ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం : సికింద్రాబాద్ సభలో ప్రధాని మోదీ
మాదిగలకు అన్యాయం జరిగిందని తాము భావిస్తున్నామని, 30 ఏళ్ళుగా మాదిగల పోరాటానికి నాయకత్వం వహిస్తున్న మందకృష్ణ నిజమైన యోధుడని ప్రధాని కొనియాడారు.
లైవ్ కవరేజీ
హమాస్‌పై పోరు: గాజా ఆసుపత్రులను చుట్టుముట్టిన ఇజ్రాయెల్ దళాలు

ఫొటో సోర్స్, Getty Images
గాజాలోని అల్ షిఫా, అల్-ఖుద్స్, అల్-రెంటిసి, ఇండోనేషియన్ ఆసుపత్రుల సమీపంలోకి ఇజ్రాయెల్ బలగాలు చేరుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు శుక్రవారం బీబీసీకి తెలిపారు.
అల్-షిఫా హాస్పిటల్ కింద నిర్మించిన సొరంగాల నుంచి హమాస్ దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఆసుపత్రుల సమీపంలో, వెలుపల పేలుళ్లపై నిరంతరం రిపోర్టులు అందుతున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
అరబ్ దేశాల 'అత్యవసర సమావేశం'
అరబ్, ముస్లిం దేశాల నాయకులు సౌదీ రాజధాని రియాద్‌లో శనివారం సమావేశం కాబోతున్నారు. గాజాలో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఎటాక్ నేపథ్యంలో యుద్ధాన్ని ముగించాలని ఏకగ్రీవంగా పిలుపునిచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటుచేస్తున్నారు.
'అత్యవసర శిఖరాగ్ర సమావేశం'లో భాగంగా శనివారం అరబ్ లీగ్ సమ్మిట్, ఆదివారం ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) సమావేశాలను నిర్వహిస్తున్నారు.
కాగా, ఈ సమ్మిట్‌ను గాజాలోని మిలిటెంట్ గ్రూపులలో ఒకటైన పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ ఎగతాళి చేసింది. యుద్ధం ప్రారంభమై 35 రోజులు గడిచాక ఎమర్జెన్సీ (అత్యవసర) అని ఎలా పిలుస్తారని ప్రశ్నించింది.
హలో!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎస్సీ వర్గీకరణ: ఇపుడెక్కడుంది, ఎందుకని ఆలస్యమవుతోంది
బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
