అక్రమాస్తుల కేసులో జగన్‌కు, సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు

ఈ కేసులో విచారణలో ఆలస్యానికి కారణాలను తెలియజేస్తూ, విచారణ మరో రాష్ట్రానికి ఎందుకు బదిలీ చేయకూడదో తమ వాదన తెలపాలంటూ సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

లైవ్ కవరేజీ

  1. పిఠాపురం: ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య వివాదం ఏంటి?

  2. టీ20 ప్రపంచ కప్ సమయంలో ‘‘డ్రగ్స్ తీసుకున్న పాకిస్తానీ క్రికెటర్’’ - ఐసీసీ నివేదికపై పీసీబీ ఏం చెబుతోంది?

  3. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వార్తలు నిజం కాదు: కేంద్రం స్పష్టత

    పెట్రోల్, డీజిల్ ధరలు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

    ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ వస్తున్న వార్తలను కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఖండించింది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపింది.

    పెట్రోల్, డీజిల్ లీటరుకు రూ. 25-28 మేర పెరగొచ్చంటూ వచ్చిన కొన్ని మీడియా కథనాలను ఈ సందర్భంగా కొట్టి పారేసింది. అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం పరిశీలనలో లేదని పెట్రోలియం శాఖ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొంది.

    అంతర్జాతీయంగా ధరలు పెరిగినా ఆ భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వం, చమురు సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపింది.

  4. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ బూత్ సమీపంలో బాంబు పేలుడు వార్తలు

    పశ్చిమ బెంగాల్‌

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, పశ్చిమ బెంగాల్‌లో మొదటి విడతలో 152 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.

    పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ ప్రారంభమైన తర్వాత వేర్వేరు ప్రాంతాలలో చెదురుమదురు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

    ముర్షిదాబాద్ జిల్లాలోని డోంకల్ నియోజకవర్గంలో సీపీఐ(ఎం), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు గాయపడ్డారు. దీంతో స్థానికులు బూత్ నంబర్ 217 వద్ద ఓటు వేయడానికి వెళ్లలేకపోయారు.

    బీబీసీ బంగ్లా కథనం ప్రకారం, ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన ముర్షిదాబాద్ పోలీసులు.. ఓటర్లు నిర్భయంగా వచ్చి ఓటు వేయాలని మైకుల ద్వారా విజ్ఞప్తి చేశారు. వారికి పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

    ముర్షిదాబాద్ జిల్లాలో నౌదా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని శివనగర్‌లో ఒక పోలింగ్ కేంద్రం సమీపంలో బాంబు పేలుడు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

    మరోవైపు, మాల్దా జిల్లాలోని మోతాబారిలో ఈవీఎంలు మొరాయించడంతో ఉదయం కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. అధికారులు అక్కడికి చేరుకోగా, వారు ఆలస్యంగా వచ్చారని ఆరోపిస్తూ స్థానికులు నిరసన తెలిపారు. సమస్య పరిష్కారం కావడంతో పోలింగ్ తిరిగి ప్రారంభమైందని ఎన్నికల సంఘం వెల్లడించింది.

  5. కవల పిల్లలకు వేరు వేరు తండ్రులు.. ఇదెలా సాధ్యమైంది? ఈ కేసు గురించి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?

  6. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

  7. 'గెలిచేశానని అనుకున్నాడు'.. కానీ, చివరిక్షణంలో..

  8. 'నమాజ్‌‌తో ఆరోగ్య ప్రయోజనాలు’అనే వీడియోతో ట్రోలింగ్‌కు గురైన నమిత థాపర్ ఎవరు?

  9. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి

  10. "నా సొంత ఇంట్లోనే నన్ను రహస్యంగా వీడియో తీయడం చిత్రవధకు గురిచేసింది’’

  11. పహల్గాం దాడి: ఏడాది గడిచినా ఆ బాధ వీడటం లేదు.. బాధితులు ఏం చెబుతున్నారు?

  12. గర్భిణులు పూర్వం కూర్చుని ప్రసవించేవారా?

  13. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకటరామిరెడ్డి డిస్మిస్‌, అసలేం జరిగింది, ఎవరేమన్నారు?

  14. హార్ముజ్‌కు భారత్ యుద్ధనౌకలను పంపగలదా? పరిణామాలు ఎలా ఉంటాయి, రక్షణ నిపుణులు ఏం చెబుతున్నారు?

  15. నందిగ్రామ్‌: ‘ఇక్కడ తొలగించిన ఓట్లలో ఎక్కువ శాతం ముస్లింలవే’ అనే ఆరోపణలు ఎందుకు వినిపిస్తున్నాయి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  16. తమిళనాడు ఎన్నికలు 2026: ద్రవిడ కోటలో విజయ్ 'ఎంట్రీ'.. ఈ పోరులో గెలుపెవరిది?

  17. ‘షార్ట్స్ ధరించడం లైంగిక వేధింపులకు ఆహ్వానం పలకడం వంటిదే’నన్న వైస్ చాన్స్‌లర్.. షార్ట్స్‌ వేసుకుని యూనివర్సిటీలో విద్యార్థుల నిరసన

  18. భారత్‌లో ఎంత బంగారం ఉందో తెలుసా?

  19. బ్యాటింగ్‌లో సిక్సర్లు, బౌలింగ్‌లో వికెట్లు, ఓవరాల్‌గా విజయాలు.. పంజాబ్ కింగ్స్‌కు ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి?

  20. రూ.20 నోటు వెనక ఉన్న చిత్రం చరిత్రేమిటో తెలుసా?