రోబో: ఫుడ్ బాక్స్ అనుకుని కన్వేయర్ బెల్ట్ మీదకు నెట్టడంతో వ్యక్తి మృతి

రోబో సరిగ్గా పనిచేయడం లేదని తెలియడంతో బుధవారం రాత్రి ఈ మెషిన్‌ను పరిశీలించేందుకు అక్కడకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

    ధన్యవాదాలు.

  2. రోబో: ఫుడ్ బాక్స్ అనుకుని కన్వేయర్ బెల్ట్ మీదకు నెట్టడంతో వ్యక్తి మృతి

    రోబో

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    దక్షిణ కొరియాలో ఒక రోబో కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

    ఆహార బాక్సులను హ్యాండిల్ చేసే రోబో.. ఫుడ్ బాక్సులకు, వ్యక్తికి మధ్య తేడాను కనుక్కోలేకపోవడంతో ప్రమాదవశాత్తు ఆ వ్యక్తి మరణించారని న్యూస్ రిపోర్టులు తెలిపాయి.

    రోబోను తనిఖీ చేస్తోన్న సమయంలో ఈ ఘటన జరిగింది.

    వ్యక్తిని వెజిటేబుల్స్ బాక్స్ అనుకున్న రోబో, అతన్ని కన్వేయర్ బెల్ట్‌ మీదకు నెట్టింది.

    దీంతో ఆయన ముఖం, ఉదర భాగం తీవ్రంగా దెబ్బతిన్నాయని దక్షిణ కొరియా న్యూస్ ఏజెన్సీ యోన్‌హ్యాప్ తెలిపింది.

    ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందారు.

    దక్షిణ జియోంగ్‌సాంగ్ ప్రావిన్స్‌లో పెప్పర్ సార్టింగ్ ప్లాట్‌లో టెస్ట్ రన్ నిర్వహించే సమయంలో రోబో సెన్సార్ ఆపరేషన్స్‌ను పరిశీలించేందుకు ఆ వ్యక్తి వెళ్లారని న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

    టెస్ట్ రన్‌ను నవంబర్ 6నే నిర్వహించాల్సి ఉంది. కానీ, రోబో సెన్సార్‌లో సమస్య తలెత్తడంతో దాన్ని రెండు రోజులు వెనక్కి జరిపారు.

    రోబోలను తయారు చేసే కంపెనీలో ఈ వ్యక్తి పనిచేస్తున్నారు. ఇది సరిగ్గా పనిచేయడం లేదని తెలియడంతో బుధవారం రాత్రి ఈ మెషిన్‌ను పరిశీలించేందుకు అక్కడకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది.

    మార్చిలో కూడా దక్షిణ కొరియాలో ఒక 50 ఏళ్ల వ్యక్తి ఆటోమొబైల్ పార్ట్స్ తయారీ ప్లాంట్‌లో పనిచేసే సమయంలో రోబో బారిన పడి తీవ్ర గాయాలు పాలయ్యారు.

  3. వరల్డ్ కప్‌లో టీమిండియాకు తిరుగే లేదా, అన్‌స్టాపబులా?

  4. పసిఫిక్ మహాసముద్రం: అర కిలోమీటర్ లోతు అగాథంలో 3 రోజులు చిక్కుకున్న నావికులు, చివరికి ఎలా కాపాడారంటే...

  5. ఆంధ్రప్రదేశ్ - దిశా: ఓటీపీ చెప్పాలంటూ ఆర్మీ జవాన్‌పై పోలీసుల దౌర్జన్యం, మగవాళ్ల‌తో ఈ యాప్ ఎందుకు ఇన్‌స్టాల్ చేయిస్తున్నారు?

  6. హమాస్ కీలక నేత మొహసేన్ అబు జినా మరణించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటన

    హమాస్ కీలక నేత మోహసిన్ అబు జినా

    ఫొటో సోర్స్, idf

    హమాస్ కీలక నేత మొహసేన్ అబు జినా మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) ప్రకటించాయి.

