You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

వరల్డ్ కప్ INDvsNZ: చెలరేగిన భారత్ బ్యాటర్లు, సెంచరీలు చేసిన కోహ్లీ, అయ్యర్... న్యూజీలాండ్ టార్గెట్ 398

వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధికంగా 50 సెంచరీలు చేసి చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు 49 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు.

లైవ్ కవరేజీ

  1. సహారా ఇండియా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ కన్నుమూత

    సహారా ఇండియా గ్రూప్ వ్యవస్థాపకులు సుబ్రతా రాయ్ చనిపోయారు. 75 ఏళ్ల సుబ్రతారాయ్ కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

    నవంబర్ 12న ముంబయిలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ హాస్పిటల్ & మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (కేడీఏహెచ్)లో చేరారు.

    గుండెపోటు వల్ల పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి 10:30 గంటలకు మృతి చెందారని సహారా ఇండియా పరివార్ నుంచి ప్రకటన వెలువడినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.

    “ఆయన స్ఫూర్తివంతమైన, దూరదృష్టి ఉన్న నాయకులు. ఆరోగ్య సమస్యలతో 12వ తేదీన కేడీఏహెచ్ ఆసుపత్రిలో చేరారు. 14వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో గుండెపోటుతో చనిపోయారు. ఆయన్ని కోల్పోవడం సహారా ఇండియా పరివార్‌కు తీరని నష్టం” అని సహారా ఇండియా పరివార్ పేర్కొంది.

  2. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  3. వరల్డ్ కప్ INDvsNZ: చెలరేగిన భారత్ బ్యాటర్లు, సెంచరీలు చేసిన కోహ్లీ, అయ్యర్... న్యూజీలాండ్ టార్గెట్ 398