బిహార్ కుల సర్వే: రిజర్వేషన్లను 65 శాతానికి పెంచాలని ప్రతిపాదించిన సీఎం నితీశ్
‘‘ఇతర వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన కోటాలు పెంచాల్సి ఉంది’’ అని అసెంబ్లీలో కుల సర్వేను ప్రవేశపెట్టి చర్చ చేపట్టిన సందర్భంగా నితీశ్ కుమార్ అన్నారు.
లైవ్ కవరేజీ
మ్యాక్స్‌వెల్ వీరోచిత డబుల్ సెంచరీ.. అఫ్గానిస్తాన్‌పై ఆస్ట్రేలియా అనూహ్య విజయం
పవన్ కల్యాణ్: ప్రధాని నరేంద్ర మోదీ సభలో జనసేన అధ్యక్షుడు ఏం మాట్లాడారంటే....
తెలంగాణకు బీసీ సీఎం అవుతారన్న నరేంద్ర మోదీ, ఈ ప్రధాని నా కలలకు ప్రతిరూపమన్న పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, ANI
ఓబీసీ అయిన తాను ఎల్‌బీ స్టేడియం నుంచే దేశానికి ప్రధాని అయ్యానని, తెలంగాణకు కూడా ఇక్కడి నుంచే బీసీ సీఎం అవుతారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ఈ నేలతో తనకు విడదీయని బంధం ఉందని తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
‘‘2013లో ఈ గ్రౌండ్‌కు నన్ను ఆహ్వానించారు. ఇలా ఇక్కడి నుంచే మోదీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం దక్కింది. మీ ఆశీర్వాదంతో, బీజేపీ తొలి సీఎం, బీసీ సీఎం కూడా ఇక్కడి నుంచే అవుతారని నేను నమ్మకంతో చెబుతున్నాను’’ అని మోదీ అన్నారు.
‘బీసీ ఆత్మ గౌరవ సభ’ పేరుతో హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ సర్కారు బీసీలను పట్టించుకోవడం లేదని మోదీ విమర్శించారు. బీఆర్ఎస్ సర్కారును బీసీ విరోధి సర్కారుగా అభివర్ణించారు మోదీ.
నీళ్లు, నిధులు, నియామకాలపై తెలంగాణ ఏర్పడిందని, కానీ వాటిని పట్టించుకోవడం లేదన్నారు.
తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి సీ టీమ్ బీఆర్ఎస్ అని ఆరోపించారు. మూడు విషయాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు కామన్ అంశాలు ఉన్నాయని, అవి కుటుంబ పాలన, అవినీతి, బుజ్జగింపు అని విమర్శించారు.
అవినీతి సొమ్ము తిన్న ఏ ఒక్కర్నీ వదిలేది లేదని హెచ్చరించారు.
‘‘అభివృద్ధి వ్యతిరేక, వెనుకబడిన తరగతుల వ్యతిరేక, యాంటీ ఎస్‌సీ, ఎస్టీ ప్రభుత్వం తెలంగాణలో ఉంది. నవంబర్ 30న ఈ ప్రభుత్వాన్ని తొలగించే అవకాశం మీముందుంది.’’ అని అన్నారు.
పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...
ఇదే సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా మాట్లాడారు.
తెలుగురాష్ట్రాల పరిస్థితిని చూస్తే ఐదేళ్ళకోసారి ఎన్నికలన్నట్టుగా కాకుండా, ఐదు సంవత్సరాలూ ఎన్నికలే అన్నట్టుగా ఉందని జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పారు.
ఇలాంటి వాతావరణంలో ఘర్షణే తప్ప నిజమైన అభివృద్ధి కనిపించదన్నారు. తెలంగాణ భాగవతం పుట్టిన నేల అని, ఇక్కడ బతుకు భారం కాకూడదని, మోదీ నేతృత్వంలో బీసీల తెలంగాణ రావాలి, సామాజిక తెలంగాణ నిలదొక్కుకోవాలన్నారు.