    ఐడీఎఫ్ అందించిన సమాచారం ప్రకారం, అబు జినా హమాస్ ఇంటెలిజెన్స్, ఆయుధాల విభాగానికి అధినేతగా ఉన్నారు.

    వ్యూహాత్మక ఆయుధాలు, రాకెట్లను తయారు చేసే నేతల్లో ఈయన ఒకరని ఐడీఎఫ్ తెలిపింది.

    గాజా లోపల ఆపరేషన్‌‌ను తీవ్రతరం చేశామని, నగరం నడిబొడ్డుకు చేరుకున్నామని ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఐడీఎఫ్ చెప్పింది.

    హమాస్ మౌలిక సదుపాయాలపై దాడి చేయాలని తమ విమానాలకు ఆదేశాలు జారీ చేసినట్లుపేర్కొంది.

    గాజా నగరంపై జరుగుతోన్న వైమానిక దాడుల్లో ప్రజల ఇళ్లు ధ్వంసమయ్యాయని, ప్రజలు చనిపోయారని రిపోర్టులు వస్తున్నాయి.

  7. వరల్డ్ కప్ 2023: ఈ బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబుల్ హసన్ చుట్టూ ఎందుకిన్ని వివాదాలు?

  8. ఏపీ-తెలంగాణ: NMC కొత్త నిబంధనలు అమలులోకి వస్తే ఎంబీబీఎస్ సీట్లు తగ్గిపోతాయా?

  9. దక్షిణ కొరియాపై నల్లుల దండయాత్ర... ఆస్పత్రులకు జనం పరుగులు

  10. మ్యాక్స్‌వెల్ ఏమన్నాడు?

    క్రికెట్ వరల్డ్ కప్ 2023

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, 128 బంతుల్లో 201 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్

    ప్రపంచ కప్‌లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మంగళవారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ తొడ కండరాల నొప్పి భరించలేనంతగా వేధిస్తున్నా, దానిని పంటి బిగువున నొక్కి పెడుతూ బ్యాటింగ్ కొనసాగించాడు. 128 బంతుల్లో 201 పరుగులు చేసిన అతడు ‘ప్లేయర్ ఆఫ ద మ్యాచ్’గా నిలిచాడు.

    బ్యాటింగ్‌ సమయంలో తనను కండరాల నొప్పి వేధించడం, తాను అలాగే బ్యాటింగ్ కొనసాగించి, జట్టును గెలిపించడంపై మ్యాక్స్‌వెల్ ఇలా స్పందించాడు.

    “మే ఫీల్డింగ్‌లోకి దిగే సమయానికే ఎండ ఎక్కువగా ఉంది. వేడివాతావరణాన్ని తట్టుకునేలా నేను తగినంత వ్యాయామం చేయలేదు కూడా. ఆ ప్రభావం నాపై పడింది. మా బ్యాటింగ్ వ్యూహానికి అనుగుణంగానే బరిలోకి దిగాం. కానీ, పరిస్థితులు మారిపోయాయి. నేను సానుకూల ధృక్పథంతోనే ఆట కొనసాగించాను. అఫ్గాన్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూనే పరుగులు సాధించేందుకు ప్రయత్నించాను. ఎల్‌బీడబ్ల్యూ అప్పీల్ తర్వాత, నేను మరింత దూకుడుగా ఆడాలని నాకు అర్థమైంది. మీరు నా ఇన్నింగ్స్‌లో తేడాను గమనించే ఉంటారు. అఫ్గాన్ బౌలర్లు బాగా బౌలింగ్ చేసి, మమ్మల్ని మొదట్లోనే ఒత్తిడిలోకి నెట్టేశారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో ఆడే అవకాశం వచ్చినా నేను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయాను. ఇప్పుడు చివరి వరకు క్రీజులో ఉండి, నా జట్టును గెలిపించడం నాకు చాలా గర్వంగా ఉంది” అన్నాడు.

    ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందిస్తూ, “నాకు సంతోషంతో మాటలు రావడం లేదు. అద్భుతమైన విజయం ఇది. ఇదివరకెన్నడూ చూడనిది. మ్యాక్స్‌వెల్‌కు ఇన్నింగ్స్ ఆసాంతం ఒక ప్రణాళిక ఉంది. లక్ష్యానికి 200 పరుగులు దూరంలో ఉన్నా, మేం ఇలాంటి విజయాన్ని సాధించగలగడం చాలా ప్రత్యేకం” అన్నారు.

  11. ‘మేం వెనకడుగు వేయం’ - బీబీసీతో మణిపుర్ వైరల్ వీడియోలోని బాధిత మహిళలు

  12. గాజా సిటీ నడిబొడ్డుకు చేరుకున్న ఇజ్రాయెల్ రక్షణ దళాలు

    ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం

    ఫొటో సోర్స్, EPA

    తమ రక్షణ దళాలు గాజా నగరం నడిబొడ్డుకు చేరుకున్నాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ తెలిపారు.

    ఇజ్రాయెల్ సైన్యం, వైమానిక దళం, నావికా దళాలు పరస్సర సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని ఆయన చెప్పారు.

    ఇజ్రాయెల్‌పై హమాస్ అక్టోబర్ 7 దాడి జరిగిన నెల రోజుల్లో గాజాను సైన్యం చుట్టుముట్టిందని రక్షణ మంత్రి అన్నారు.

    ''మా సైనికులు గాజా నగరాన్ని చుట్టుముట్టారు. గాజా నగరంలో ఆపరేషన్ చేపడతారని ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు'' అని ఆయన చెప్పారు.

    మరోవైపు, గాజా ప్రజలు దక్షిణ ప్రాంతానికి వెళ్లిపోవాలని నెతన్యాహు పిలుపునిచ్చారు.

    యుద్ధం తర్వాత గాజా భద్రత బాధ్యత పూర్తిగా ఇజ్రాయెల్ తీసుకుంటుందంటూ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలపై ఆయన వార్ క్యాబినెట్‌లోని సభ్యుడు, వ్యూహాత్మక వ్యవహారాల మంత్రి రోన్ డెర్మర్, బీబీసీ వరల్డ్ సర్వీస్ న్యూస్ అవర్‌లో మాట్లాడారు.

    నెతన్యాహు మాటలకు అర్థం గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్ తిరిగి ఆక్రమించుకుంటుందనిగానీ, అక్కడ పాలన సాగిస్తుందనిగానీ కాదని మంత్రి చెప్పారు.

    టెర్రరిస్టు ముప్పును ఎదుర్కొనేందుకు సైన్యం గాజాలో భద్రతా కార్యకలాపాలను నిర్వహిస్తుందని ఆయన అన్నారు.

    యుద్ధం నేపథ్యంలో సుమారు 400 మందికి పైగా అమెరికా పౌరులు ఇప్పటివరకు రఫా క్రాసింగ్ దాటి ఈజిప్ట్‌‌కు వెళ్లారని యూఎస్ విదేశీ వ్యవహారాలశాఖ తెలిపింది.

    అంతకుముందు, దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్, రఫా, డెయిర్ అల్-బలాహ్ పట్టణాలపై జరిగిన వైమానిక దాడుల్లో డజన్ల మంది చనిపోయినట్లు వార్తలొస్తున్నాయి.

    హమాస్ ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఇప్పటివరకు గాజాలో 10,300 మంది చనిపోయారు. వారిలో 4,100 మంది చిన్నారులు ఉన్నారు. ఇజ్రాయెల్‌లో 1,400 మంది చనిపోగా, 200 మంది హమాస్ చెరలో బందీలుగా ఉన్నారు.

  13. గ్లాడియేటర్, ‘గాయపడ్డ సింహం’.. మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం

  14. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.