ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టును భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు ప్రదర్శించిన ప్రతిభ, సంకల్పం మరువలేనివని కొనియాడారు.

లైవ్ కవరేజీ

  1. వరల్డ్ కప్ 2023 ఫైనల్: అంపైర్లుగా రిచర్డ్ ఇలింగ్ వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో

    క్రికెట్ వరల్డ్ కప్ 2023

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, రిచర్డ్ ఇలింగ్ వర్త్

    యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు జరుగనుంది.

    భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి జరిగే ఈ మ్యాచ్‌లో బ్రిటన్‌కు చెందిన రిచర్డ్ ఇలింగ్ వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు.

    థర్డ్ అంపైర్‌గా జోయెల్ విల్సన్, ఫోర్త్ అంపైర్‌గా క్రిస్ గాఫ్ఫానె, మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌లను ఐసీసీ ఎంపిక చేసింది.

    చివరిసారిగా 2011లో వరల్డ్ కప్ సాధించిన భారత్, 2023 వరల్డ్ కప్‌ను గెల్చుకుని మూడో సారి ట్రోఫీని అందుకోవాలనే ఉత్సాహంతో ఉంది.

    అంపైర్‌గా రిచర్డ్ కెటిల్‌బరో

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, రిచర్డ్ కెటిల్‌బరో
  2. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.