ఖతార్‌లో మరణశిక్ష పడిన మాజీ నేవి అధికారుల కేసులో భారత్ చర్యలు
‘తీర్పు చాలా రహస్యంగా ఉంచారు. కేవలం న్యాయ బృందంతో మాత్రమే ఈ సమాచారాన్ని షేర్ చేశారు. తదుపరి న్యాయపరమైన చర్యల కోసం మేం చూస్తున్నాం’’ అని బాగ్చి తెలిపారు.
లైవ్ కవరేజీ
లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
ఖతార్‌లో మరణశిక్ష పడిన మాజీ నేవి అధికారుల కేసులో భారత్ చర్యలు

ఫొటో సోర్స్, ANI
ఖతార్‌లో 8 మంది మాజీ నేవి అధికారులకు విధించిన మరణ శిక్ష కేసులో భారత ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసిందని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు.
ఖతార్ అధికార యంత్రాంగంతో భారత్ సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
ఈ మాజీ నేవి అధికారులు గత సంవత్సరం ఆగస్ట్‌లో అరెస్ట్ అయ్యారు. గత నెలలో వీరికి మరణ శిక్ష విధించింది ఖతార్.
ఈ కేసుకు చెందిన సమాచారం ఇంకా అందుబాటులో లేదని, నవంబర్ 8న ఈ మాజీ నేవి అధికారులను కలిసేందుకు కాన్సులర్ యాక్సెస్ లభించిందన్నారు.
‘‘తీర్పు చాలా రహస్యంగా ఉంచారు. కేవలం న్యాయ బృందంతో మాత్రమే ఈ సమాచారాన్ని షేర్ చేశారు. తదుపరి న్యాయపరమైన చర్యల కోసం మేం చూస్తున్నాం’’ అని బాగ్చి తెలిపారు.
‘‘మాజీ నేవి అధికారులు కుటుంబాలతో మేం మాట్లాడుతున్నాం. దిల్లీలో ఈ మాజీ అధికారుల కుటుంబాలను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కలిశారు. భవిష్యత్‌తో వీరికి అవసరమైన న్యాయపరమైన, కాన్సులర్ సాయాన్ని అందిస్తాం’’ అని ఆయన చెప్పారు.
మృతదేహాలకు స్నానం చేయించి, మేకప్ చేసి అంత్యక్రియలకు సిద్ధం చేస్తున్న 24 ఏళ్ల మహిళ
క్రికెట్ వరల్డ్ కప్: అఫ్గానిస్తాన్ మనసుల్ని గెలిచింది...సంక్షోభంలో ఉన్న దేశానికి ఇదెలా సాధ్యమైంది?
ఆర్ధిక నేరాలు: ‘నాకు తెలియదు, గుర్తు లేదు’ అని కోర్టుల్లో చెప్పడం కేసుల నుంచి తప్పించుకునే పెద్ద వ్యూహమా?
నామినేషన్ ర్యాలీలో వాహనంపై నుంచి ముందుకు పడిపోయిన కేటీఆర్

ఫొటో సోర్స్, UGC
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో మంత్రి కేటీఆర్‌కు, మరికొందరు బీఆర్‌ఎస్ నేతలకు స్వల్ప గాయాలయ్యాయి.
నామినేషన్‌కు ముందు ప్రచార రథంపై ఆర్మూర్ వీధుల్లో రోడ్ షో నిర్వహిస్తుండగా వాహనం పైభాగంలో ప్రజలకు అభివాదం చేసేందుకు ఏర్పాటు చేసిన రెయిలింగ్ విరిగి పోయింది. దీంతో ఆయన ముందుకు పడిపోయారు.
కేటీఆర్‌తో పాటూ రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు ముందుకు పడిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
కేటీఆర్ వెనుక ఉన్న గన్‌మెన్ చాకచక్యంగా వ్యవహరించి కేటీఆర్‌ను వాహనంపై నుండి రోడ్డుపై పడిపోకుండా పట్టుకున్నారు.
ఎంపీ సురేష్ రెడ్డి వాహనంపై నుండి పూర్తిగా కింద పడిపోయారు.

ఫొటో సోర్స్, UGC
ప్రత్యక్ష సాక్షుల అందించిన సమాచారం ప్రకారం వాహనానికి విద్యుత్ తీగలు అడ్డురావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారనీ, దీంతో టాప్ మీదున్న నేతలు ముందుకు తూలడం, రెయిలింగ్ విరగడం వెంటవెంటనే జరిగిపోయాయి.
తన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి కేటీఆర్ తెలిపారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గాజాలో రోజూ 160 మంది పిల్లలు చనిపోతున్నారు- డబ్ల్యూహెచ్‌వో
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై దీపావళి తర్వాత తీర్పు వెలువరించే అవకాశం ఉందని పేర్కొన్న న్యాయస్థానం, ఫైబర్ నెట్ కేసు విచారణను నవంబర్ 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
గత నెలలో ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించడంపై చంద్రబాబు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన ఇద్దరు సభ్యుల బెంచ్ విచారణ జరిపింది.
క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెలువడిన తర్వాత ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామని జస్టిస్ అనిరుద్ధ బోస్ తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు అక్టోబర్ 17న సుప్రీం కోర్టు బెంచ్ తెలిపింది.
గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేసిన సీఎం కేసీఆర్

ఫొటో సోర్స్, UGC
ఫొటో క్యాప్షన్, గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేసిన సీఎం కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఆర్‌వో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
పశువును ఢీకొట్టి పట్టాలు తప్పిన రైలు

ఫొటో సోర్స్, ANI
పశువును ఢీకొట్టిన రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన ఒడిశాలో జరిగింది.
ఝార్సుగూడ నుంచి సంబల్‌పూర్ వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలు సంబల్‌పూర్ జిల్లాలోని సరల సమీపంలో ఓ పశువును ఢీకొట్టి, పట్టాలు తప్పిందని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
అక్టోబర్ 8 సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. సంబల్‌పూర్ డివిజన్ మేనేజర్ సహా అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి ట్రాక్ పునరుద్ధరణ పనులు చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు

ఫొటో సోర్స్, FB/Ponguleti
ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
గురువారం తెల్లవారుఝామున అధికారులు ఆయన ఇంటికి వచ్చారు. దాదాపు పది వాహనాల్లో వచ్చారు.
ఆయన ఇంట్లో సిబ్బంది, కుటుంబ సభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి.
ఇవాళ ఆయన నామినేషన్ వేయాలని సిద్ధం అవుతున్న వేళ ఈ సోదాలు జరగడంతో, నామినేషన్ ఎప్పుడు వేస్తారన్నది తెలియాల్సి ఉంది.
తనపై ఐటీ దాడులు జరుగుతాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందే వ్యాఖ్యానించారు.
నవంబర్ 5న బీబీసీ ప్రతినిధి బళ్ల సతీష్‌తో పొంగులేటి ఏం చెప్పారో ఈ కింది వీడియోలో చూడొచ్చు.
పోస్ట్ YouTube స్కిప్ చేయండిGoogle YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసంఇక్కడ క్లిక్చేయండి.
