనే ఘన విజయం ఎలా సాధించారు?
ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీ ఆధిక్యంలో ఉంది?, (మే 4 రాత్రి 10 గంటలకు)
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాత్రి 10 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం,
అస్సాంలో భారతీయ జనతా పార్టీ 126 స్థానాలకు గాను 81 స్థానాల్లో ఘనవిజయం సాధించి, మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 18 స్థానాలు గెల్చుకోగా, మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. బి.ఓ.పి.ఎఫ్, ఏ.జి.పి చెరో 10 స్థానాలను కైవసం చేసుకున్నాయి.
కేరళలో కాంగ్రెస్ 63 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. వామపక్ష పార్టీలైన సి.పి.ఐ(ఎం) 26 స్థానాల్లో, సి.పి.ఐ 8 స్థానాల్లో గెలుపొందాయి. ఐ.యు.ఎం.ఎల్ కూడా 22 స్థానాలతో తన బలాన్ని నిరూపించుకుంది. కేఈసీ పార్టీ ఏడు స్థానాల్లో గెలిచింది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన టీవీకే పార్టీ 96 స్థానాల్లో గెలిచి, మరో 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార డి.ఎం.కె 54 స్థానాల్లో గెలిచి 6 చోట్ల ఆధిక్యంలో ఉండగా, ఏ.డి.ఎం.కె 44 స్థానాల్లో విజయం సాధించి, మరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. మొత్తం 294 స్థానాల్లో ఇప్పటికే 184స్థానాలను గెలుచుకుని, మరో 23 చోట్ల ముందంజలో ఉంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలిచి, 16 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ రెండు స్థానాలు గెలిచింది.
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఏ.ఐ.ఎన్.ఆర్.సి 30 స్థానాలకు గాను11 స్థానాల్లో గెలిచి, మరో చోట ఆధిక్యంలో ఉంది. డీఎంకే 5, భారతీయ జనతా పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించగా, స్వతంత్ర అభ్యర్థులు 3 చోట్ల, టీవీకే అభ్యర్థులు 2 చోట్ల గెలిచారు.
ఎంకే స్టాలిన్ ఓటమి: డీఎంకే పరాజయానికి దారితీసిన 5 ప్రధాన కారణాలు
విజయ్ కారు డ్రైవర్ కొడుకు: ఎవరీ శబరినాథన్, ఎంత మెజార్టీతో గెలిచారు?
తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.
స్టాలిన్ 2011 నుంచి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో ఓడిపోయిన తమిళనాడు నాలుగో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారు. 1996లో జయలలిత ఓటమి తర్వాత, పదవిలో ఉన్న ముఖ్యమంత్రి తన సీటును కోల్పోవడం ఇదే మొదటిసారి.
తమిళనాడు రాజకీయ చరిత్రలో గతంలోనూ కొందరు ముఖ్యమంత్రులు ఇలాగే ఓడిపోయారు:
- 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి.ఎస్. కుమారస్వామి రాజా శ్రీవిల్లిపుత్తూరు సీటు నుంచి ఓడిపోయారు.
- 1967లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఎం. భక్తవత్సలం శ్రీపెరంబుదూర్‌లో పరాజయం పాలయ్యారు.
- 1996 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే-తమిళ మానిలా కాంగ్రెస్ కూటమి విజయం సాధించినప్పుడు, అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే ముఖ్యమంత్రి జయలలిత బర్గూర్ స్థానంలో ఓటమి పాలయ్యారు.
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత, అధికారంలో ఉండి తన నియోజకవర్గంలో ఓడిపోయిన నాలుగో ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిలిచారు. డీఎంకే పార్టీలో ఈ విధంగా ఓడిపోయిన మొదటి ముఖ్యమంత్రి ఆయనే.
పోటీ చేసిన రెండు స్థానాల్లో టీవీకే చీఫ్ విజయ్ ముందంజ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాలకు గానూ టీవీకే పార్టీ సాయంత్రం 4.30 గంటలకు 8 స్థానాల్లో విజయం సాధించగా, మరో 101 స్థానాల్లో లీడ్‌లో ఉంది.
మరోవైపు, విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.
ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం, పెరంబూర్‌లో 13 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి విజయ్ 31,766 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, తిరుచ్చి ఈస్ట్‌లో 12 రౌండ్లు ముగిసేసరికి 15,707 ఓట్ల మెజార్టీతో ఉన్నారు.