తెలంగాణలో బీసీలు ముఖ్యమంత్రి కావాలన్న పవన్ కల్యాణ్, ఇందుకోసం బీజేపీకి, మోదీకి జనసేన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు.
విజన్ 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలంటే మూడోసారి ఔర్ ఏక్ బార్ మోదీజీ అంటూ పవన్ నినదించారు. తాము బీజేపీతో కలిసి పోటీచేయడానికి అవకాశం ఇచ్చినందుకు ఆయన మోదీ సహా తెలంగాణ బీజేపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బిహార్ కుల సర్వే: రిజర్వేషన్లను 65 శాతానికి పెంచాలని ప్రతిపాదించిన సీఎం నితీశ్

ఫొటో సోర్స్, biharvidhansabha
కుల గణనను ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో రిజర్వేషన్లను పెంచాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రతిపాదించారు.
వెనుకబడిన, అణగారిన, షెడ్యూల్డ్ కాస్ట్, గిరిజన కేటగిరీలకు ప్రస్తుతమున్న 50 శాతం రిజర్వేషన్‌ను 65 శాతానికి పెంచాలని బిహార్ అసెంబ్లీలో నితీశ్ కుమార్ అన్నారు.
దీనిలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి(ఈడబ్ల్యూఎస్‌కు) అందించే 10 శాతం రిజర్వేషన్‌ను కూడా కలుపుకుంటే, ప్రతిపాదిత రిజర్వేషన్ 75 శాతానికి పెరగనుంది.
‘‘కుల గణన డేటాను ఆధారంగా చేసుకుంటే తదుపరి నిర్ణయాలు సామాజిక, ఆర్థిక, విద్యా అంశాలు పరిగణనలోకి తీసుకుని ఉండాలి. కుల ఆధారిత జనాభా సర్వేలో, వర్గీకరణ గణాంకాలను గుర్తించాం‘‘ అని చెప్పారు.
బిహార్ విడుదల చేసిన కుల సర్వేలో ఇతర వెనుకబడిన కులాల వారు(ఓబీసీలు) 27.12 శాతం, అత్యంత వెనుకబడిన వర్గాల వారు(ఈబీసీలు) 36.01 శాతం, షెడ్యూల్డ్ కులాల వారు 19.65 శాతం, షెడ్యూల్డ్ తెగలవారు 1.68 శాతం ఉన్నారు.
జనాభాలో అగ్రవర్ణాలుగా చెప్పే వారి సంఖ్య 15.52 శాతంగా ఉంది.
ఓబీసీలు 27.12 శాతం, ఈబీసీలు 36.01 శాతం కలుపుకొని బీసీలు 63.13 శాతం మంది ఉన్నారు.
మొత్తం రాష్ట్ర జనాభా 13 కోట్లు.
ప్రస్తుతం నితీష్ కుమార్ ప్రతిపాదించిన రిజర్వేషన్ పరిమితి, సుప్రీంకోర్టు నిర్దేశించిన సీలింగ్ పరిమితి 50 శాతం కంటే ఎక్కువగా ఉంది.
‘‘ఇతర వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన కోటాలు పెంచాల్సి ఉంది’’ అని అసెంబ్లీలో కుల సర్వేను ప్రవేశపెట్టి చర్చ చేపట్టిన సందర్భంగా నితీశ్ కుమార్ అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
టైమ్డ్ అవుట్: అప్పీల్ వెనక్కి తీసుకోనన్న షకీబ్, ఇది కామన్‌సెన్స్‌కు సంబంధించిన అంశమన్న మాథ్యూస్
సెమీస్‌లో ఇండియా ప్రత్యర్థి ఎవరు? భారత్, పాకిస్తాన్ మరోసారి తలపడతాయా?
ఉల్లి ధరలు ఎందుకు పెరిగాయి? ఇంకెంత కాలం ఇలా ఉంటాయి?