ఇదే సమయంలో ఎంకే స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. అక్కడ టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 7,731 ఓట్లకు పైగా మెజార్టీతో కొనసాగుతున్నారు.
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో చెన్నైలోని విజయ్ నివాసం వద్ద భద్రతను పెంచారు. విజయ్ పార్టీ ముందంజలో ఉండటంపై నాని, నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు వెంకట్ ప్రభు వంటి సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు.
ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఆధిక్యంలో ఉంది?
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి సహా, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలలోని అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
ఇప్పటిదాకా పూర్తయిన లెక్కింపునుబట్టి చూస్తే పశ్చిమబెంగాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే సగానికి పైగా స్థానాలలో బీజేపీ ఆధిక్యంలో సాగుతుండగా, నాలుగోసారి అధికారంలోకి రావాలనుకున్న మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ చతికిలపడింది.
ఇక తమిళనాడులోనూ ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. రాజకీయనాయకుడిగా మారిన సినీనటుడు విజయ్, తమిళనాడులో పాతుకుపోయిన పార్టీలను పక్కకు నెట్టి, విజయం వైపు దూసుకుపోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని విజయ్ టీవీకే పార్టీ సాధించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్స్ లో ఆయన పార్టీ వందకు పైగా స్థానాలతో ముందంజలో ఉంది.
కేరళలలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకుపోతున్నట్టు ఇప్పటిదాకా పూర్తయిన లెక్కింపును బట్టి తెలుస్తోంది. దీంతో భారత్‌లో వామపక్షాలకు మిగిలిన ఏకైక రాష్ట్రం కూడా వారి చేతుల నుంచి జారిపోనుంది.
అస్సాంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చే దిశగా సాగుతోంది.
పుదుచ్చేరిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి స్వల్పమొగ్గు కనిపిస్తోంది. ఇక్కడి ఫలితాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
మొత్తంగా ఫలితాలను చూస్తే రాజకీయ పరిస్థితులలో ఓ ముఖ్యమైన మార్పుకు అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ తన సంప్రదాయ బలమైన ప్రాంతాలను దాటి, ఆధిక్యంతో ముందుకు సాగుతుండగా, దక్షిణ భారత్‌లో కొత్త ప్రాంతీయ పార్టీలు పోటీల రూపాన్ని మార్చుతున్నాయి.
విజయ్: తమిళనాట 62 స్థానాలలో గెలిచి 45 సీట్లలో ఆధిక్యంలో ఉన్న టీవీకే.. కేరళలో యూడీఎఫ్ విజయం - బెంగాల్, అస్సాంలో బీజేపీ ముందంజ
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఫోకస్ అంతా ఆ సీట్లపైనే...
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆసక్తికరంగా సాగుతోంది. తమిళనాడులో అనూహ్యంగా విజయ్ పార్టీ టీవీకే ఆధిక్యం కనబరుస్తోంది. మరోవైపు దేశప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తోన్న బెంగాల్ ఫలితాల కౌంటింగ్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనావేసిన విధంగానే బీజేపీ, టీఎంసీ మధ్య గట్టి పోటీ నెలకొంది. ట్రెండ్స్‌లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా చర్చనీయాంశమైన నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీచేస్తున్న భవానీపూర్ ఒకటి. మమతను ఓడించేందుకు సువేందు అధికారిని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బరిలోకి దించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు అధికారి నందిగ్రామ్‌లో సుమారు రెండు వేల ఓట్ల తేడాతో ఆమెను ఓడించారు.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. గత పదేళ్ల నుంచి అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ జలూక్‌బరి నుంచి బరిలోకి దిగారు. గత ఐదు ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గంలో హిమంత బిశ్వ శర్మ గెలుపు జెండా ఎగరవేశారు. మూడుసార్లు కాంగ్రెస్ టికెట్‌పైన, రెండుసార్లు బీజేపీ టికెట్‌పై గెలుపొందారు.
తమిళనాడులో ఎక్కువగా చర్చనీయాంశమైన అసెంబ్లీ సీట్లలో కొళత్తూర్ నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పోటీ చేశారు.2011, 2016, 2021లలో స్టాలిన్ ఈ నియోజకవర్గంలో గెలుపొందారు. కొళత్తూర్ నియోజకవర్గంలో రెండో రౌండ్ కౌంటింగ్‌లో ఎంకే స్టాలిన్ వెనుకపడ్డారు.