యుద్ధం తర్వాత గాజా భద్రత బాధ్యత మాదే: నెతన్యాహు

ఫొటో సోర్స్, Getty Images
గాజా స్ట్రిప్‌లో యుద్ధం ముగిసిన తర్వాత దాని భద్రత బాధ్యతంతా తమదేనని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా చానల్ ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
అయితే, హమాస్ నియంత్రణ నుంచి బందీలను విడిపించే వరకు యుద్ధాన్ని ఆపాలన్న డిమాండ్‌ను ఆయన తిరస్కరించారు.
గాజాను 2007 నుంచి హమాస్ పాలిస్తోంది. అయితే గాజా గగనతలాన్ని, తీరాన్ని ఇజ్రాయెల్ నియంత్రిస్తోంది.
మానవతా కారణాలతో యుద్ధాన్ని కొంత కాలం నిలిపివేయడం సాధ్యం కావొచ్చని నెతన్యాహు చెప్పారు.
పరిస్థితులను సమీక్షించి, గాజాకు వస్తువులు, మానవతా సాయం వెళ్లేలా యుద్ధాన్ని గంటో, రెండో గంటలు ఆపుతామని, అది ఇంతకుముందు కూడా చేశామని తెలిపారు.
యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించాలని అమెరికాతోపాటు ఫ్రాన్స్ సహా అనేక యూరోపియన్ దేశాలు ఇజ్రాయెల్, హమాస్‌లను కోరుతున్నాయి.
అమెరికా దీనిపై మిడిల్ ఈస్ట్‌లోని పలు దేశాలతో మాట్లాడుతోంది కూడా.
సోమవారం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తుర్కియే వెళ్లి చర్చలు జరిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్: సుక్మాలో ఐఈడీ పేలుడు.. సీఆర్పీఎఫ్ కమాండోకు గాయాలు

ఫొటో సోర్స్, Getty Images
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో జరిగిన ఐఈడీ పేలుడులో సీఆర్పీఎఫ్ కమాండో గాయపడినట్లు పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.
రాష్ట్రంలో మంగళవారం పోలింగ్ ప్రారంభమైంది. తొలి దశలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలేు సహా 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
అందులో 10 స్థానాలైన మొహ్లా-మన్‌పూర్, అంతగఢ్, భానుప్రతాపూర్, కంకేర్, కేష్‌కల్, కొండగావ్, నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొంటాలలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల కమిషన్.
తమ పార్టీ నాయకులతో నిరంతరం మాట్లాడుతున్నానని, ఈ పేలుడు ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపలేదని, ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారని కాంగ్రెస్ నాయకుడు ప్రమోద్ తివారీ తెలిపారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దొడ్డిదారిన అమెరికా వెళ్లి పట్టుబడిన 96 వేల మంది భారతీయులు.. వాళ్లంతా అక్కడి వరకు ఎలా వెళ్లారు?
నేడు ఛత్తీస్‌గఢ్ , మిజోరాంలలో పోలింగ్

ఫొటో సోర్స్, ANI
ఛత్తీస్‌గఢ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది.
ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలకుగాను మొదటి దశలో 20 స్థానాలకు, మిజోరాంలో మొత్తం 40 స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది.
ఓటింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.
ఛత్తీస్‌గఢ్‌లో మిగిలిన 70 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఓటు వేయకుండానే వెళ్లిపోయిన మిజోరాం సీఎం
మిజోరాం సీఎం జోరమ్‌తంగా మంగళవారం ఉదయం ఐజ్వాల్‌లోని వెంగ్లాయ్ హాల్ పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వెళ్లారు.
అయితే ఈవీఎం మొరాయించడంతో ఆయన ఓటు వేయలేకపోయారని వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది.
''చాలాసేపు వేచి ఉన్నాను. కానీ, ఈవీఎం పనిచేయలేదు. నా నియోజకవర్గం సందర్శించి, సమావేశం అనంతరం మళ్లీ వచ్చి ఓటు వేస్తాను'' అని జోరమ్ తంగా ఏఎన్ఐతో అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