అలాగే, రాజకీయాల్లోకి ప్రవేశిస్తూ విజయ్ పోటీ చేసిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుచ్చి, పెరంబూర్‌లు కూడా చర్చనీయాంశంగా మారాయి.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌కు నాయకత్వం వహిస్తున్న పినరయి విజయన్ కన్నూర్ జిల్లాలోని ధర్మదామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. విజయన్ ఈ సీటును 2021, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. అలాగే, ప్రధాన ప్రతిపక్షమైన యూడీఎఫ్ నేత వి.డి.సతీశన్ ఎర్నాకుళం జిల్లా పరవూర్ సీటు నుంచి పోటీ చేశారు.
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అత్యంత హోరాహోరీగా పోటీ ఉన్న అసెంబ్లీ స్థానాలలో తట్టంచవాడి ఒకటి. ఈ స్థానం నుంచి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి పోటీ చేశారు. ఆయనకు కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి వి. వైతిలింగం నుంచి గట్టి పోటీ ఉంది.
భవానీపుర్‌లో మమత ఆధిక్యమెంత?
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపుర్ నియోజకవర్గంలో తన సమీప ప్రత్యర్థి బీజేపీ నేత సువేందు అధికారిపై దాదాపు 2వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కువగా వార్తలలో నిలిచిన స్థానాలలో మమత పోటీ చేస్తున్న భవానీపుర్ కూడా ఉంది. ఈ నియోజకవర్గాన్ని మమతకు కంచుకోటగా పరిగణిస్తుంటారు.
అయితే ఈసారి మమతకు గట్టిపోటీ ఇచ్చేందుకు విపక్షనేత సువేందు అధికారిని బీజేపీ బరిలోకి దింపింది. కిందటిసారి ఎన్నికలలో మమత నందిగ్రామ్‌లో సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. అప్పుడు సువేందు అధికారి 2వేల ఓట్ల మెజారిటీతో మమతను ఓడించారు.
కానీ ఈసారి మమతకు గట్టిపట్టున్న భవానీపుర్‌లోనే సువేందు ఆమెపై పోటీకి దిగారు. దీంతోపాటు సువేందు తనకు బాగా పట్టున్న నందిగ్రామ్ నుంచి కూడా పోటీలో ఉన్నారు.
ఆధిక్యంలో సెంచరీ దాటిన విజయ్ పార్టీ
ప్రస్తుతానికి తమిళనాడు సినీనటుడు విజయ్ పార్టీ టీవీకే 102 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, ఏఐడీఎంకే 70 స్థానాలలోనూ, డీఎంకే 62 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికలు 2026 ట్రెండ్స్: ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఆధిక్యం ?
తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ టీవీకే ఆధిక్యంలో ఉంది. ఇక్కడ అధికార డీఎంకే 63, ఏఐడీఎంకే 67 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, టీవీకే 104 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఈ రాష్ట్రంలో మెజారిటీ సాధనకు కావాల్సినవి 118 స్థానాలు.
ఇక దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న పశ్చిమబెంగాల్లో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. టీఎంసీ 124 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ 149 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 4 స్థానాలు, వామపక్షాలు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. పశ్చిమబెంగాల్లో అధికారం దక్కాలంటే 148 స్థానాల్లో విజయం సాధించాలి.
అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్‌కు మధ్య మెజార్టీ విషయంలో చాలా అంతరం కనిపిస్తోంది.ఇక్కడ బీజేపీ 96 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 27 స్థానాలలోనూ, ఏఐయూడీఎఫ్ 2 స్థానాలలోనూ, ఇతరులు 1 స్థానంలోనూ ఆధిక్యంలో ఉన్నారు.
వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళలో ఈసారి ఆ పార్టీలు వెనకబడినట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ అధికార ఎల్‌డీఎఫ్ కూటమి 48 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, యూడీఎఫ్ కూటమి 91, ఎన్డీయే 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 22 స్థానాలలో ఎన్డీయే కూటమి ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 4 స్థానాలలో, ఇతరులు 4 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు.
తొలి రౌండ్‌లో వెనుకబడిన స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తొలిరౌండ్ ముగిసే సరికి 886 ఓట్లతో వెనుకపడ్డారు. ఆయన కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు తొలి రౌండ్ ముగిసేసరికి 4130 ఓట్లు లభించాయి.
'బ్రిజ్ భూషణ్ ఇలాకాలో పోటీలా? ఆరుగురు బాధితుల్లో నేనూ ఒకరిని' : రెజ్లర్ వినేశ్ ఫొగాట్